Advertisementt

ఫిబ్రవరి 20న రిలీజ్‌ అవుతున్న ‘గాయకుడు’

Tue 17th Feb 2015 04:59 AM
gayakudu movie,roshan saluri,akshara,koti,gayakudu on feb 20th,director kamal g.  ఫిబ్రవరి 20న రిలీజ్‌ అవుతున్న ‘గాయకుడు’
ఫిబ్రవరి 20న రిలీజ్‌ అవుతున్న ‘గాయకుడు’
Advertisement
Ads by CJ

సిద్ధాంశ్‌, అక్షర హీరోహీరోయిన్లుగా శ్రీమతి లక్ష్మీ సమర్పణలో ధీరు ఫిలింస్‌ పతాకంపై కమల్‌ జి. దర్శకత్వంలో యువ నిర్మాత జమ్మలమడుగు రవీంద్రనాథ్‌ నిర్మిస్తున్న యూత్‌ఫుల్‌ అండ్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ‘గాయకుడు’. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఫిబ్రవరి 20న విడుదలవుతోంది. ఈ సందర్భంగా చిత్ర విశేషాలను తెలిపేందుకు చిత్ర యూనిట్‌ విలేకరులతో సమావేశమైంది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా ప్రముఖ సంగీత దర్శకుడు కోటి హాజరయ్యారు. హీరో సిద్ధాంశ్‌, విలన్‌ గురుచరణ్‌, దర్శకుడు కమల్‌ జి., సంగీత దర్శకుడు రోషన్‌ సాలూరి, నిర్మాత జమ్మలమడుగు రవీంద్రనాథ్‌ పాల్గొన్నారు.

జమ్మలమడుగు రవీంద్రనాథ్‌: ఈ సినిమా కోసం రోషన్‌ని సంగీత దర్శకుడుగా సెలెక్ట్‌ చేసుకొని మంచి మ్యూజిక్‌ చేయించుకునే అవకాశం ఇచ్చిన కోటిగారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రోషన్‌ ఈ చిత్రంలోని పాటలన్నీ చాలా అద్భుతంగా చేశారు. ఇందులో హీరోహీరోయిన్లుగా నటించిన సిద్ధాంశ్‌, అక్షర చాలా అద్భుతంగా పెర్‌ఫార్మ్‌ చేశారు. నాకు హండ్రెడ్‌ పర్సెంట్‌ శాటిస్‌ఫ్యాక్షన్‌ ఇచ్చిన సినిమా ఇది. ఈ సినిమాకి పనిచేసిన వారంతా చాలా ఎక్స్‌పీరియన్స్‌డ్‌. నేను మాత్రమే నిర్మాతగా కొత్త. సినిమా బాగా రావడానికి ప్రతి ఒక్కరూ ఎంతో కృషి చేశారు. ముఖ్యంగా కమల్‌కి ఇది మొదటి సినిమా అయినప్పటికీ ఇండస్ట్రీలో దాదాపు 15 సంవత్సరాలుగా వున్నారు. చాలా మంది ప్రముఖ దర్శకుల వద్ద పనిచేశారు. ఒక మంచి సినిమా ప్రేక్షకులకు అందించాలన్న మా ప్రయత్నాన్ని మీరందరూ సపోర్ట్‌ చేస్తారని, సినిమాని సూపర్‌హిట్‌ చేసి మమ్మల్ని ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను.

గురుచరణ్‌: అగ్నిపూలు సీరియల్‌లో నన్ను చూసి ఈ సినిమా కోసం పిలిచారు. సాధారణంగా హీరోకి రెండు గంటలపాటు స్టోరీ చెప్తారు. కానీ, నేను ఇందులో చేస్తున్న విలన్‌ క్యారెక్టర్‌ కోసం నాక్కూడా రెండు గంటలు స్టోరీ చెప్పారు. ఈ క్యారెక్టర్‌కి నేనయితేనే హండ్రెడ్‌ పర్సెంట్‌ సూట్‌ అవుతానని నన్ను నమ్మి అవకాశం ఇచ్చారు. రోషన్‌గారు ఈ సినిమాకి చాలా మంచి మ్యూజిక్‌ ఇచ్చారు. ఈ పాటల్లో ‘ఏవైపు నడవాలో..’ అనే ఒక పెయిన్‌ఫుల్‌ సాంగ్‌ వుంది. అది నా ఫేవరేట్‌ సాంగ్‌. అలాగే మిగతా పాటలు కూడా చాలా బాగా చేశారు. ఈ సినిమా ప్రతి ఒక్కరికీ నచ్చుతుందన్న నమ్మకం నాకు వుంది. 

రోషన్‌ సాలూరి: నన్ను నమ్మి ఈ సినిమాకి మ్యూజిక్‌ చేసే అవకాశం ఇచ్చిన దర్శకనిర్మాతలకు నా థాంక్స్‌. వారు నాకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నానని అనుకుంటున్నాను. మా సినిమా ఆడియో ఫంక్షన్‌ ఎంత గ్రాండ్‌గా జరిగిందో అందరికీ తెలుసు. రెహమాన్‌లాంటి లెజండరీ మ్యూజిక్‌ డైరెక్టర్‌ మా ఫంక్షన్‌కి వచ్చి ఆడియోను రిలీజ్‌ చేయడమనేది చాలా రేర్‌ అని చెప్పాలి. అలాగే హేరిస్‌ జైరాజ్‌గారు, మణిశర్మగారు.. ఇలా చాలా మంది మ్యూజిక్‌ డైరెక్టర్స్‌ ఫంక్షన్‌కి వచ్చి నన్ను బ్లెస్‌ చేశారు. వారి ఆశీర్వాదంతో, ప్రేక్షకుల ఆశీస్సులతో మంచి మ్యూజిక్‌ ఇచ్చే అవకాశం నాకు వచ్చింది. ఆడియోకి చాలా మంచి పేరు వచ్చింది. అలాగే సినిమా కూడా పెద్ద హిట్‌ అవుతుందని నమ్ముతున్నాను.

సిద్ధాంశ్‌: రోషన్‌ చాలా బ్యూటిఫుల్‌ మ్యూజిక్‌ ఇచ్చారు. మా సినిమా ఆడియో ఫంక్షన్‌ అంత గ్రాండ్‌ జరిగిందంటే దానికి కోటిగారే కారణం. ఆయన లేకపోతే అది సాధ్యమయ్యేది కాదు. ఈ పాటల్ని అందరూ అప్రిషియేట్‌ చేస్తున్నారు. ఇది ఒక ఫీల్‌ గుడ్‌ లవ్‌ ఎంటర్‌టైనర్‌. చాలా క్లీన్‌గా వుండే సినిమా. సెన్సార్‌వారు కూడా ఈ సినిమా చూసి అభినందించి యు సర్టిఫికెట్‌ ఇచ్చారు. ఫిబ్రవరి 20న రిలీజ్‌ అవుతున్న ఈ సినిమాని సూపర్‌హిట్‌ చేస్తారని ఆశిస్తున్నాను.

కోటి: ఈమధ్యకాలంలో వస్తున్న చిన్న సినిమాల్ని ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారు. ప్రస్తుతం చిన్న సినిమాల ట్రెండ్‌ నడుస్తోంది. కొత్త తరహా చిత్రాలను ఆదరిస్తున్నారు. సాలూరి రాజేశ్వరరావుగారి అబ్బాయిగా నన్ను ఎంతో ఆదరించారు. మూడోతరం మ్యూజిక్‌ డైరెక్టర్‌గా వస్తున్న రోషన్‌కి కూడా మీ ఆశీస్సులు వుంటాయని భావిస్తున్నాను. 1974లో గిటారిస్ట్‌గా నా కెరీర్‌ స్టార్ట్‌ చేశాను. 43 ఏళ్ళుగా ఇండస్ట్రీలో వున్నాను. సక్సెస్‌లను చూశాను, ఫెయిల్యూర్స్‌ని చూశాను. నువ్వేకావాలి అనే నాకు మ్యూజిక్‌ డైరెక్టర్‌గా మంచి గుర్తింపును ఇచ్చింది. మా అబ్బాయి ‘గాయకుడు’ అనే మంచి సినిమా ద్వారా మ్యూజిక్‌ డైరెక్టర్‌గా పరిచయం కావడం ఆనందంగా వుంది. డైరెక్టర్‌ కమల్‌ సినిమాని ఒక అద్భుతమైన కావ్యంలా తీశాడు. ఈ సినిమాలో ఎవరూ ఎక్స్‌పెక్ట్‌ చేయని ఒక పాయింట్‌ వుంటుంది. అది క్లైమాక్స్‌లో రివీల్‌ అవుతుంది. తప్పకుండా ఈ సినిమాని మీ అందరూ ఎంజాయ్‌ చేస్తారు.

కమల్‌ జి.: ఒక కథని సినిమాగా నిర్మించడానికి రవీంద్రనాథ్‌గారు ముందుకు వచ్చారు. ఈ సినిమాని ఎవరితో చేద్దామని హీరో  సెలక్షన్‌ కోసం పెద్ద ప్రాసెస్‌ జరిగింది. సిద్ధాంశ్‌ అయితేనే ఆ క్యారెక్టర్‌కి పూర్తి న్యాయం జరుగుతుందని అతన్ని సెలెక్ట్‌ చేయడం జరిగింది. ఈ సినిమాకి సంబంధించి ఆర్టిస్టులుగానీ, టెక్నీషియన్స్‌గానీ చక్కగా కుదిరారు. ఒక వండర్‌ఫుల్‌ టీమ్‌తో వర్క్‌ చేశానన్న తృప్తి నాకు కలిగింది. ముఖ్యంగా రోషన్‌ చాలా ఎక్స్‌ట్రార్డినరీ మ్యూజిక్‌ ఇచ్చారు. ఇందులో 8 పాటలు వున్నాయి. వాటిలో నాలుగు చంద్రబోస్‌గారు రాయగా, ఒక పెద్ద పాట, మూడు చిన్నపాటలు అనంతశ్రీరామ్‌గారు రాశారు. ఆడియోకి ఆల్రెడీ చాలా మంచి పేరు వచ్చింది. ఈ పాటలు విజువల్‌గా కూడా చాలా బాగా వచ్చాయి. తప్పకుండా ఈ సినిమా మ్యూజికల్‌ హిట్‌ అవుతుందన్న కాన్ఫిడెన్స్‌ నాకు వుంది. 

సిద్ధాంశ్‌, సంతోష్‌పవన్‌, అక్షర, గురుచరణ్‌, సప్తగిరి, మాస్టర్‌ ధీరునాథ్‌, భాస్కర్‌, రాకేష్‌, పార్వతి, విష్ణుప్రియ, బేబియోధ, శైలజారెడ్డి తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కథ: జి.వెంకాయమ్మ, సంగీతం: రోషన్‌ సాలూరి, కెమెరా: కొల్లి దుర్గాప్రసాద్‌, పాటలు: చంద్రబోస్‌, అనంతశ్రీరామ్‌, మాటలు: కార్తీక్‌ గోపిని, ఆర్ట్‌: రామచంద్రసింగ్‌, ఎడిటింగ్‌: ఉద్దవ్‌ ఎస్‌.బి., స్టిల్స్‌: కానుగుల కృష్ణ, ప్రొడక్షన్‌ ఎగ్జిక్యూటివ్‌: పి.ఎన్‌.నందం, సమర్పణ: శ్రీమతి లక్ష్మీ, నిర్మాత: జమ్మలమడుగు రవీంద్రనాథ్‌, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: కమల్‌ జి. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ