శ్రీసాయి జగపతి పిక్చర్స్, సంతోష్ ప్రొడక్షన్స్ సంస్థలు సంయుక్తంగా అందరూ బాలనటీనటులతో జె.వి.ఆర్ దర్శకత్వంలో చలసాని వెంకటేశ్వరరావు, జె.బాలరాజు నిర్మిస్తున్న ‘దానవీరశూరకర్ణ’ చిత్రం కాజా సూర్యనారాయణ నిర్మాణ నిర్వాహకునిగా శరవేగంతో షూటింగు జరుపుకుంటోంది. ఇందులో స్వర్గీయ నందమూరి జానకిరామ్ పెద్దకుమారుడు మాస్టర్ ఎన్టీఆర్ శ్రీకృష్ణునిగా, మరో కుమారుడు సౌమిత్ర సహదేవునిగా నటిస్తున్న విషయం తెలిసినదే.
ఈ సందర్భంగా చిత్ర దర్శకులు జె.వి.ఆర్ మాట్లాడుతూ... ‘జనవరి 23న ‘దానవీరశూరకర్ణ’ చిత్రాన్ని పూజా కార్యక్రమాలతో సారధీ స్టూడియోలో వైభవంగా ఆరంభమైంది. అప్పట్నుండి ఈ చిత్రం షూటింగ్ శరవేగంతో జరుగుతోంది. బాలనటీనటులంతా మేమూహించిన దానికన్నా బాగా నటిస్తున్నారు. కృష్ణునిగా నటిస్తున్న మాస్టర్ ఎన్టీఆర్ తాతకు తగ్గ మనవనిగా పేరు తెచ్చుకుంటారనటంలో సందేహంలేదు. ఇంత వరకు సారధి స్టూడియోలో వేసిన ప్రత్యేకమైన సెట్‌లో కొన్నికీలకమైన దృశ్యాలను చిత్రీకరించాం. అలాగే హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో కూడా షూటింగ్ చేశాం. మాస్టర్ ఎన్టీఆర్ తమ్ముడు సౌమిత్ర సహాదేవునిగా అద్భుతంగా చేస్తున్నాడు. మార్చి 28కి షూటింగ్ మొత్తం పూర్తవుతుంది. ఏప్రిల్ మాసంలో పోస్ట్‌ప్రొడక్షన్ వర్క్‌ను పూర్తి చేసి మే 28న మహానటుడు ఎన్టీఆర్ జయంతి సందర్భంలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం. ఇప్పటికి 3 పాటల చిత్రీకరణ పూర్తయింది. ఇంకా 10 పద్యాలను మాతర్ర చిత్రీకరించాల్సి ఉంది’ అన్నారు.
నిర్మాతలలో ఒకరైన జె.బాలరాజు మాట్లాడుతూ... ‘నాటి బాలరామాయణం చిత్రం తర్వాత. తిరిగి బాలల చిత్రం దానవీరశూరకర్ణ పేరుతో 18ఏళ్లకు వస్తోంది. కనుక ఎంతో శ్రద్ధాసక్తులతో, చక్కని స్క్రిప్ట్‌తో, ఆకట్టుకునే సెట్స్‌తో, ఆభరణాలతో ఖర్చుకు వెనుకాడకుండా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాము. దర్శకులు జె.వి.ఆర్ ప్రతీ సీన్‌ను అద్భుతంగా తీస్తున్నారు. మేము ముందు చెప్పినట్టుగానే మాస్టర్ ఎన్టీఆర్ నటన ఈ చిత్రానికి హైలెట్‌గా నిలుస్తుంది. ఈ చిత్రానికి చిత్రరంగంలోని ప్రముఖ సీనియర్ వ్యక్తి కాజ సూర్యనారాయణ గారు నిర్మాణ నిర్వాహకులుగా వ్యవహరిస్తున్నారు. కాగా, నాటి దానవీరశూరకర్ణ చిత్రానికి పని చేసిన చాలా మంది సీనియర్ టెక్నీషియన్లు ఈ చిత్రానికి పని చేస్తుండడం విశేషం. జయంత్ సాయి, యశ్వంత్, దిలీప్‌తేజ, శ్యామ్‌గోపాల్, కారుణ్య, భార్గవి, యామిని, సాహిత్య, విజ్జు, అభిరామ్, చందన్, గణేష్, దినేష్, లోహిత తదితర బాలురు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి మేకప్‌మేన్: సి.మాధవరావు, నృత్య దర్శకురాలు: ప్రమీల, కళాదర్శకులు: ఎస్.ఆర్.కె.శర్మ, ఎడిటర్: నందమూరి హరి, కాస్ట్యూమర్: పద్యాలయ మురళి, కో`డైరెక్టర్: పి.ఎన్.రాయ్, పాటలు : గంగోత్రి విశ్వనాథ్, సుబ్రహ్మణ్యం, సంగీతం : కౌసల్య, రచన`దర్శకత్వం: జె.వి.ఆర్, నిర్మాతలు: సి.హెచ్.వెంకటేశ్వరరావు, జె.బాలరాజు!