Advertisementt

'జగన్నాటకం' మూవీ ఆడియో లాంచ్..!

Sat 28th Feb 2015 08:33 AM
jagannatakam movie audio launch,pradeep nandan,ajay  'జగన్నాటకం' మూవీ ఆడియో లాంచ్..!
'జగన్నాటకం' మూవీ ఆడియో లాంచ్..!
Advertisement
Ads by CJ

ప్రదీప్, ఖెనీశ చంద్రన్ జంటగా చిత్ర సౌధం పతాకంపై ప్రదీప్ నందన్ దర్శకత్వంలో ఆదిశేష రెడ్డి నిర్మిస్తున్న సినిమా 'జగన్నాటకం'. ఈ చిత్రం ఆడియో వేడుక శనివారం హైదరాబాద్ లో జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో డైరెక్టర్ ప్రదీప్ నందన్ మాట్లాడుతూ "ఈ సినిమా షూటింగ్ ముగించుకొని మార్చి రెండో వారంలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి  సన్నాహాలు చేస్తున్నాం. ఒక్క రోజు తను ఇంట్లో లేకపోవడం వల్ల తన జీవితంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి, అవి ఎందుకు జరిగాయి, ఎవరు చేసారు అన్న అంశం మీద చిత్రం నడుస్తుంది. చిత్రం ఆద్యంతం తర్వాత క్షణం ఏం జరుగుతుందో అన్న ఉత్కంటతో నడుస్తుంది" అని అన్నారు. 

హీరోయిన్ ఖెనీశ చంద్రన్ మాట్లాడుతూ "మ్యూజిక్ డైరెక్టర్ అజయ్ ఈ సినిమాకి మంచి స్వరాల్ని అందించారు. ఈ సినిమా కోసం చాలా హార్డ్ వర్క్ చేసాం. ఎమోషనల్ గా ఈ సినిమా అందరికి దగ్గరవుతుంది" అని అన్నారు.

ఉషాశ్రీ మాట్లాడుతూ "ఈ సినిమాలో హీరోకి సోదరి పాత్రలో నటించాను. ఇదొక పైన్ ఫుల్ లవ్, థ్రిల్లర్ స్టొరీ. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నా" అని అన్నారు.

మ్యూజిక్ డైరెక్టర్ విజయ్ మాట్లాడుతూ "ఇది నాకు రెండో సినిమా. నాకు ఈ అవకాశం ఇచ్చిన వారికి ధన్యవాదాలు. 'జగన్నాటకం' అంటే దేవుడు ఆడిస్తున్న నాటకం అని అర్ధం. ఈ సినిమా మీద చాలా నమ్మకంగా ఉన్నాం" అని చెప్పారు.

డాన్స్ మాస్టర్ ఆట సందీప్ మాట్లాడుతూ "మ్యూజిక్ చాలా అధ్బుతంగా ఉంటుంది. ఈ సినిమా మొదటి భాగం చూసి చాలా థ్రిల్ అయ్యాను. ఈ సినిమా ఖచ్చితంగా పెద్ద సక్సెస్ అవుతుంది" అని అన్నారు.

అభినవ్ మాట్లాడుతూ "ఈ సినిమాలో బంతి అనే దొంగ పాత్రలో నటించాను. బిల్లా రంగా సినిమాలో నేను నటిస్తున్నప్పుడు నాకు ఈ సినిమాలో నటించే అవకాశం వచ్చింది. ఈ సినిమాలో థ్రిల్ తో పాటు, కామెడీ కూడా ఉంటుంది" అని అన్నారు.

కిరణ్ మాట్లాడుతూ "ఈ సినిమాలో శీను అనే పాత్రలో నటించాను. ఈ సినిమాకి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, స్క్రీన్ ప్లే హైలైట్ గా నిలుస్తాయి" అని అన్నారు.

సాంకేతిక వర్గం: ఎడిటింగ్: చంద్రశేఖర్, కళ: తిరుమల వి తిరుపతి , సినిమాటోగ్రఫీ: సతీష్ ముత్యాల.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ