Advertisementt

'దిల్‌వాలే..'కు పులిస్టాప్‌ పడింది..!!

Fri 20th Feb 2015 07:11 AM
dil wale dulhania lejayange,maratha theater,ysh chopra films,movie removed  'దిల్‌వాలే..'కు పులిస్టాప్‌ పడింది..!!
'దిల్‌వాలే..'కు పులిస్టాప్‌ పడింది..!!
Advertisement
Ads by CJ

'దిల్‌వాలే దుల్హనియా లేజాయంగే' బాలీవుడ్‌ హిస్టరరీలోనే బిగెస్ట్‌ హిట్‌. 1995 అక్టోబర్‌ 19న విడుదలైన ఈ సినిమా ఏకబిగిన ముంబైలోని మరాఠా  మందిర్‌ థియేటర్‌లో 1009 వారాలపాటు ఆడింది. ఎట్టకేలకు ఈ గురువారం 'దిల్‌వాలే..' ప్రదర్శనను ఇక నిలిపివేస్తున్నట్లు థియేటర్‌ యాజమాన్యం ప్రకటించింది. ప్రస్తుతం థియేటర్‌ సామర్థ్యంలో 25శాతం సీట్లు కూడా నిండటం లేదని, ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రదర్శనను నిలిపివేయడం తప్ప తమకు మరో గత్యంతరం కనబడటం లేదని థియేటర్‌ యాజమాన్యం ప్రకటించింది. కొన్నేళ్లుగా ఈ థియేటర్‌లో ఈ సినిమాను ఉదయం 9.15 షో మాత్రమే నడిపిస్తున్నారు. ఇక ఇంతకుముందు షోలే ఐదేళ్లపాటు ఒకే థియేటర్‌లో ఏకబిగిన నడిచి సృష్టించిన రికార్డును 'దిల్‌వాలే..' ఎప్పుడో అధిగమించింది. ప్రస్తుతం ఉన్న మార్కెటింగ్‌ స్ట్రాటజీని చూస్తే 'దిల్‌వాలే..' రికార్డును బ్రేక్‌ చేయడం అసాధ్యమని బాలీవుడ్‌ వర్గాలు చెబుతున్నాయి.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ