Advertisementt

బహుబలి నెల వాయిదా పడింది..!!

Mon 23rd Feb 2015 07:15 AM
bahubali,release dat,prabhas,may  బహుబలి నెల వాయిదా పడింది..!!
బహుబలి నెల వాయిదా పడింది..!!
Advertisement
Ads by CJ

తెలుగు సినీ చరిత్రలో అత్యంత భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న 'బహుబలి' చిత్ర కోసం యావత్‌ తెలుగు ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దాదాపుగా రెండేళ్లుగా షూటింగ్‌ జరుపుకుంటున్న ఈ సినిమా మొదటి భాగాన్ని 2015 ఏప్రిల్‌ 17న ప్రేక్షకుల మందుకు తీసుకొస్తారని చిత్రం యూనిట్‌ ఎప్పటినుంచో చెబుతోంది. అయితే ఈ చిత్రం విడుదల మరో నెల వాయిదా పడింది. మే నెలలో ఈ సినిమా విడుదల చేయడానికి నిర్ణయించారు. ఈ విషయాన్ని త్వరలో అధికారికంగా ప్రకటించనున్నట్లు సమాచారం. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్‌ సిటీలో వేసిన సెట్స్‌లో హీరో ప్రభాస్‌, అనుష్కలపై పతాక సన్నివేశాలను చిత్రకరిస్తున్నట్లు సమాచారం. రెండో హీరోయిన్‌గా తమన్నా నటిస్తున్న ఈ చిత్రంలో రానా ప్రతినాయకుడి పాత్రలో కనిపించనున్నారు.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ