Advertisementt

'పిశాచి' సక్సెస్ మీట్..!

Sat 28th Feb 2015 11:04 PM
pisachi success meet,koneru kalpana,naga,prayaga  'పిశాచి'  సక్సెస్ మీట్..!
'పిశాచి' సక్సెస్ మీట్..!
Advertisement
Ads by CJ

సి.కె.ఎంటర్ టైన్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత సి.కళ్యాన్ ఇటీవల తెలుగు ప్రేక్షకులకు అందించిన 'చంద్రకళ' ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. తాజాగా ఇదే బ్యానర్ పై ప్రముఖ తమిళ దర్శకుడు బాల సమర్పణలో మిస్కిన్ దర్శకత్వంలో రూపొంది ఘన విజయం సాధించిన ఓ తమిళ చిత్రాన్ని తెలుగులో 'పిశాచి' పేరుతో శుక్రవారం(ఫిబ్రవరి 27) రిలీజ్ చేసి పాజిటివ్ టాక్ సంపాదించుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో కోనేరు కల్పన మాట్లాడుతూ "కళ్యాన్ గారికి ఈ సినిమా చూపించి ప్రమోట్ చేయమని అడగగానే ఓకే చెప్పారు. కళ్యాన్ గారి బ్యానర్ లో వచ్చిన  నా మొదటి సినిమాకి ఇంత మంచి రెస్పాన్స్ రావడం చాలా సంతోషంగా ఉంది. రివ్యూలు చదువుతుంటే చాలా ఆనందంగా అనిపించింది. త్వరలోనే తెలుగులో నేరుగా సినిమా నిర్మించాలని ఉంది" అని అన్నారు.

ప్రముఖ నిర్మాత బి.ఎ. రాజు మాట్లాడుతూ "తమిళంలో సూపర్ హిట్ అయిన ఈ సినిమా తెలుగులో కూడా మంచి హిట్ టాక్ సంపాదించుకుంది. ఆదివారం నుండి థియేటర్ల సంఖ్యా కూడా పెంచానున్నాం'' అని అన్నారు.

హీరో నాగ మాట్లాడుతూ "అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసిన నాకు బాల గారి సమర్పణలో మూవీ చేసే అవకాశం రావడం అది ఇంత పెద్ద సక్సెస్ కావడం చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమాను ఆదరించిన ప్రేక్షకులకు నా ధన్యవాదాలు" అని చెప్పారు.

రామ సత్యనారాయణ మాట్లాడుతూ "ఫ్యామిలీతో కలిసి చూడదగ్గ సినిమా ఇది. ఈ సినిమాని ఆదరించిన ప్రేక్షక దేవుళ్ళకు నా ధన్యవాదాలు" అని అన్నారు.

హీరోయిన్ ప్రయాగ మాట్లాడుతూ "ఇంత పెద్ద సక్సెస్ అయిన మూవీ లో భాగం అయినందుకు చాలా హ్యాపీ గా ఉంది. నాకు ఈ అవకాశం ఇచ్చిన వారికి థాంక్స్" అని అన్నారు.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ