Advertisementt

మార్చి 5న ధనుష్‌, కె.వి.ఆనంద్‌ల ‘అనేకుడు’

Mon 02nd Mar 2015 05:28 AM
anekudu,dhanush,anekudu on 5th march,k.v.anand,harris jayaraj,amaira dastur  మార్చి 5న ధనుష్‌, కె.వి.ఆనంద్‌ల ‘అనేకుడు’
మార్చి 5న ధనుష్‌, కె.వి.ఆనంద్‌ల ‘అనేకుడు’
Advertisement
Ads by CJ

‘రంగం’ వంటి సూపర్‌హిట్‌ చిత్రాన్ని  ప్రేక్షకులకు అందించిన దర్శకుడు  కె.వి.ఆనంద్‌, ‘రఘువరన్‌ బి.టెక్‌’ వంటి  సెన్సేషన్‌ హిట్‌ చిత్రం ద్వారా  ప్రేక్షకుల మెప్పుని పొందిన యంగ్‌ హీరో ధనుష్‌ కలిసి చేసిన చిత్రం ‘అనేకుడు’. కల్పాత్తి. ఎస్‌. అగోరం సమర్పణలో, ఎ.జి.ఎస్‌. ఎంటర్‌టైన్‌మెంట్‌  పతాకంపైన ఈ చిత్రం రూపుదిద్దుకుంది. ప్రముఖ సంగీత దర్శకుడు హారీష్‌ జైరాజ్‌ ఈ చిత్రానికి సంగీతం అందించారు. ఈ రొమాంటిక్‌ ఎంటర్‌ట్రైనర్‌ కథా చిత్రాన్ని కల్పాత్తి ఎస్‌. అఘోరం, కల్పాత్తి ఎస్‌. గణేష్‌, కల్పాత్తి ఎస్‌.సురేష్‌లు దీన్ని అత్యంత భారీ ఎత్తున నిర్మించారు. ఈ చిత్రానికి సంబందించిన అన్ని కార్యక్రమాలు పూర్తి అయ్యాయి. ఇటీవలే సోని మ్యూజిక్‌  ద్వారా విడుదలైన  ఆడియోకి  సంగీత ప్రియుల వద్ద నుంచి మంచి స్పందన  లభించింది. అన్ని పనుల్ని ముగించుకొన్న  ఈ చిత్రం మెగా సూపర్‌గుడ్‌ ఫిలింస్‌ ఫై.లిమిటెడ్‌ సంస్థ ద్వారా మార్చి 5న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. 

చిత్ర దర్శకుడు కె.వి.ఆనంద్‌ సినిమా గురించి చెబుతూ ‘‘ఈ చిత్రంలో హీరో ధనుష్‌ అద్భుతమైన పాత్రలు చేశారు. ఆయన పోషించిన పాత్రలు విభిన్నమైన రీతిలో సాగుతూ ఆద్యంతం ప్రేక్షకులని అలరిస్తాయి. ముఖ్యంగా నేటి యువతరం ఎంతో ఎంజాయ్‌ చేస్తారు. అలాగే అన్ని తరగతుల ప్రేక్షకులని ఈ చిత్రం ఆనంద పరుస్తుంది. హారీష్‌ జైరాజ్‌  ఈ చిత్రానికి అందించిన సంగీతం ఇప్పటికే అందరినీ ఆకట్టుకుంది. హోలీ కానుకగా మార్చి5న ప్రేక్షకుల ముందుకు వస్తుంది అని చెప్పారు. 

ధనుష్‌ సరసన  అమైరా దస్తూర్‌, ఐశ్వర్య దేవన్‌లు కధానాయికలుగా నటించిన  ఈ చిత్రంలో కార్తిక్‌, ఆశీష్‌విద్యార్ధి, ముఖేష్‌ తివారి, అతుల్‌ కులకర్ణి  మున్నగువారు ఇతర పాత్రలను పోషించారు. హారీష్‌ జైరాజ్‌  సంగీతం సమకూర్చిన ఈ చిత్రానికి  కథ, స్క్రీన్‌ప్లే: కె.వి. ఆనంద్‌, శుభ, మాటలు: శశాంక్‌ వెన్నెలకంటి,  పాటలు: సాహితి,  వనమాలి, చాయాగ్రహణం: ఓం ప్రకాష్‌,  ఎడిటింగ్‌: ఆంథోని,  ఆర్ట్‌: డి.ఆర్‌.కె.కిరణ్‌,   ఫైట్స్‌: కణల్‌కన్నన్‌, నృత్య దర్శకులు: రాజు సుందరం, బాబా భాస్కర్‌   పని చేసిన సాంకేతిక నిపుణులు. నిర్మాతలు: కల్పాత్తి ఎస్‌. అఘోరం, కల్పాత్తి  ఎస్‌. గణేష్‌, కల్పాత్తి ఎస్‌. సురేష్‌, దర్శకత్వం: కె.వి.ఆనంద్‌.

రిలీజ్‌: మెగా సూపర్‌గుడ్‌ ఫిలింస్‌ ప్రై. లిమిటెడ్‌  

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ