Advertisementt

కమల్‌ చిత్రాన్ని ప్రొడ్యూస్‌ చేయనున్న స్టార్‌హీరో..!!

Sat 28th Feb 2015 02:56 AM
kamal hasan,dhanush,production,new film  కమల్‌ చిత్రాన్ని ప్రొడ్యూస్‌ చేయనున్న స్టార్‌హీరో..!!
కమల్‌ చిత్రాన్ని ప్రొడ్యూస్‌ చేయనున్న స్టార్‌హీరో..!!
Advertisement
Ads by CJ

కథానాయకుడిగా మాత్రమే కాకుండా వినూత్న చిత్రాల్ని తెరకెక్కిస్తూ అభిరుచి గల నిర్మాతగా కూడా ప్రతిభను చాటుకుంటున్నాడు తమిళ నటుడు ధనుష్‌. తమిళంలో పలు చిత్రాల్ని నిర్మించి విజయాలను సొంతం చేసుకున్న ఆయన మరో భారీ చిత్రానికి శ్రీకారం చుట్టారు. కమల్‌హాసన్‌ కథానాయకుడిగా ఓ సినిమా నిర్మించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన కథా చర్చలు సాగుతున్నాయి. భిన్న అంశాల సమాహారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ధనుష్‌ ఓ అతిథి పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడికానున్నాయి. ప్రస్తుతం విశ్వరూపం-2, ఉత్తమ విలన్‌, పాపనాశం చిత్రాల్లో నటిస్తూ కమల్‌హాసన్‌ బిజీగా ఉన్నారు. ఈ మూడు చిత్రాలు కూడా ఇదే సంవత్సరం ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశముంది.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ