Advertisementt

‘కృష్ణమ్మ కలిపింది..’ మూవీమొఘల్‌కి అంకితం

Wed 04th Mar 2015 06:37 AM
krishnamma kalipindi iddarini,hero sudheer babu,nanditha,lagadapati sridhar,director r.chandru  ‘కృష్ణమ్మ కలిపింది..’ మూవీమొఘల్‌కి అంకితం
‘కృష్ణమ్మ కలిపింది..’ మూవీమొఘల్‌కి అంకితం
Advertisement
Ads by CJ

సుధీర్‌బాబు, నందిత జంటగా ఆర్‌.చంద్రు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ’. కన్నడ ‘చార్మినార్‌’ చిత్రానికి రీమేకిది. రామలక్ష్మి సినీ క్రియేషన్స్‌ పతాకంపై లగడపాటి శిరీషా`శీధ్రర్‌ నిర్మిస్తున్నారు. నిర్మాణానంతర కార్యక్రమాలు శరవేగంగా పూర్తి చేసుకుంటున్న ఈ సినిమా గురించి నిర్మాతలు మాట్లాడుతూ ‘‘చార్మినార్‌ సినిమా చూడగానే ఆ కథతో ప్రేమలో పడిపోయాను. వెంటనే తెలుగు హక్కులు సొంతం చేసుకుని అదే దర్శకుడితో తెలుగులో సినిమా ప్రారంభించాను. చక్కని లవ్‌ ఎంటర్‌టైనరిది. ఎటువంటి వల్గారిటీ లేకుండా చంద్రు అద్భుతంగా తెరకెక్కించారు. కుటుంబ సమేతంగా చూడదగిన విధంగా ఉంటుంది. సుధీర్‌బాబు, నందితల నటన సినిమాకు హైలైట్‌గా నిలుస్తాయి. నందిత పాత్ర వినోదాత్మకంగా ఉంటుంది. ఇటీవల విడుదలైన పాటలకు చక్కని స్పందన వస్తోంది. ఈ నెల 12న ప్లాటినం డిస్క్‌ వేడుకను ఘనంగా జరపబోతున్నాం. ఉగాది కానుకగా ఈ నెల మూడో వారంలో ప్రేక్షకుల ముందుకిరానున్న ఈ సినిమాను ఎన్నో అద్భుతమైన ప్రేమకథా చిత్రాలను తెలుగు ప్రేక్షకులకు అందించిన మూవీమొగల్‌ స్వర్గీయ డా.డి.రామానాయుడు గారికి అంకితమిస్తున్నాం’’ అని అన్నారు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ