Advertisementt

'ఆనందం మళ్ళీ మొదలైంది' రిలీజ్ కు రెడీ..!

Thu 05th Mar 2015 06:09 AM
anandam mallee modalaindi,akash,ratnavath,angel singh  'ఆనందం మళ్ళీ మొదలైంది' రిలీజ్ కు రెడీ..!
'ఆనందం మళ్ళీ మొదలైంది' రిలీజ్ కు రెడీ..!
Advertisement
Ads by CJ

దేవి మూవీస్ పతాకంపై ఎన్.జు.రత్నావత్ నిర్మిస్తున్న సినిమా 'ఆనందం మళ్ళీ మొదలైంది'. ఈ సినిమా షూటింగ్ ముగించుకొని మార్చి 6 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో దర్శకుడు, హీరో గా చేసిన ఆకాష్ మాట్లాడుతూ "ఈ సినిమాకు సెన్సార్ బోర్డు వారు 'ఏ' సర్టిఫికేట్ ఇచ్చారు. ఇది ఓ రొమాంటిక్ కామెడీ సినిమా. కమర్షియల్ గా ఈ సినిమా ఖచ్చితంగా వర్కవుట్ అవుతుంది. ప్రస్తుతం ఉన్న ట్రెండ్ కు తగ్గట్టుగా ఈ సినిమా కథ ఉంటుంది. స్టార్ కమెడియన్స్ అందరు ఈ సినిమాలో కనిపిస్తారు. 'ఆనందం' సినిమాకు సీక్వెల్ గా చేసిన ఈ సినిమాలో కామెడి ఎక్కువ శాతం ఉంటుంది" అని అన్నారు.

ప్రొడ్యూసర్ ఎన్.జు.రత్నావత్  మాట్లాడుతూ "దేవి మూవీస్ బ్యానర్ లో ఇది నా రెండవ సినిమా. సుమన్ జూపూడి మంచి స్వరాల్ని అందించారు. ఈ సినిమాను ప్రేక్షకులు అందరించాలని కోరుకుంటున్నా" అని అన్నారు.

హీరోయిన్ ఏంజెల్ సింగ్ మాట్లాడుతూ "ఈ సినిమాలో నా పాత్రను ఎంతో ఇష్టపడి చేసాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన ఆకాష్ కు, ప్రొడ్యూసర్ గారికి నా ధన్యవాదాలు" అని అన్నారు.

సుమన్ జూపూడి మాట్లాడుతూ "పాటలకు మంచి రెస్పాన్స్ వస్తోంది. సినిమా కూడా పెద్ద సక్సెస్ అవుతుందనే నమ్మకంతో ఉన్నాం" అని అన్నారు.

దినేష్ మ్యాడ్ని మాట్లాడుతూ "ఈ సినిమా నీను విలన్ పాత్ర పోషించాను. సినిమాలో హీరో, విలన్ ల కన్నా కామెడినే ఎక్కువగా ఉంటుంది. 'నువ్వు నాకు నచ్చావ్' సినిమాలో వెంకటేష్ గారు ఎలా కామెడి పండించారో ఈ సినిమాలో ఆకాష్ పాత్ర కూడా అలానే ఉంటుంది" అని అన్నారు.

చిత్రం భాషా మాట్లాడుతూ "యంగ్ కమెడియన్స్ తో పాటు నాకు కూడా ఈ సినిమాలో మంచి రోల్ ఇచ్చారు. ఈ సినిమా ఆకాష్ కు మరో 'ఆనందం' సినిమాల నిలుస్తుంది" అని అన్నారు.

అంబటి శీను మాట్లాడుతూ "ఈ సినిమాలో జంబో రామ్ అనే కెమెరామెన్ పాత్రలో కనిపిస్తాను. ఈ సినిమా హిట్ అయ్యి అందరికి మంచి పేరు రావాలని కోరుకుంటున్నా" అని అన్నారు.   

ఈ సినిమాకి మాటలు: అశోక్ వడ్లమూడి, కెమెరా: చక్రి, సమర్పణ: నందిత.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ