Advertisementt

క్లైమాక్స్‌ మినహా ‘ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌’ పూర్తి

Thu 05th Mar 2015 04:04 AM
hero aditya om,telugu movie friend request,director aditya om  క్లైమాక్స్‌ మినహా ‘ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌’ పూర్తి
క్లైమాక్స్‌ మినహా ‘ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌’ పూర్తి
Advertisement
Ads by CJ

ఆర్‌.ఆర్‌.పి. కార్పొరేషన్‌ ప్రై.లి., బామ్లా ఎంటర్‌ ప్రైజెస్‌ సమర్పణలో మోడరన్‌ సినిమా పతాకంపై ‘లాహిరి లాహిరి లాహిరిలో’, ‘ధనలక్ష్మీ ఐ లవ్‌ యూ’, ‘మీ ఇంటికి వస్తే ఏం ఇస్తారు..మా ఇంటికి వస్తే ఏం తెస్తారు’, ‘భామా కలాపం’ వంటి విజయవంతమైన చిత్రాల కథానాయకుడు ఆదిత్యా ఓం నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న ద్విభాషా చిత్రం ‘ఫ్రెండ్‌ రిక్వెస్‌’్ట. నితీష్‌ చౌదరి, రోహిత్‌, పంకజ్‌ కీలకపాత్రధారులు. తెలుగులో ‘ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌’గా, హిందీలో ‘ఫన్‌ ఫ్రీక్‌డ్‌ ఫేస్‌ బుక్డ్‌’గా ఏకకాలంలో షూటింగ్‌ జరుపుకుంటున్న ఈ చిత్రం క్లైమాక్స్‌ మినహా షూటింగ్‌ పూర్తి చేసుకుంది. 

ఈ సందర్భంగా హీరో, దర్శకుడు ఆదిత్య ఓం మాట్లాడుతూ ‘‘యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. హార్రర్‌, సస్పెన్స్‌ బ్యాక్‌డ్రాప్‌లో వుండే ఈ చిత్రంలో చక్కని మెసేజ్‌ కూడా వుంది. ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్‌కి అనుగుణంగా ఆడియన్స్‌ మెచ్చే అన్ని అంశాలు ఈ చిత్రంలో వున్నాయి. హై టెక్నికల్‌ వేల్యూస్‌తో ఈ చిత్రాన్ని చాలా రిచ్‌గా చిత్రీకరిస్తున్నాం. పోస్ట్‌ ప్రొడక్షన్‌ని కూడా లేటెస్ట్‌ టెక్నాలజీతో చేస్తున్నాం. నటుడుగానే కాకుండా దర్శకుడుగా నాకు ఓ స్థాయిని తెచ్చే చిత్రంగా ఈ ‘ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌’ చిత్రం నిలుస్తుందన్న నమ్మకం నాకు వుంది’’ అన్నారు. 

నిర్మాణ నిర్వాహకులు పి.విజయ్‌వర్మ మాట్లాడుతూ ‘‘టాకీ, ఆరు పాటలతో సహా షూటింగ్‌ పూర్తయింది. క్లైమాక్స్‌ మాత్రమే బ్యాలెన్స్‌ వుంది. మార్చి మూడో వారంలో అల్యూమినియ ఫ్యాక్టరీ, కీసర దగ్గరలోని ఓ ఫామ్‌హౌస్‌లో క్లైమాక్స్‌ చిత్రీకరణ జరుగుతుంది. ఈ క్లైమాక్స్‌ చిత్రీకరణలో హీరో ఆదిత్య ఓంతోపాటు చిత్రంలోని అందరు నటీనటులు పాల్గొంటారు’’ అన్నారు.

ఈ చిత్రానికి మాటలు: టి.రాఘవ, సంగీతం: నికిల్‌, లవన్‌ గోన్‌, వీరల్‌ మిస్త్రి, నిర్మాణ నిర్వహణ: పి.విజయ్‌వర్మ, దర్శకత్వం: ఆదిత్య ఓం.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ