Advertisementt

'మోసగాళ్లకు మోసగాడు' ఫస్ట్‌లుక్ ఆవిష్కరణ

Fri 06th Mar 2015 01:30 AM
hero sudheer babu,new movie mosagallaku mosagadu,super star krishna,vijaya nirmala  'మోసగాళ్లకు మోసగాడు' ఫస్ట్‌లుక్ ఆవిష్కరణ
'మోసగాళ్లకు మోసగాడు' ఫస్ట్‌లుక్ ఆవిష్కరణ
Advertisement

సూపర్‌స్టార్ కృష్ణ కథానాయకుడిగా 1971లో రూపొందిన ‘మోసగాళ్లకు మోసగాడు’ చిత్రం అఖండ విజయాన్ని సాధించింది. తెలుగు తెరపై కౌబాయ్ కథాంశంతో రూపొందిన తొలి సినిమాగా ఖ్యాతినార్జించిన  ఈ చిత్రం ఆయన కెరీర్‌లోనే ఓ మైలురాయిగా నిలిచింది. దాదాపు నలభైనాలుగేళ్ల విరామం తర్వాత ఇదే టైటిల్‌తో కృష్ణ అల్లుడు సుధీర్‌బాబు ఓ సినిమా చేస్తున్నారు.  క్రైమ్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా 2013లో ప్రేక్షకుల ముందుకొచ్చిన ‘స్వామిరారా’ చిత్రం బాక్సాఫీస్ వద్ద చక్కటి విజయాన్ని నమోదు చేసుకుంది. చిన్న చిత్రాల్లో పెద్ద విజయాన్ని సాధించిన ఈ సినిమాకు ప్రస్తుతం సీక్వెల్ రూపొందుతుంది. సుధీర్‌బాబు, నందిని జంటగా నటిస్తున్న  ఈ సీక్వెల్‌కు ‘మోసగాళ్లకు మోసగాడు’ అనే టైటిల్ ఖరారు చేశారు. లక్ష్మీనరసింహా ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై చక్రి చిగురుపాటి నిర్మిస్తున్న ఈ చిత్రానికి బోస్ నెల్లూరి దర్శకుడు.  ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను గురువారం హైదరాబాద్‌లో కృష్ణ, విజయనిర్మల సంయుక్తంగా విడుదల చేశారు. ఈ సందర్భంగా కృష్ణ మాట్లాడుతూ ‘నేను కథానాయకుడిగా నటించిన ‘‘మోసగాళ్లకు మోసగాడు’ 20, 30 సార్లు విడుదలై మంచి వసూళ్లను సాధించింది. అదే పేరుతో వస్తోన్న ఈ సినిమా పెద్ద విజయాన్ని సాధించాలి. సుధీర్‌బాబు గెటప్, లుక్ బాగున్నాయి. తప్పకుండా ఈ చిత్రం అతనికి మంచి పేరు తీసుకురావాలి’ అని అన్నారు. విజయనిర్మల మాట్లాడుతూ ‘సుధీర్‌బాబు సినిమాల పరంగా చాలా కష్టపడుతున్నాడు. డ్యాన్సులు, ఫైట్స్ అద్భుతంగా చేస్తున్నాడు. ఈ సినిమా భారీ సక్సెస్‌ను సాధించాలి’ అని చెప్పింది. సుధీర్‌బాబు మాట్లాడుతూ ‘కృష్ణ కథానాయకుడిగా కౌబాయ్ కథాంశంతో తెరకెక్కిన ‘మోసగాళ్లకు మోసగాడు’ అప్పట్లో ట్రెండ్ సెట్టర్‌గా నిలిచింది. తెలుగు నుంచి ఇంగ్లీష్‌లోకి అనువాదమైన తొలి చిత్రంగా గుర్తింపును పొందింది. అదే టైటిల్‌తో మా సినిమా రూపొందుతుండటం ఆనందంగా ఉంది.  కానీ ఆ సినిమా కథకు పూర్తి విరుద్ధంగా మా చిత్రం సాగుతుంది. క్రైమ్, కామెడీ నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రంలో కథ, నా పాత్ర చిత్రణ కొత్తపంథాలో సాగుతాయి’ అని  అన్నారు.  ఈ కార్యక్రమంలో బోస్ నెల్లూరి, చక్రి చిగురుపాటి, సతీష్ వెగేష్న, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. అభిమన్యుసింగ్, జయప్రకాష్‌రెడ్డి, దువ్వాసి మోహన్, ప్రవీణ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: మణికాంత్ ఖాద్రి, పాటలు: శ్రీమణి, కె.కె. ఆర్ట్: నాగేంద్ర, మాటలు: ప్రసాద్ వర్మ పెన్మత్స,  ఎడిటింగ్: కార్తీక శ్రీనివాస్, ఫైట్స్: సాల్మాన్‌రాజు, వెంకట్, దేవరాజ్, కెమెరా: సాయిప్రకాష్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: సతీష్ వెగేశ్న,  సమర్పణ: శంకర్ చిగురుపాటి, నిర్మాత: చక్రి చిగురుపాటి, దర్శకత్వం: బోస్ నెల్లూరి.

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement