Advertisementt

ఏప్రిల్‌లో ప్రారంభంకానున్న రాంచరణ్‌ కంపెనీ సేవలు..!!

Tue 17th Feb 2015 04:40 AM
ramcharan tej,turbo megha,aviation,upcoming films  ఏప్రిల్‌లో ప్రారంభంకానున్న రాంచరణ్‌ కంపెనీ సేవలు..!!
ఏప్రిల్‌లో ప్రారంభంకానున్న రాంచరణ్‌ కంపెనీ సేవలు..!!
Advertisement
Ads by CJ

రాంచరణ్‌తేజ ఒకే సమయంలో అటు సినీ కెరియర్‌తోపాటు ఇటు బిజినెస్‌పై కూడా దృష్టిపెడుతున్నాడు. అతను విమానయాన రంగంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. టర్బోమేఘ ఏవియేషన్‌ సంస్థలో రాంచరణ్‌తేజ కూడా పార్ట్‌నర్‌గా ఉన్నారు. కంపెనీ డైరెక్టర్లలో రాంచరణ్‌ కూడా ఒకరుగా ఉన్నారు. ఇక గత జూలై మాసంలో ప్రారంభమయిన ఈ కంపెనీ ఇప్పుడు కమర్షియల్‌గా సేవలందించడానికి రంగం సిద్ధం చేసుకుంటోంది. ఇప్పటికే విమానయాన శాఖనుంచి అన్ని రకాల అనుమతులు పొందిన టర్బోమేఘ వచ్చే ఏప్రిల్‌నుంచి సేవలందించడానికి సిద్ధమవుతోంది. మొదటగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లల్లోని ఆధ్యాత్మిక కేంద్రాలకు ఈ విమానయాన సంస్థ సేవలందించనుంది. ఆ తర్వాత మెట్రో నగరాలకు కూడా సేవలను విస్తరించనున్నట్లు కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ