Advertisementt

'భలే భలే మగాడివోయ్‌' అనిపిస్తున్న నాని..!!

Sun 01st Mar 2015 04:07 AM
nani,maruthi,bhale bhale mugadivoye,geetha arts banner,title  'భలే భలే మగాడివోయ్‌' అనిపిస్తున్న నాని..!!
'భలే భలే మగాడివోయ్‌' అనిపిస్తున్న నాని..!!
Advertisement
Ads by CJ

పక్కింటి కుర్రాడిలా ఉండే నాని ప్రారంభంలో వరుస హిట్లతో దూసుకెళ్లాడు. ఇక గత రెండేళ్లుగా ఆయనకు సరైన విజయం లేక ఇప్పుడు డీలా పడిపోయాడు. ఇక త్వరలోనే రానున్న 'ఎవడే సుబ్రమణ్యం'పైనే నాని ఆశలు పెట్టుకున్నాడు. అదే సమయంలో గీతా ఆర్ట్స్‌ వంటి పెద్ద బ్యానర్‌లో నానికి అవకాశం వచ్చింది. యువ దర్శకుడు మారుతి డైరెక్ట్‌ చేస్తున్న ఈ సినిమాకు టైటిల్‌ కూడా ఖరారు చేసినట్లు సమాచారం. ఈ చిత్రానికి 'భలే భలే మగాడివోయ్‌' అనే టైటిల్‌ను పెట్టాలని సినిమా యూనిట్‌ నిర్ణయించుకున్నట్లు తెలిసింది. ఫీల్‌గుడ్‌ రోమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో నాని క్యారిక్టెర్‌ను సరికొత్తగా రూపొందిస్తున్నట్లు చిత్రవర్గాలు చెబుతున్నాయి. శ్రీదివ్య కథానాయికగా నటించనున్న ఈ చిత్రంలో త్వరలోనే సెట్స్‌మీదకు వెళ్లనుంది. టైటిల్‌కు సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడనున్నట్లు సమాచారం.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ