'ఆనందం'తో ఆకాష్ ఒక్కసారిగా భారీ విజయాన్ని అందుకున్నాడు. ఆ తర్వాత డజన్ల కొద్ది సినిమాలు తీసినా ఆయనకు నిరాశే ఎదురైంది. ఆయన పట్టువదలని విక్రమార్కుడిలా తనకున్న పరిచయాలతో ప్రొడ్యూసర్‌లను వెతుక్కొని చిన్నచిన్న సినిమాల్లో హీరోగా తన వంతు ప్రయత్నాలు చేశారు. ఇక అవన్ని బెడిసికొట్టడంతో మరో రంగంలో ఆయన కెరియర్‌ను చక్కదిద్దుకునే పనిలో పడ్డాడు. ప్రస్తుతం ఆకాష్ కన్ను రాజకీయాలపై పడింది. ఆయన టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి సమక్షంలో ఆయన టీఆర్‌ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. అలాగే తెలంగాణ ప్రొడ్యూసర్స్ గిల్డ్ అధ్యక్షుడు రామకృష్ణాగౌడ్‌కు కూడా నాయిని టీఆర్‌ఎస్ పార్టీ సభ్యత్వాన్ని అందించారు. అంతే బాగానే ఉన్నా.. సమీపంలో ఎలాంటి ప్రత్యక్ష ఎన్నికలు లేని కాలంలో ఆకాష్ రాజకీయాల్లోకి దిగి ఏం సాధిస్తారనేది అంతుచిక్కకుండా ఉంది.