Advertisementt

మార్చి 5 న రాంచరణ్, శ్రీనువైట్ల చిత్రం ప్రారంభం

Sun 15th Feb 2015 12:49 PM
ramcharan,srinu vaitla,kona venkat,gopi mohan,rakul preet,d.v.v.danayya,kolavari anirudh  మార్చి 5 న రాంచరణ్, శ్రీనువైట్ల చిత్రం ప్రారంభం
మార్చి 5 న రాంచరణ్, శ్రీనువైట్ల చిత్రం ప్రారంభం
Advertisement
Ads by CJ

మెగాపవర్ స్టార్ 'రాం చరణ్', సూపర్ దర్శకుడు 'శ్రీనువైట్ల' ల పవర్ ఫుల్ కాంబినేషన్... ఎన్నో ఘన విజయవంతమైన చిత్రాలను నిర్మించిన ప్రముఖ నిర్మాత దానయ్య డి.వి.వి. 'డి.వి.వి. ఎంటర్ టైన్ మెంట్స్ '(DVV ENTERTAINMENTS) పతాకంపై నిర్మించనున్న ఈ భారీ ప్రతిష్ఠాత్మక చిత్రం   ప్రారంభం అవుతోంది. ఈ చిత్రంలో మెగాపవర్ స్టార్ 'రాంచరణ్' సరసన నాయికగా 'రకుల్ ప్రీత్ సింగ్' నటిస్తున్నారని నిర్మాత 'దానయ్య డి.వి.వి. తెలిపారు.

'ఫ్యామిలీ ఎంటర్ టైనర్ విత్ యాక్షన్' కధా చిత్రం : దర్శకుడు 'శ్రీనువైట్ల'

మెగాపవర్ స్టార్ 'రాంచరణ్' తో తాను రూపొందిస్తున్న ఈ చిత్రం గురించి దర్శకుడు  'శ్రీనువైట్ల' మాట్లాడుతూ..' 'ఫ్యామిలీ ఎంటర్ టైనర్ విత్ యాక్షన్' కధా చిత్రం  గా ఈ చిత్రానికి రూపకల్పన చేస్తున్నట్లు ఆయన తెలిపారు. భారీ తారాగణం తో పాటు,అత్యున్నత సాకేంతిక విలువలతో ఈ చిత్రం ముస్తాబవుతుందని అన్నారు.

శ్రీనువైట్ల.కోనవెంకట్, గోపీమోహన్ ల విజయాల కాంబినేషన్ : నిర్మాత దానయ్య డి.వి.వి.

ఎన్నో భారీ విజయవంతమైన చిత్రాల కాంబినేషన్ ఈ ముగ్గురిదీ. దర్శకుడు శ్రీనువైట్ల, రచయితలు కోనవెంకట్, గోపీమోహన్ ల విజయాల కాంబినేషన్ ను రిపీట్ చేస్తూ రూపొందుతోందీ చిత్రం. మెగాపవర్ స్టార్ 'రాంచరణ్' తో తాము నిర్మిస్తున్న ఈ చిత్రానికి మూలకధ -స్క్రీన్ ప్లే -దర్సకత్వం' శ్రీనువైట్ల, కధ ను 'కోనవెంకట్, గోపీమోహన్' లు అందిస్తున్నారు. సంభాషణలను 'కోనవెంకట్' సమకూరుస్తున్నారు ఆని నిర్మాత తెలిపారు.

'వై దిస్ కొలవరి'  అనిరుధ్  సంగీతం: కొంతకాలం క్రితం  'వై దిస్ కొలవరి' పాట, ఆపాట కు సమకూర్చిన సంగీతం తెలుగునాట మారు మ్రోగిపోయిన వైనం ఇంకా ఎవరూ మరచిపోలేదు. ఆ పాటకు సంగీతం సమకూర్చిన యువ సంగీత దర్శకుడు 'అనిరుధ్ ' నేడు తమిళనాట క్రేజీ సంగీతదర్శకుడు. ఈ యువ సంగీత దర్శకుడు ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు.

మార్చి 5 న పూజా కార్యక్రమాలు : ఈ చిత్రం గురించి నిర్మాత 'దానయ్య  డి.వి.వి' మాట్లాడుతూ..' మెగాపవర్ స్టార్ 'రాం చరణ్',దర్శకుడు 'శ్రీనువైట్ల' ల పవర్ ఫుల్ కాంబినేషన్లో  'డి.వి.వి. ఎంటర్ టైన్ మెంట్స్ ' పతాకంపై నిర్మించనున్న ఈ తొలి  భారీ ప్రతిష్ఠాత్మక చిత్రం  మార్చి 5 న ప్రారంభం కానుంది అని తెలిపారు.

మార్చి 16 నుంచి  రెగ్యులర్ షూటింగ్ : తమ సంస్థ నుంచి రూపొందుతున్న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ మార్చి 16 నుంచి మొదలవుతుందని నిర్మాత దానయ్య డి.వి.వి. తెలిపారు. ఈ చిత్రానికి సమర్పణ డి. పార్వతి.

అక్టోబర్ 15 న చిత్రం విడుదల: మెగాపవర్ స్టార్ 'రాంచరణ్', నాయిక 'రకుల్ ప్రీత్ సింగ్' లతో పాటు భారీ తారాగణం, అత్యున్నత సాకేంతిక విలువలతో  తమ సంస్థ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ మార్చి 16 నుంచి  ప్రారంభమవుతుంది. అక్టోబర్ 15 న చిత్రం విడుదల అయ్యే దిశగా చిత్ర నిర్మాణ కార్యక్రమాలు చక్కని ప్లానింగ్ తో జరుగుతాయని నిర్మాత దానయ్య డి.వి.వి. తెలిపారు.

ఈ చిత్రానికి కధ: కోనవెంకట్, గోపీమోహన్, మాటలు: కోన వెంకట్, సంగీతం: అనిరుధ్, కెమెరా: మనోజ్ పరమహంస, ఎడిటింగ్: ఎ.ఆర్.వర్మ, ఆర్ట్: నారాయణ రెడ్డి, ఫైట్స్: అనల్ అర్స్. బ్యానర్: డి.వి.వి. ఎంటర్ టైన్ మెంట్స్ (DVV ENTERTAINMENTS), సమర్పణ: డి. పార్వతి, నిర్మాత : దానయ్య డి.వి.వి, మూలకధ,స్క్రీన్ ప్లే,దర్శకత్వం: శ్రీనువైట్ల

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ