తమిళంలో ఘన విజయం సాధించిన 'జయన్ కొండాన్' అనే సినిమాను తెలుగులో సత్యదేవా పిక్చర్స్ బ్యానర్ పై ఆర్.సత్యనారాయణ 'మార్గం' అనే టైటిల్ తో మార్చి చివరి వారంలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాత సత్యనారాయణ విలేకర్లతో మాట్లాడుతూ "ఈ సినిమా తెలుగు రైట్స్ కోసం చాలా మంది ప్రయత్నించారు కాని ఈ సినిమాను నేను రిలీజ్ చేయడం చాలా ఆనందంగా ఉంది. అన్ని రకములైన విలువలు కలిగిన కమర్షియల్ ఫ్యామిలీ ఎంటర్ టైన్మెంట్ సినిమా ఇది. లండన్ లో ఉన్న ఓ కుర్రాడు తన ఉద్యోగం వదిలేసి ఇండియాకి వచ్చిన తను అనుకోని ఓ సంఘటనలో ఇరుక్కుంటాడు. ఆ పరిస్థితుల నుంచి హీరో తనను, తన ఫ్యామిలీ ను ఎలా రక్షించుకోగలిగాడనేదే కథ. మణిరత్నం గారి దగ్గర కో.డైరెక్టర్ గా పని చేసిన ఆర్.కన్నన్ ఈ చిత్రాన్ని అధ్బుతంగా తెరకెక్కించారు. హీరో వినయ్, హీరోయిన్ భావన చాలా బాగా నటించారు. విలన్ పాత్రలో నటించిన సతీష్ అధ్బుతంగా నటించాడు. మార్చి రెండవ వారంలో ఆడియోను, మార్చి చివరి వారంలో సినిమాను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. తమిళంలో 100 రోజులు ఆడిన ఈ సినిమా తెలుగులో కూడా సూపర్ హిట్ అవుతుందని భావిస్తున్నాను" అని అన్నారు.