ఎన్టీఆర్, పూరిజగన్నాథ్ కాంబినేషన్ లో వచ్చిన మొదటి చిత్రం ఆంధ్రావాలా ఆశించిన ఫలితాలను ఇవ్వలేకపోయింది. మళ్ళీ అదే కాంబినేషన్ లో వచ్చిన సినిమా 'టెంపర్' ప్రేక్షకుల ముందుకు వచ్చి ఘన విజయం సాధించింది. పరమేశ్వర ఆర్ట్స్ బ్యానర్ పై బండ్ల గణేష్ నిర్మించిన ఈ చిత్రం ఫిబ్రవరి 13 న విడుదలయ్యి ప్రేక్షకులను మెప్పించింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ప్రముఖ జర్నలిస్ట్ నాగేంద్ర కుమార్ మాట్లాడుతూ "ఎన్టీఆర్ లాంటి దమ్ము ఉన్న హీరో కోసమే వక్కంతం వంశీ ఇలాంటి కథ రాసుకున్నట్లు ఉన్నారు. ఎంటర్ టైన్మెంట్ సపోర్ట్ లేకుండా కేవలం హీరో మీదే భారం వేసి గుదిబండ నడిపించినట్లుగా నడిపించారు. అందరూ రిస్క్ లేకుండా రొటీన్ ట్రాక్ లో సినిమాలు తీస్తున్న ఈ సమయంలో 'టెంపర్' లాంటి అద్భుతమైన సినిమా తీయడం అభినందనీయం. నటించడంలో ఎన్టీఆర్ కి ఉన్న గట్స్ ఎవరికి లేవనే చెప్పాలి. ఇలాంటి కథలు ఎన్నో రావాలని, బండ్ల గణేష్ ఇలాంటి సినిమాలు ఎన్నో నిర్మించాలని కోరుకుంటున్నా.." అని అన్నారు.
బండ్ల గణేష్ మాట్లాడుతూ "13వ తారీఖు వరకు సినిమా పేరు 'టెంపర్' రిలీజ్ అయ్యాక సినిమా పేరు 'బంపర్'. బాద్ షా సినిమా హిట్ తరువాత ఈ సినిమాతో బ్లాక్ బాస్టర్ వచ్చింది. ఈ సినిమా కథ విన్నాక పూరి అన్న కాల్ చేసి నీ బ్యానర్ లో ఇంకో గబ్బర్ సింగ్ వస్తే నీకేమైనా ప్రాబ్లమా అని అడిగారు అప్పుడే ఈ సినిమా హిట్ అవుతుంది అనుకున్నా. ఈ సినిమా కోర్టు సీన్ లో ఎన్టీఆర్ నటన 'సీనియర్ ఎన్టీఆర్' గారిని గుర్తు చేసే విధంగా ఉంది. సచిన్ జోషి నా వెనుకే ఉంటూ నాకు చాలా సపోర్ట్ చేసారు. ఈ సినిమా హిట్ అవకపోతే సినిమాలు తీయడం మానేద్దాం అనుకున్నా కాని ఇంక సంవత్సరానికి 2 సినిమాలు నిర్మిస్తాను 'టెంపర్' అంత ఎనర్జీ ఇచ్చింది. ఎన్టీఆర్, పూరి ఓకే అంటే 'టెంపర్ 2' కూడా నిర్మించాలని ఉంది" అని అన్నారు.
పూరిజగన్నాథ్ మాట్లాడుతూ "జీవితం ఎవరిని వొదిలిపెట్టదు, అందరికి తీర్చేస్తాది అలాగే పెద్ద సక్సెస్ కూడా ఇస్తుంది. అందరు హీరోలు కాల్ చేసి తారక్ పెర్ఫార్మన్స్ గురించే మాట్లాడారు. రత్న అనే విమెన్ రైట్స్ అసోసియేషన్ మెంబర్ కాల్ చేసి నిత్యం ఆడవాళ్ళ సమస్యలు చూసి చూసి ఏడుపు రావడం మానేసిన మమ్మల్ని ఏడిపించారు కదా సర్ అన్నారు. అది సినిమాకి బెస్ట్ కాంప్లిమెంట్. ఇంక సినిమా స్టొరీ కి వస్తే వంశీ మంచి కథని అందించాడు. అనూప్ రూబెన్స్ స్వరాలూ ప్రేక్షకులను మెప్పించాయి. మొదట కథ విన్నప్పుడు మన జీవితాలను మార్చే కథ అన్నాడు ప్రకాష్ రాజ్ అది ఇప్పుడు నిజం అయింది. దేవుడిచ్చిన తమ్ముడు బండ్ల గణేష్ ఆయన ఇంకా ఎన్నో చిత్రాలను నిర్మించాలి. ఎన్టీఆర్ ఒప్పుకుంటే తనతో ఇంకో సినిమా చేయాలని ఉంది" అని అన్నారు.
ఎన్టీఆర్ మాట్లాడుతూ "ఈ చిత్రం విజయమే కాదు సమాజంలో మాకొక అర్హతను తెచ్చింది. సమాజం పట్ల మాకున్న బాధ్యతను కూడా గుర్తుచేసింది. స్వతహాగా పూరి కి రాసే దమ్మున్నప్పటికీ బయట కథను తీసుకొని చేయడమే మా మొదటి విజయం. ఈ సినిమాకి పని చేసిన సాంకేతిక నిపుణులందరికీ నా అభినందనలు. ప్రకాష్ రాజ్ ఒక అధ్బుతమైన నటుడని మళ్ళీ ఈ సినిమాతో నిరూపించాడు. నా వెన్నంటే ఉంటూ నన్ను ప్రోత్సహించిన ప్రేక్షక దేవుళ్ళకు నా ధన్యవాదాలు" అని అన్నారు.
వక్కంతం వంశీ మాట్లాడుతూ "ఈ 'టెంపర్' విజయం వెనుక ఉన్నది ఒక్కరు కాదు. ఈ సినిమా కోసం కష్టపడిన ప్రతి ఒక్కరికీ ఈ సక్సెస్ దక్కుతుంది. కొన్ని సినిమాలలో భాగం పంచుకోవడం ఎంతో సంతోషాన్నిస్తుంది అలాంటి సినిమాలలో 'టెంపర్' ఒకటి. నాకు చాలా సంతృప్తినిచ్చిన సినిమా ఇది. పూరిజగన్నాథ్ వంటి డైరెక్టర్ కి నేను కథ ని అందించడం చాలా సంతోషంగా ఉంది. కథ, క్యారెక్టర్ నచ్చే ఈ సినిమాను నిర్మించడం జరిగింది. మొదట కొంచెం డౌట్ తోనే ఈ సినిమా కథని పూరి గారికి చెప్పాను. ఆయన రెండో ఆలోచన లేకుండా ఓకే చెప్పారు. ఈ సినిమాలో ఎన్టీఆర్, దయ పాత్రలో పరకాయప్రవేశం చేసారు. అంత బాగా నటించారు. ఈ సినిమాను భారీగా నిర్మించిన బండ్ల గణేష్ కు నా అభినందనలు" అని తెలిపారు.
ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ "టెంపర్ సినిమా సక్సెస్ అవుతుందని స్టొరీ విన్నప్పుడే నాకు తెలిసింది. మానవ సంబంధాల గురించి, ఒక అనాథ తన జర్నీలో అమ్మను, చెల్లిని, నాన్నను వెతుక్కోవడం వంటి విషయాలను వక్కంతం వంశీ చాలా బాగా రాసారు. ఈ రోజు ఈ సినిమా ఇంత పెద్ద సక్సెస్ కావడానికి కారణం ఒక పెయిన్ లో ఉండి కూడా నమ్మకాన్ని పోగొట్టుకోకుండా ఈ సినిమాను నిర్మించడమే. ఎన్టీఆర్ లాంటి గొప్ప నటుడ్ని మనం మళ్ళీ మళ్ళీ చూస్తూనే ఉండాలి" అని అన్నారు.
సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ మాట్లాడుతూ "ఇంత మంచి ఫిలిం లో వర్క్ చేయడానికి చాన్స్ ఇచ్చిన పూరికి, ఎన్టీఆర్ కి నా థాంక్స్ చెప్పుకుంటున్నాను. నా పాటలు సినిమాలో చాలా ఎలేవేట్ అయ్యాయి. బండ్ల గణేష్ గారి బ్యానర్ లో మొదటి సారిగా పని చేసిన సినిమా హిట్ అవడం చాలా సంతోషంగా ఉంది" అని అన్నారు.
భాస్కర్ భట్ల మాట్లాడుతూ "సినిమా యూనిట్ అంతా చాలా సంతోషంగా ఉన్నారు. ఎన్టీఆర్ తో బ్లాక్ బాస్టర్ సినిమా తీయాలనే కోరిక ఈ సినిమాతో నెరవేరింది. బండ్ల గణేష్ గారి బ్యానర్ లో సుమారుగా అన్ని సినిమాలలో పాటలు నేనే రాసాను. సినిమా ఆడకపోతే ప్రేక్షకులు ఎంత బాధ పడతారో అనే ఆలోచనతోనే ఈ సినిమా పాటలు రాసాను" అని అన్నారు.
కందికొండ మాట్లాడుతూ "ఈ చిత్రానికి ఇంత మంచి హిట్ అందిచ్చిన ప్రేక్షకులకు నా ధన్యవాదాలు.ఈ సినిమాలో 'నిన్ను చూసి పడిపోయా' అనే పాట రాసాను. ఒక మంచి పాట రాసాను అనే తృప్తి నాకు కలిగింది" అని అన్నారు.
సచిన్ జోషి మాట్లాడుతూ "పూరి, ఎన్టీఆర్ ఈ సినిమా సక్సెస్ కోసం చాలా కష్టపడ్డారు. సినిమా యూనిట్ అందరికీ న అభినందనలు" అని అన్నారు.