Advertisementt

'వారధి' మూవీ ట్రైలర్ లాంచ్..!

Tue 17th Feb 2015 04:57 AM
varadhi,sathish,kranthi,sri divya,hemanth  'వారధి' మూవీ ట్రైలర్ లాంచ్..!
'వారధి' మూవీ ట్రైలర్ లాంచ్..!
Advertisement
Ads by CJ

కాస్మిక్ ఇమాజినేషన్స్ పతాకంపై సతీష్ కార్తికేయ తెరకెక్కించిన చిత్రం 'వారధి'. ఈ చిత్రం ట్రైలర్ లాంచ్ మంగళవారం హైదరాబాద్ లో జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో అతిథిగా వచ్చిన మల్లెల తీరం సినిమా దర్శకుడు జి.వి.రామరాజు మాట్లాడుతూ "ఈ సినిమాలో హీరోలుగా నటించిన క్రాంతి, హేమంత్ సినిమా కోసం చాలా కష్టపడి పని చేస్తారు. సతీష్ కు మొదటి సినిమా అయినా ఎక్స్ పీరియన్స్ డైరెక్టర్ లా చేసాడు. ఈ సినిమా పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నా" అని అన్నారు.

దర్శకుడు సతీష్ కార్తికేయ మాట్లాడుతూ "ఇది నా మొదటి సినిమా. ఈ సినిమాకి ప్రతి ఒక్కరు చాలా కష్టపడి పని చేసారు. ఫిబ్రవరి చివరి వారంలో లేదా మార్చి మొదటి వారంలో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం" అని అన్నారు.

హీరో క్రాంతి మాట్లాడుతూ "ఈ సినిమాలో నా క్యారెక్టర్ పేరు వినయ్. తెలుగులో ఓ కొత్త జోనర్ ని ఈ సినిమాలో చూపించడానికి ప్రయత్నించాం. ఓ ప్రేమ కథ కి కామెడి ని కూడా జోడించి ఈ చిత్రాన్ని తెరకెక్కించాం" అని అన్నారు.

మరొక హీరో హేమంత్ మాట్లాడుతూ "ఈ సినిమాలో గౌతమ్ అనే పాత్రలో నటించాను. మూడు పాత్రల మధ్యనే సినిమా అంతా నడుస్తుంది. సినిమా అంతా ఎమోషనల్ జర్నీలా నడుస్తుంది" అని అన్నారు.   

హీరోయిన్ శ్రీదివ్య మాట్లాడుతూ "ఇదొక లవ్ స్టొరీ. ఈ సినిమా ద్వారా దర్శకుడు ప్రేక్షకులకు ఓ మెసేజ్ కన్వేయ్ చేయనున్నారు. అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ కలగలిపి ఈ చిత్రాన్ని నిర్మించారు" అని అన్నారు.

సంగీత దర్శకుడు విజయ్ గొర్తి మాట్లాడుతూ "ఈ సినిమాకి మ్యూజిక్ అందించే అవకాసం నాకు ఇచ్చిన డైరెక్టర్ కి, క్రాంతి కి నా ధన్యవాదములు. మ్యూజికల్ గా కూడా ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నా" అని అన్నారు.  

 ఈ చిత్రంలో నటీనటులు: ఎమ్.ఎస్.నారాయణ, కృష్ణ భగవాన్, శ్రీనివాస్ రెడ్డి, రంగనాథ్, బెంగుళూరు పద్మ.

 సాంకేతిక వర్గం: కెమెరా: రాజేంద్ర కేసాని, ఎడిటర్: కార్తిక శ్రీనివాస్, సాహిత్యం: చైతన్య వర్మ.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ