Advertisementt

సునీల్ హీరోగా, ఆర్‌.పి.ఏ.క్రియోష‌న్స్ చిత్రం..!

Fri 27th Feb 2015 07:31 AM
sunil,vamsikrishna,prema kada chithram,sudharshan reddy  సునీల్ హీరోగా, ఆర్‌.పి.ఏ.క్రియోష‌న్స్ చిత్రం..!
సునీల్ హీరోగా, ఆర్‌.పి.ఏ.క్రియోష‌న్స్ చిత్రం..!
Advertisement
Ads by CJ

సునీల్ హీరోగా, ' ర‌క్ష 'చిత్రం లాంటి విభిన్న క‌థాంశంతో విజ‌యాన్ని సొంతం చేసుకున్న వంశి కృష్ణ ఆకేళ్ళ ద‌ర్శ‌కుడిగా ,చిన్న చిత్రాల్లో మెట్ట‌మెద‌టి బ్లాక్‌బ‌స్ట‌ర్ గా ట్రెండ్ క్రియోట్ చేసిన  'ప్రేమ‌క‌థా చిత్రమ్ ' నిర్మాత ఆర్‌. సుద‌ర్శ‌న్ రెడ్డి, ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ ఆర్‌.పి.ఏ. క్రియోష‌న్స్ ప‌తాకంపై  ఓ భారీ బ‌డ్జెట్ చిత్రాన్ని నిర్మిచ‌నున్నారు. 'ప్రేమ‌క‌థా చిత్రమ్' త‌రువాత ఏన్నో క‌థ‌లు విన్నా కూడా త‌న బ్యాన‌ర్ ఆర్‌.పి.ఏ.క్రియోష‌న్స్ ప్రోడ‌క్ష‌న్ నెం-2 గా వ‌చ్చే చిత్రం మ‌రో సూప‌ర్ డూప‌ర్ హిట్ కి నాంది ప‌ల‌కాల‌ని హీరో సునీల్ తో చిత్రాన్ని చేస్తున్నారు. ఫిబ్ర‌వ‌రి 28 న హీరో సునీల్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఆర్‌.పి.ఏ.క్రియోష‌న్స్ ప్రోడ‌క్ష‌న్ నెం-2 యూనిట్ స‌భ్యులంద‌రూ  హీరో సునీల్ కి జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు తెలుపుతున్నారు. 

ఈ సంద‌ర్భంగా నిర్మాత ఆర్‌.సుద‌ర్శ‌న్ రెడ్డి మాట్లాడుతూ.. ముందుగా మా హీరో సునీల్ పుట్టిన రోజు సంధ‌ర్బంగా మా చిత్ర యూనిట్ అంద‌రి త‌రుపునా జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు . 'ప్రేమ‌క‌థా చిత్రమ్' త‌రువాత ఎన్నో క‌థ‌లు విన్నాను. కాని నా మెద‌టి ప్ర‌యాత్నాన్ని చిన్న చిత్రాల్లో అఖండ విజ‌యంగా అందించిన తెలుగు ప్రేక్ష‌కులంద‌రి అంచ‌నాలు అందుకునేలా మా బ్యాన‌ర్ ఆర్‌.పి.ఏ.క్రియోష‌న్స్ వాల్యుని నిల‌బెట్టె చిత్రంగా వుండాల‌ని మంచి క‌థ‌ల కోసం చూస్తున్న స‌మ‌యంలో 'ర‌క్ష' చిత్రం ద‌ర్శ‌కుడు  వంశి కృష్ణ ఆకేళ్ళ మంచి క‌థ తో నా ద‌గ్గ‌ర‌కి వ‌చ్చారు. నేను , సునీల్ గారు విన్న వెంట‌నే అంగీక‌రించాము. సునీల్ గారికి ఎలాంటి క‌థ వుండాల‌ని ప్రేక్ష‌కులు కోరుకుంటారో 100% అదే రేంజి క‌థ‌తో మా బ్యాన‌ర్ లో వ‌స్తున్నాము. సునీల్ గారి బాడీ లాంగ్వేజ్ కి కొత్త‌గా చూపించ‌బోతున్నారు ద‌ర్శ‌కుడు వంశి.  సునీల్ గారి నుండి ఎలాంటి ఎంట‌ర్టైన్‌మెంట్ కోరుకుంటామో అదే ఈ చిత్రం లో  వుంటుంది. ప‌క్కా కమ‌ర్షియ‌ల్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ గా తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో న‌టించే  న‌టీన‌టుల వివ‌రాలు , సాంకేతిక‌నిపుణ‌ల వివ‌రాలు అతి త్వ‌ర‌లో తెలియ‌జేస్తాం. త్వ‌ర‌లో ఈచిత్రం సెట్స్ మీద‌కి వెళ్ళనుంది. ఈచిత్రం అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌ని ఆక‌ట్టుకునేలా వుంటుంది. అని అన్నారు.

ద‌ర్శ‌కుడు వంశి కృష్ణ ఆకేళ్ళ మాట్లాడుతూ.. 'ర‌క్ష' లాంటి స‌క్స‌స్ ఫుల్ చిత్రం త‌రువాత క‌మ‌ర్షియ‌ల్ స‌క్సస్ కోసం ఎదురు చూస్తున్న నాకు అన్ని క‌మ‌ర్ష‌ఙ‌య‌ల్ హంగులున్న ఈ క‌థ కుదిరింది. ఈ క‌థ‌ని సునీల్ గారికి చెప్పిన వెంట‌నే ఇలాంటి క‌థ కోస‌మే నేను వెయిట్ చేస్తున్నాను అని అయన అన్నారు. ఓ క‌మ‌ర్షియ‌ల్ క‌థ ని సునీల్ గారు హీరోగా చేయ‌టం, దానికి 'ప్రేమ‌క‌థా చిత్రం 'నిర్మాత ఆర్‌. సుద‌ర్శ‌న్ రెడ్డిగారు నిర్మించ‌టం చాలా హ్య‌పి గా వీరిద్ద‌రికి నా ధ‌న్యవాదాలు తెలుపుతున్నాను. సునీల్ గారికి  జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు తెలుపుతున్నాను. అని అన్నారు

స‌హ నిర్మాత‌లు : ఆర్‌.ఆయుష్ రెడ్డి, ఆర్‌.పి.అక్షిత్ రెడ్డి

నిర్మాత‌: ఆర్‌.సుద‌ర్శ‌న్ రెడ్డి

క‌థ‌-స్క్రీన్‌ప్లే-ద‌ర్శ‌క‌త్వం : వంశి కృష్ణ ఆకేళ్ళ‌

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ