శ్రీహరి ఉదయగిరి, హేమంతిని, రోషిక ముఖ్యపాత్రల్లో భాస్కర గ్రూప్ ఆఫ్ మీడియా పతాకంపై వి.ఎస్.వాసు దర్శకత్వంలో దాసరి భాస్కర్ యాదవ్ నిర్మిస్తున్న యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ ‘టోల్ ఫ్రీ నెంబర్ 143(ఇది చాలా కాస్ట్ గురూ..). ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా మంగళవారం హైదరాబాద్‌లోని ఫిలింఛాంబర్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హీరో శ్రీహరి ఉదయగిరి, హీరోయిన్ రోషికా, దర్శకుడు వి.ఎస్.వాసు, నిర్మాత దాసరి భాస్కర్ యాదవ్, సంగీత దర్శకుడు శ్రీవెంకట్ తదితరులు పాల్గొన్నారు.
భాస్కర్‌యాదవ్: ఈ చిత్రానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయి. మార్చిలో చిత్రాన్ని రిలీజ్ చెయ్యాలని ప్లాన్ చేస్తున్నాం. ఇటీవల విడుదలైన ఈ చిత్రం ఆడియో చాలా పెద్ద సక్సెస్ అయింది. ఇందులోని 7 పాటల్ని శ్రీవెంకట్‌గారు చాలా అద్భుతంగా చేశారు. ఆన్‌లైన్‌లో ఈ పాటలకు చాలా డౌన్‌లోడ్స్ వస్తున్నాయి. కథ విషయానికి వస్తే ఇది అందరికీ కనెక్ట్ అయ్యే సబ్జెక్ట్. ఈ సినిమాని సెన్సార్‌కి పంపించాం. సెన్సార్ కార్యక్రమాలు పూర్తి కాగానే రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేస్తాం. హీరో శ్రీహరిగారు చాలా చక్కగా తన పాత్ర పోషించారు. ఈ సినిమా తప్పకుండా పెద్ద విజయం సాధించి మా అందరికీ మంచి పేరు తెస్తుందని ఆశిస్తున్నాను.
వి.ఎస్.వాసు: ఆడియోకి చాలా మంచి రెస్పాన్స్ వస్తోంది. నేను అనుకున్న దానికంటే శ్రీవెంకట్ చాలా మంచి మ్యూజిక్ చేశాడు. మ్యూజిక్ సినిమాకి చాలా హెల్ప్ అయింది. ఇందులో గబ్బర్‌సింగ్ గ్యాంగ్‌తో చేసిన ఎపిసోడ్ అందర్నీ ఆకట్టుకుంటుంది. ఈ గ్యాంగ్‌తో పాటలతో చేసిన ఒక ఫైట్ చాలా ఎక్స్‌లెంట్‌గా వచ్చింది. మాకు వున్న లిమిటెడ్ బడ్జెట్‌లో అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్‌తో చాలా పెద్ద రేంజ్‌లో చేశాం. తప్పకుండా ఈ సినిమా మీ అందర్నీ ఆకట్టుకుంటుంది.
శ్రీవెంకట్: ఈ చిత్రంలోని పాటలను ఆదరిస్తున్న ప్రేక్షకులకు థాంక్స్. అన్ని సాంగ్స్ బాగా రావడానికి మా నిర్మాత, దర్శకులు ఎంతో సహకరించారు. ఆర్.ఆర్. కూడా చాలా ఎక్స్‌లెంట్‌గా వచ్చింది. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించి ప్లాటినం డిస్క్ ఫంక్షన్ చెయ్యాలనుకుంటున్నాం.
రోషిక: ఈ సినిమాకి సంబంధించి అందరం దాదాపు కొత్తవాళ్ళమే. అయినా సినిమాని చాలా రిచ్‌గా తీశారు. ఈ చిత్రంలోని పాటలు ఎలక్ట్రానిక్ మీడియాలో చాలా పాపులర్ అయ్యాయి. ఇందులో ఫోక్‌సాంగ్, మాస్ సాంగ్, ఐటమ్ సాంగ్ ఇలా అన్ని రకాల పాటలు వున్నాయి. సినిమా కూడా చాలా బాగా వచ్చింది. మార్చిలో విడుదలవుతున్న ఈ చిత్రం మా అందరికీ మంచి పేరు తెస్తుందని ఆశిస్తున్నాను.
శ్రీహరి ఉదయగిరి, హేమంతిని, రోషికా, మహావీర్, అస్రిద్ మదుర్, పోసాని కృష్ణమురళి, కృష్ణభగవాన్, సుమన్ శెట్టి, రోలర్ రఘు, ధన్‌రాజ్, చమ్మక్ చంద్ర, సంధ్యా రaనక్ తదితరులు ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రానికి సంగీతం: శ్రీవెంకట్, సినిమాటోగ్రఫీ: శ్రీనివాస్ సబ్బి, మాటలు: మహేష్ ఎల్., ప్రొడక్షన్ డిజైనర్: బన్సి కె., డాన్స్: పాల్ వేణు, ఫైట్స్: రవి, నిర్మాత: దాసరి భాస్కర్ యాదవ్, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: వి.ఎస్.వాసు.