Advertisementt

ఫిబ్రవరి 20న ‘అనేకుడు’ విడుదల

Tue 17th Feb 2015 05:28 AM
anekudu on feb 20th,hero dhanush,director k.v.anand,amaira dastur,actor karthik  ఫిబ్రవరి 20న ‘అనేకుడు’ విడుదల
ఫిబ్రవరి 20న ‘అనేకుడు’ విడుదల
Advertisement
Ads by CJ
ధనుష్‌ హీరోగా కె.వి. ఆనంద్‌ దర్శకత్వంలో ఎ.జి.ఎస్‌. ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపైన రూపుదిద్దుకున్న ‘అనేకుడు’ ఆడియో ఇటీవలే విడుదలై, మంచి సక్సెస్‌ అయింది. చిత్రం అన్ని పనులను పూర్తి చేసుకుని ఫిబ్రవరి 20న విడుదలకు ముస్తాబైంది. 
ఈ సందర్భంగా దర్శకుడు కె. వి. ఆనంద్‌ మాట్లాడుతూ..‘ఇది రెగ్యులర్‌గా వచ్చే సినిమా కాదు. డిఫరెంట్‌ స్క్రీన్‌ప్లేతో కొనసాగే రొమాంటిక్‌ లవ్‌స్టోరీ. హేరిస్‌ జయరాజ్‌ దీనికి చాలా మంచి మ్యూజిక్‌ని ఇచ్చారు. ఇది అన్ని తరగతుల వారికి నచ్చుతుందనే నమ్మకం నాకుంది. ఇందులో ధనుష్‌ నాలుగు విభిన్నమైన పాత్రల్లో కనిపిస్తాడు. ఆ పాత్రలలోని నాలుగు డిఫరెంట్‌ షేడ్స్‌ని ఈ ‘అనేకుడు’లో ప్రేక్షకులు చూసి ఎంజాయ్‌ చేస్తారు’ అని అన్నారు.
నిర్మాతల్లో ఒకరైన ఎస్‌. కల్పాత్తి సురేష్‌ మాట్లాడుతూ..‘ఈ సినిమా మీద మంచి ఎక్స్‌పెక్టేషన్స్‌ ఉన్నాయి. ఇది తెలుగు ప్రేక్షకులని మెప్పిస్తుంది.  హీరోగా ధనుష్‌ అద్భుతమైన నటనను ప్రదర్శించాడు. కె.వి. ఆనంద్‌ దీనిని అందరూ మెచ్చే రీతిలో తెరకెక్కించారు అని అంటూ ఫిబ్రవరి 20న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నాము..‘ అని చెప్పారు. 
ధనుష్‌ సరసన అమైరా దస్తూర్‌ కధానాయికగా నటించిన ఈ చిత్రంలో కార్తీక్‌, ఐశ్వర్య, ఆశీష్‌ విద్యార్ధి, అతుల్‌ కులకర్ణిమొదలగు వారు ఇతర పాత్రలను పోషించారు. 
హరీష్‌ జైరాజ్‌ సంగీతం సమకూర్చిన ఈ చిత్రానికి పాటలు: సాహితి, వనమాలి: ఛాయాగ్రహణం: ఓం ప్రకాష్‌; ఎడిటింగ్‌: ఆంథోని లు పనిచేసిన సాంకేతిక వర్గం. నిర్మాతలు: కల్పాత్తి ఎస్‌. అఘోరం, కల్పాత్తి. ఎస్‌. గణేష్‌, కల్పాత్తి. ఎస్‌. సురేష్‌, స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: కె.వి. ఆనంద్‌.
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ