హెజెన్ ఎంటర్‌టైన్‌మెంట్స్, అన్విత ఆర్ట్ క్రియేషన్స్ పతాకాలపై శ్రావణ్‌కుమార్ నల్లా దర్శకత్వంలో ప్రసాద్‌రెడ్డి, సతీష్ పుట్టగుంట సంయుక్తంగా నిర్మిస్తున్న యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ ‘లవ్‌స్టేట్స్’. ఈ చిత్రం ఆడియో ఆవిష్కరణ సోమవారం హైదరాబాద్‌లోని తాజ్ డెక్కన్ హోటల్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ ఆడియోను ఆవిష్కరించి తొలి సీడీని ప్రశాంత్, అపర్ణలకు అందించారు. పవన్ శేష సంగీత సారధ్యంలో రూపొందిన ఈ ఆడియో శ్రేయాస్ మ్యూజిక్ ద్వారా మార్కెట్‌లోకి విడుదలైంది. ఈ సందర్భంగా...
తలసాని శ్రీనివాస యాదవ్: ఈ సినిమా ద్వారా కళలకు, సినిమాలకు కులాలు, ప్రాంతాలు వుండవు అనే సందేశాన్ని అందిస్తున్నారు. ఈ సినిమాకి పనిచేసిన వారంతా యూతే. తప్పకుండా ఈ సినిమా మంచి విజయాన్ని సాధిస్తుందన్న నమ్మకం నాకు వుంది. సినిమా షూటింగ్‌ల విషయంలో హైదరాబాద్‌కి వున్న ప్రత్యేకత ఏ రాష్ట్రానికీ లేదు. ఇక్కడ ప్రతి నెల 200 సినిమాల షూటింగ్‌లు జరుగుతూ వుంటాయి. ఎంతో మంది త్యాగాల ఫలితంగానే తెలుగు చలనచిత్ర పరిశ్రమ హైదరాబాద్‌లో స్థిరపడిరది.
శివాజీ: మన రెండు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత మనం విడిపోయినా కలిసి వుందాం అని చెప్పే సినిమా ఇది. ఈ సినిమా ఒక మంచి ప్రయత్నం అని చెప్పాలి. 15 సంవత్సరాల క్రితం చిన్న సినిమాలకు సబ్సిడీలు ఇచ్చేవారు. ఇప్పుడున్న రెండు ప్రభుత్వాలు సబ్సిడీ ఇస్తే బాగుంటుందని నా అభిప్రాయం.
పవన్‌శేష: మంచి మ్యూజిక్ చెయ్యడానికి దర్శకనిర్మాతలు నాకు పూర్తి స్వేచ్ఛనిచ్చారు. అన్ని పాటలు బాగా వచ్చాయి. తప్పకుండా మీ అందరికీ నచ్చుతాయి. ఇంత మంచి అవకాశం నాకు ఇచ్చిన దర్శకనిర్మాతలకు ధన్యవాదాలు.
ప్రసాద్‌రెడ్డి, సతీష్: పవన్‌శేష చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు. తెలుగులో పెద్ద సింగర్స్‌గా పేరు తెచ్చుకుంటున్న హేమచంద్ర, శ్రావణ భార్గవి, ప్రణవి, దీపులతో ఈ పాటలు పాడిరచడం జరిగింది. ఈ పాటలు తప్పకుండా ప్రతి ఒక్కరికీ నచ్చుతాయి. మన రెండు రాష్ట్రాల మధ్య ప్రేమలు, పెళ్ళిళ్ళ విషయంలో వున్న అపోహలు తొలగించే విధంగా ఎంతో వినోదాత్మకంగా ఈ చిత్రాన్ని రూపొందించడం జరిగింది. తప్పకుండా ఈ సినిమా ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటుంది.
బెక్కం వేణుగోపాల్: నేను శివాజీతో 7 సినిమాలు చేశాను. ఈ నిర్మాతలు కూడా శివాజీతో బూచమ్మ బూచోడు తొలి చిత్రంగా నిర్మించారు. ఈ సినిమా విషయానికి వస్తే ఇందులో ఒక సర్‌ప్రైజింగ్ ఎలిమెంట్ వుంది. అది ఏమిటో సినిమా చూస్తే తెలుస్తుంది.
నటుడు విక్రమ్: నాన్నగారు ఎం.ఎస్.నారాయణగారు ఈ సినిమాలో చాలా మంచి క్యారెక్టర్ చేశారు. తప్పకుండా ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను.
శశికిరణ్: నాన్నగారు చేసిన చివరి సినిమాల్లో ఇది కూడా ఒకటి. ఈ సినిమా ట్రైలర్స్ చాలా బాగున్నాయి. విజువల్‌గా ఎంతో అందంగా వున్నాయి.
శ్రావణ్‌కుమార్ నల్లా: సంగీత దర్శకుడు చక్రిగారు లేని లోటును పవన్‌శేష భర్తీ చేస్తారు. చాలా లిమిటేషన్స్ మధ్య ఇంత మంచి మ్యూజిక్ ఇచ్చాడు. ముఖ్యంగా రీరికార్డింగ్ చాలా అద్భుతంగా చేశాడు.