Advertisementt

'టైగర్' మూవీ ఆడియో లాంచ్..!

Wed 18th Feb 2015 02:55 AM
tiger movie launch,sandeep kishan,rahul,allari naresh,vv vinayak  'టైగర్' మూవీ ఆడియో లాంచ్..!
'టైగర్' మూవీ ఆడియో లాంచ్..!
Advertisement
Ads by CJ

సందీప్ కిషన్ హీరోగా రాహుల్, శీరత్ కపూర్ జంటగా లియో ప్రొడక్షన్స్ పతాకంపై ఎన్.వి.ప్రసాద్ మరియు ఠాగూర్ మధు ప్రేక్షకులకు అందిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ 'టైగర్' చిత్రం. దర్శకుడు ఆనంద్. ఈ చిత్రం ఆడియో వేడుక మంగళవారం హైదరాబాద్ శిల్పకళావేదికలో పలువురు సినీ ప్రముఖుల సమక్షంలో వైభవంగా జరిగింది. డైరెక్టర్ వి.వి.వినాయక్, భూమా నాగిరెడ్డి సంయుక్తంగా ఈ ఆడియోను ఆవిష్కరించి మొదటి సి.డి హీరో నరేష్ కు, దర్శకుడు అనిల్ సుంకర కు అందించారు. తమన్ సంగీత సారధ్యంలో రూపొందిన ఈ ఆడియో శ్రేయాస్ మీడియా ద్వారా మార్కెట్ లోకి విడుదలైంది. ఈ కార్యక్రమంలో ప్రముఖ సినిమాటోగ్రాఫర్ చోటా.కె.నాయుడు, దర్శకురాలు నందిని రెడ్డి, డైరెక్టర్ స్టీవెన్ శంకర్, హీరో నాగశౌర్య, అల్లరి నరేష్, సుశాంత్, రకుల్ ప్రీత్ సింగ్, డైరెక్టర్ సుకుమార్ హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో డైరెక్టర్ సుకుమార్ మాట్లాడుతూ "ఫ్రెండ్ షిప్, లవ్, రొమాన్స్ అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ కలగలిపిన చిత్రమిది. పక్కింటి అబ్బాయిలా ఫీచర్స్ ఉండే సందీప్ కి మంచి ఫ్యూచర్ ఉండాలని పెద్ద స్టార్ గా ఎదగాలని కోరుకుంటున్నా'' అని అన్నారు.
డైరెక్టర్ వి.వి.వినాయక్ మాట్లాడుతూ "సందీప్ ప్రతి సినిమా కాన్సెప్ట్ డిఫరెంట్ గా ఉండేలా చూసుకొని సినిమాలు చేస్తాడు. ఈ సినిమా ట్రైలర్ చూస్తుంటే ఎంత పెద్ద హిట్ అవుతుందో తెలుస్తుంది. ట్రైలర్ లో చూపించిన గోదావరి బ్రిడ్జిని చాలా బాగా పిక్చరైజ్ చేసారు" అని అన్నారు.
దర్శకురాలు నందిని రెడ్డి మాట్లాడుతూ "కొన్ని సినిమాలు ట్రైలర్స్, పోస్టర్స్ చూసాక మాట్లాడానికి మాటలు ఉండవు. 'టైగర్' కూడా అదే కోవకు చెందుతుంది. తమన్ మ్యూజిక్, చోటా మ్యాజిక్ అల్టిమేట్లీ సినిమా హిట్. 'టైగర్' చిత్ర బృందానికి ఆల్ ది బెస్ట్" అని చెప్పారు.
హీరో అల్లరి నరేష్ మాట్లాడుతూ "సందీప్, రాహుల్ నాకు మంచి స్నేహితులు. నాకు శర్వానంద్ కు గమ్యం ఎంత మంచి హిట్ ఇచ్చిందో, సందీప్ కు, రాహుల్ కు ఈ సినిమా అంత మంచి హిట్ ఇస్తుంది. సందీప్ తన ప్రతి సినిమా తన మొదటి సినిమాలా భావించి కష్టపడతాడు" అని అన్నారు.
ఈ సినిమా దర్శకుడు ఆనంద్ మాట్లాడుతూ "స్నేహితుడు ఉన్న ప్రతి ఒక్కరికి ఈ మూవీ నచ్చుతుంది. ఈ సినిమా చూసిన తరువాత అందరికి 'టైగర్' లాంటి ఫ్రెండ్ ఉండాలనిపిస్తుంది. సందీప్ ఈ రోల్ ని చాలెంజింగ్ గా తీసుకొని చేసాడు. రాహుల్, శీరత్ చాలా బాగా నటించారు. రవి పవర్ ఫుల్ డైలాగ్స్ అందించారు. ఈ యాక్షన్ థ్రిల్లర్ సినిమాని తమన్ మ్యూజికల్ యాక్షన్ థ్రిల్లర్ గా మార్చాడు" అని అన్నారు.
ప్రముఖ సినిమాటోగ్రాఫర్ చోటా కె నాయుడు మాట్లాడుతూ "సందీప్ కొత్తగా ఉన్న సినిమాలను మాత్రమే సెలెక్ట్ చేస్తాడు. ఇదొక అధ్ముతమైన లవ్ స్టొరీ. రాహుల్ మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఈ సినిమాకి కొత్త స్క్రీన్ ప్లే ట్రై చేసాము. తప్పకుండా ఈ సినిమాను ఆదరిస్తారనుకుంటున్నా"  అని అన్నారు.
మ్యూజిక్ డైరెక్టర్ తమన్ మాట్లాడుతూ "టైగర్ అనే పేరు కొన్ని వారాల నుండి రికార్డులను సృష్టిస్తుంది. సినిమా రిలీజ్ అయి ఇంకా రికార్డులను సృష్టిస్తుంది. సందీప్ కి మంచి భవిష్యత్తు ఉంటుంది" అని అన్నారు.
హీరో సందీప్ కిషన్ మాట్లాడుతూ "నాకు ఎదగడానికి మంచి చాన్స్ ఇచ్చిన సినిమా ఇది. ఇంటెలిజెంట్ డైరెక్టర్ తో వర్క్ చేసాను. 'టైగర్' నా కెరీర్ లో బెస్ట్ ఫిలిం గా నిలిచిపోతుంది. మంచి సినిమా తీయాలనే ఉద్దేశ్యంతోనే ఈ ప్రయత్నం చేశాం" అని అన్నారు.
హీరో రాహుల్ మాట్లాడుతూ "చోటా గారు ఈ సినిమాకు సూపర్ స్టార్. ఆనంద్ చాలా బాగా చిత్రాన్ని తెరకెక్కించారు. హీరోయిన్ శీరత్ కపూర్ నేచురల్ ఆర్టిస్ట్. తెలుగు డైలాగ్స్ కూడా తనే చెప్పుకుంది. ప్రొడ్యూసర్ ఎన్.వి.ప్రసాద్, ఠాగూర్ మధు ఇలాంటి మంచి సినిమాను ప్రోత్సహించడం అభినందనీయం" అని అన్నారు.
హీరోయిన్ శీరత్ కపూర్ మాట్లాడుతూ "కామ్ గా ఉంటూ 'టైగర్' లాంటి సినిమా తీయడం డైరెక్టర్ ఆనంద్ కే సాధ్యం. మేము ఇక్కడ ఉన్నాము అంటే దానికి కారణం ప్రేక్షక దేవుళ్ళే. ఈ సినిమాను తప్పకుండా ఆదరిస్తారనే నమ్మకంతో ఉన్నాం" అని అన్నారు.
హీరో నాగ శౌర్య మాట్లాడుతూ "సందీప్ ఎప్పుడూ స్క్రిప్ట్ గురించే మాట్లాడుతూ ఉంటాడు. ఈ సినిమాలో సందీప్ ది ఓ సర్ప్రైజింగ్ క్యారెక్టర్" అని అన్నారు.
నటి రకుల్ మాట్లాడుతూ "ట్రైలర్, సాంగ్స్ చాలా బావున్నాయి. ఖచ్చితంగా ఈ సినిమా పెద్ద హిట్ అవుతుంది" అని అన్నారు.
హీరో సుశాంత్ మాట్లాడుతూ "సందీప్ సినిమా కోసం చాలా కష్టపడతాడు. ఈ సినిమాలో చాలా రఫ్ గా కనిపిస్తున్నాడు. సినిమా కూడా చాలా రఫ్ గా ఉంటుంది" అని అన్నారు.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ