‘‘నా ఫేస్‌లో అమాయకత్వం చూసి నన్ను ఇనోసెంట్ అమ్మాయిని అనుకుంటారేమో! అలా అనుకుంటే పప్పులో కాలేసినట్టే. నేను మహా అల్లరిపిల్లని. ఖాళీ సమయంలో ఇంట్లో నేను చేసే అల్లరికి హద్దు ఉండదు ’’ అని అంటోంది డిల్లీడాల్ రకుల్ ప్రీత్‌సింగ్. తెలుగు పరిశ్రమలో అడుగుపెట్టిన అతి తక్కువ సమయంలో చక్కని నటిగా గుర్తింపు తెచ్చుకుందీ ముద్దుగుమ్మ. స్టార్ హీరోల సరసన అవకాశాలు అందిపుచ్చుకొంది. రకుల్ మాట్లాడుతూ ‘‘నాకు అల్లరితోపాటు కరాటే మీద మంచి పట్టుంది. చిన్నప్పుడ కరాటే నేర్చుకున్నాను. ఇప్పటికీ ఆ విద్యని మరచిపోలేదు. అవసరమైనప్పుడు వాడుతుంటాను(నవ్వుతూ). ప్రస్తుతం సినీ కెరీర్ చాలా బావుంది. మంచి అవకాశాలొస్తున్నాయి అని చెప్పుకొచ్చింది. కథ డిమాండ్ చేస్తే లిప్‌లాక్‌కి రెడీ అనీ, అదికూడా కథలో భాగంగా ఉంటేనే అందుకు అంగీకరిస్తాననీ, గ్లామర్ కోసమో, ఎట్రాక్షన్ కోసమో అయితే లిప్‌లాక్, వల్గర్ సీన్స్ చేసే ప్రసక్తే లేదనీ చెప్పిందీ సుందరి. ప్రస్తుతం కిక్ 2, పండగ చేస్కో సినిమాల్లో నటిస్తోన్న రకుల్ రామ్‌చరణ్, ఎన్టీఆర్ సరసన కూడా నటించబోతోంది.