Advertisementt

'లవకుశ' ప్రమోషనల్ సాంగ్ రిలీజ్..!

Fri 06th Mar 2015 06:39 AM
  'లవకుశ' ప్రమోషనల్ సాంగ్ రిలీజ్..!
'లవకుశ' ప్రమోషనల్ సాంగ్ రిలీజ్..!
Advertisement
Ads by CJ

వరుణ్‌ సందేశ్‌ ద్విపాత్రాభినయంతో జి.ఆర్‌89 ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై జయశ్రీశివన్‌ దర్శకత్వంలో సంగారెడ్డి పేట ప్రకాష్‌, వి.సత్యమోహన్‌రెడ్డి, పండుబాబు సంయుక్తంగా నిర్మిస్తున్న లవ్‌ ఎంటర్‌టైనర్‌ ‘లవకుశ’. ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషనల్‌ సాంగ్‌ను గురువారం హైదరాబాద్‌లో విడుదల చేశారు. డా॥ బ్రహ్మానందం, ప్రభాస్‌ శ్రీను తదితరులపై చిత్రీకరించిన ఈ పాటను కాసర్ల శ్యామ్‌ రచించగా రామ్‌నారాయణ్‌ సంగీతం సమకూర్చారు. ఈ కార్యక్రమంలో హీరో వరుణ్‌ సందేశ్‌, దర్శకుడు జయశ్రీశివన్‌, నిర్మాతల్లో ఒకరైన వి.సత్యమోహన్‌రెడ్డి, ఎడిటర్‌ ఉద్దవ్‌ ఎస్‌.బి., రచయిత శేఖర్‌ విఖ్యాత్‌, గేయరచయిత కాసర్ల శ్యామ్‌, కోడైరెక్టర్‌ కట్ల విజయ్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా...

వరుణ్‌ సందేశ్‌: ఒక మంచి సూపర్‌హిట్‌ సినిమా కోసం చాలాకాలంగా వెయిట్‌ చేస్తున్నాను. నేను ఫస్ట్‌టైమ్‌ డూయల్‌ రోల్‌ చేసిన ఈ సినిమాని డైరెక్టర్‌ శివ చాలా ఎక్స్‌లెంట్‌గా తీశాడు. ఈ సినిమా నాకు మంచి బ్రేక్‌ అవుతుందన్న నమ్మకం కలుగుతోంది. ఇటీవల విడుదలైన ఈ చిత్రం టీజర్‌కి చాలా మంచి రెస్పాన్స్‌ వస్తోంది. ఇప్పుడు బ్రహ్మానందంగారిపై చిత్రీకరించిన ప్రమోషనల్‌ సాంగ్‌ను రిలీజ్‌ చేశాం. త్వరలోనే థియేట్రికల్‌ ట్రైలర్‌ కూడా రిలీజ్‌ చేయబోతున్నాం.

వి.సత్యమోహన్‌రెడ్డి: బ్రహ్మానందంగారంటే ఆడియన్స్‌లో ఎంత క్రేజ్‌ వుందో అందరికీ తెలిసిందే. ఆయనతో ఒక ప్రమోషనల్‌ సాంగ్‌ చేస్తే బాగుంటుందని మా డైరెక్టర్‌ చెప్పడంతో ఈ పాటను చేయడం జరిగింది. ఈ పాట అద్భుతంగా రావడంలో సంగీత దర్శకుడు రామ్‌నారాయణ్‌, రైటర్‌ కాసర్ల శ్యామ్‌ ఎంతో సహకరించారు. ఎన్నో ప్రత్యేకతలు వున్న ఈ సినిమాని త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తాం. 

జయశ్రీశివన్‌: కమెడియన్‌గా ఎన్నో అద్భుతమైన రోల్స్‌ చేసిన బ్రహ్మానందంగారితో ఈ సినిమాలో ఒక క్యారెక్టర్‌ చేయించాలని అనుకొని ఆయన్ని సంప్రదించడం జరిగింది. ఇప్పటికి వెయ్యి సినిమాలు దాటిపోయాయి. ఏదైనా వెరైటీ క్యారెక్టర్‌ అయితే తప్ప చెయ్యడంలేదు అని ఆయన అనడంతో, ఈ సినిమాలో ఆయన చెయ్యబోయే క్యారెక్టర్‌ గురించి చెప్పాను. ఇప్పటివరకు కమెడియన్‌గా అందర్నీ అలరించిన బ్రహ్మానందంగారు ఈ సినిమాలో విలన్‌గా కనిపించబోతున్నారు. ఈ విషయం చెప్పగానే ఆయనకు నచ్చి ఓకే అన్నారు.  ఆయనతో చేసిన ఈ ప్రమోషనల్‌ సాంగ్‌ తప్పకుండా అందరికీ నచ్చుతుంది. 

శేఖర్‌ విఖ్యాత్‌: ఒక మంచి కథతో సినిమా చేద్దాం అనుకున్నప్పుడు ఇందులో హీరో ఎవరైతే బాగుంటుంది అని ఆలోచించి వరుణ్‌ సందేశ్‌గారైతే ఆ రెండు క్యారెక్టర్లకి పూర్తి న్యాయం చెయ్యగలుగుతారనిపించింది. మేం అనుకున్నట్టుగానే చాలా ఎక్స్‌లెంట్‌గా చేశారు. రామ్‌నారాయణ్‌గారు చాలా మంచి మ్యూజిక్‌ ఇచ్చారు. ఈ సినిమా తప్పకుండా మా అందరికీ మంచి పేరు తెస్తుంది. 

కాసర్ల శ్యామ్‌: వరుణ్‌ సందేశ్‌గారి సినిమాకి ఫస్ట్‌ టైమ్‌ పాటలు రాశాను. ఈ సినిమాకి మ్యూజిక్‌ చేస్తున్న రామ్‌నారాయణ్‌ నా చిరకాల మిత్రుడు. నాకు సంబంధించిన కొన్ని రికార్డింగ్స్‌ కూడా వాళ్ళ స్టూడియోలోనే చేస్తుంటాం. బ్రహ్మానందంగారిపై ఒక ప్రమోషనల్‌ సాంగ్‌ ప్లాన్‌ చేశాం. అది నువ్వే రాయాలని చెప్పినప్పుడు నేను చాలా హ్యాపీగా ఫీల్‌ అయ్యాను. పాట చాలా బాగా వచ్చింది. దానికి తగ్గట్టుగానే పిక్చరైజేషన్‌ కూడా బాగా చేశారు. 

రామ్‌నారాయణ్‌: ఒక మంచి సినిమాకి మంచి సంగీతం అందించే అవకాశం కల్పించిన దర్శకనిర్మాతలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ ప్రమోషనల్‌ సాంగ్‌ అనుకున్నప్పుడు ఈ పాట డెఫినెట్‌గా శ్యామ్‌ మాత్రమే రాయగలడు అనిపించింది. ఈ పాటను డిఫరెంట్‌గా పాడిద్దామనుకొని ప్రభాస్‌ శ్రీనుతో పాడిరచడం జరిగింది. ఆయన చాలా అద్భుతంగా పాడారు. ఈ సినిమా ఆడియో రిలీజ్‌ కాకముందే ప్రమోషనల్‌ సాంగ్‌ రిలీజ్‌ చేస్తున్నామంటే ఆ పాటకు వున్న ప్రత్యేకత ఏమిటో అర్థమవుతుంది. త్వరలోనే ఈచిత్రానికి సంబంధించిన ఆడియోను గ్రాండ్‌గా రిలీజ్‌ చెయ్యబోతున్నాం. 

వరుణ్‌సందేశ్‌, రిచా పనయ్‌, రుచి త్రిపాఠి, డా॥ బ్రహ్మానందం, బాబూ మోహన్‌, రంగనాథ్‌, కాశీ విశ్వనాథ్‌, ప్రభాస్‌ శ్రీను తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: రామ్‌నారాయణ్‌, సినిమాటోగ్రఫీ: బాల్‌రెడ్డి, కథ,స్క్రీన్‌ప్లే,మాటలు: శేఖర్‌ విఖ్యాత్‌, ఎడిటింగ్‌: ఉద్దవ్‌ ఎస్‌.బి., ఫైట్స్‌: వెంకట్‌, నిర్మాతలు: సంగారెడ్డిపేట ప్రకాష్‌, వి.సత్యమోహన్‌రెడ్డి, పండుబాబు ఎ., దర్శకత్వం: జయశ్రీశివన్‌.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ