పురంధరేశ్వరి ఫిలింస్ పతాకంపై దాక్షాయణి సమర్పణలో అరవింద్‌కృష్ణ, ‘ప్రతినిధి’ ఫేం శుభ్ర అయ్యప్ప జంటగా ప్రసాద్ నీలమ్ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం ‘యవ్వనం ఒక ఫాంటసీ’. ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని ప్రస్తుతం రీ రికార్డింగ్ జరుపుకుంటోంది.
ఈ సందర్భంగా దర్శక నిర్మాత ప్రసాద్ నీలమ్ మాట్లాడుతూ... ‘పెళ్లికి ముందు యువత చేసిన తప్పులు పెళ్లయిన తర్వాత వారి జీవితాలపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయి, వాటి తాలూకు పరిణామాలు ఎలా వుంటాయి, వాటి నుంచి తప్పించుకోవడానికి హీరో చేసిన ప్రయత్నాలేమిటి అన్నది చిత్ర కథాంశం. దీన్ని మ్యూజికల్ రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా చూపించే ప్రయత్నం చేశాం. అరవింద్‌కృష్ణ తొలిసారిగా ఈ చిత్రంలో ప్లేబోయ్‌గా నటిస్తూ చక్కటి పెర్ఫామెన్స్ కనబరిచారు. ‘ప్రతినిధి’ ఫేం శుభ్ర అయ్యప్ప అందం, అభినయం ఆకట్టుకుంటాయి. అలాగే జీవన్‌థామస్ సంగీతం, భాస్కరభట్ల సాహిత్యం ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణ. ప్రస్తుతం ఈ చిత్రం రీ రికార్డింగ్ జరుపుకుంటోంది. ఈ నెలాఖరులో ఆడియోను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’ అన్నారు.
అరవింద్ కృష్ణ, శుభ్ర అయ్యప్ప, అశోక్‌కుమార్, ప్రభాస్ శ్రీను, వైవా హర్ష, షఫి, జయవాణి, కుముదిని, మనస్విని, ప్రవీణ, జబర్దస్త్ బ్యాచ్ శేషు, చంద్ర తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కథ: పురంధరేశ్వరి ఫిలింస్, స్క్రీన్‌ప్లే: ముకుంద్ పాండే, మాటలు: మధుసూధన్, పాటలు: భాస్కరభట్ల, సింగర్స్: బాబా సెహగల్, వేణు, కౌసల్య, రమ్య, కెమెరా: జయపాల్‌రెడ్డి, సంగీతం: జీవన్ థామస్, ఎడిటింగ్: మార్తాండ్ కె. వెంకటేష్, నిర్మాత,దర్శకత్వం: ప్రసాద్ నీలమ్