Advertisementt

అఖిల్‌ అక్కినేని హీరోగా లాంచ్‌ అయ్యాడు

Sun 15th Feb 2015 11:11 AM
akhil akkineni,akkineni nagarjuna,v.v.vinayak,hero venkatesh,naga chaitanya,k.raghavendra rao,hero nithin  అఖిల్‌ అక్కినేని హీరోగా లాంచ్‌ అయ్యాడు
అఖిల్‌ అక్కినేని హీరోగా లాంచ్‌ అయ్యాడు
Advertisement
Ads by CJ

అఖిల్‌ అక్కినేని హీరోగా వి.వి.వినాయక్‌ దర్శకత్వంలో శ్రేష్ఠ్‌ మూవీస్‌ పతాకంపై హీరో నితిన్‌ ఓ చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలే ఈ చిత్రం ప్రారంభోత్సవం కూడా జరిగింది. ఈ చిత్రం రెగ్యులర్‌ షూటింగ్‌ ఫిబ్రవరి 16 నుంచి రామోజీ ఫిల్మ్‌సిటీలో ఓ ఫైట్‌తో ప్రారంభం కాబోతోంది. కాగా, ఈ చిత్రం ద్వారా హీరోగా పరిచయమవుతున్న అఖిల్‌ను శనివారం హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో పలువురు సినీ ప్రముఖులు, అక్కినేని కుటుంబం సమక్షంలో ప్రేక్షకులకు, అక్కినేని వంశాభిమానులకు పరిచయం చేశారు. ఈ కార్యక్రమంలో కింగ్‌ నాగార్జున, అమల అక్కినేని, విక్టరీ వెంకటేష్‌, దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు, శిరిడిసాయి నిర్మాత మహేష్‌రెడ్డి, నిర్మాత, హీరో నితిన్‌, నిఖితరెడ్డి, హీరోయిన్‌ సయేషా సైగల్‌,  యువసామ్రాట్‌ నాగచైతన్య, శ్రీమతి నాగసుశీల, సుశాంత్‌, ఎస్‌.గోపాలరెడ్డి తదితరులు పాల్గొన్నారు. కె.రాఘవేంద్రరావు హీరోయిన్‌ సయేషా సైగల్‌ను పరిచయం చేశారు. అఖిల్‌ అక్కినేని హీరోగా లాంచ్‌ అవుతున్నట్టు విక్టరీ వెంకటేష్‌ ఎనౌన్స్‌ చేయగా, నాగచైతన్య రిమోట్‌ బటన్‌ను ప్రెస్‌ చేయడం ద్వారా అఖిల్‌ను లాంచ్‌ చేశారు. ఈ సందర్భంగా..

కింగ్‌ నాగార్జున: అఖిల్‌ని పరిచయం చేసే టైమ్‌లో నాన్నగారు కూడా వుంటే బాగుండేది. మనంలో అఖిల్‌ ఇంట్రడ్యూస్‌ కావడానికి నాన్నగారే కారణం. నాన్నగారు ఎక్కువ రోజులు వుండరన్న విషయం మాకు అర్థమై ఆయన ద్వారానే అఖిల్‌ను స్క్రీన్‌ మీదకి పిలిపించాలని అనుకున్నాం. అది నాన్నగారు మాపై పెట్టిన బాధ్యత. మనం ద్వారా అఖిల్‌ను నాన్నగారు బ్లెస్‌ చేశారు. వినాయక్‌గారు ఈ సినిమా కోసం ఆరు నెలలుగా ఎంత తపన పడుతున్నారో నాకు తెలుసు. ఆడియో రిలీజ్‌కి, సినిమా రిలీజ్‌కి మాట్లాడతాను. 

కె.రాఘవేంద్రరావు: అక్కినేని నాగార్జున ఫస్ట్‌ మూవీని మా గురువుగారు మధుసూదనరావుగారు డైరెక్ట్‌ చేశారు. ఆ సినిమాకి నేను క్లాప్‌ క్లాప్‌ కొట్టాను. ఆ తర్వాత నాగార్జున ఎన్నో మంచి చిత్రాలు చేసి పేరు తెచ్చుకున్నారు. వి అంటే విక్టరీ. సాధారణంగా ఒక విక్టరీ ఉంటే చాలు అలాంటిది మూడు ‘వి’లు వున్న వినాయక్‌ డైరెక్షన్‌లో అఖిల్‌ సినిమా చేస్తున్నాడు. ఆల్‌ ది బెస్ట్‌ అఖిల్‌.

విక్టరీ వెంకటేష్‌: అక్కినేని అభిమానులకు పండగే పండగ. ఈరోజు నేను మనస్ఫూర్తిగా చాలా హ్యపీగా ఉన్నాను. అఖిల్‌ చిన్నప్పట్నుంచి తెలుసు. వండర్‌ఫుల్‌ బోయ్‌, హంబుల్‌. తను తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి రియల్‌ ఆల్‌రౌండర్‌ అవుతాడు. ఈరోజు వినాయక్‌ డైరెక్షన్‌లో నితిన్‌, సుధాకర్‌రెడ్డిల ప్రొడక్షన్‌లో సినిమా చేస్తున్నాడు. నితిన్‌ ఆల్రెడి ప్రామిస్‌ చేశాడు. తను కచ్చితంగా సూపర్‌హిట్‌ సినిమా చేయాల్సిందే. 

వి.వి.వినాయక్‌: మనం సినిమాలో అఖిల్‌ను చూడగానే అందరూ ఎలా షాక్‌ అయ్యారో నేనూ అలాగే షాక్‌ అయ్యాను. నాపై నమ్మకంతో ఈ బాధ్యతను నాకు అప్పగించిన నాగార్జునగారికి, సుధాకర్‌రెడ్డిగారికి, హీరో అఖిల్‌ సహా అందరికీ ఈ సినిమా సూపర్‌డూపర్‌ హిట్టవుతుందని ప్రామిస్‌ చేస్తున్నాను. మంచి లవ్‌స్టోరీతో, మంచి కథతో సినిమా కొత్తగా ఉంటుంది. నాగచైతన్య చెప్పినట్లు అఖిల్‌ ప్రతి సినిమా గోయర్‌కి నచ్చుతాడు. 

అక్కినేని అమల: నాగార్జున ఫ్యాన్‌గా అక్కినేని కుటుంబంలో జాయిన్‌ అయ్యాను. మా అబ్బాయిని మీ చేతుల్లో పెడుతున్నాను. అందరూ జాగ్రత్తగా చూసుకుంటారని భావిస్తున్నాను. 

నాగచైతన్య:  ఈరోజు కోసం నేను ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నాను. అఖిల్‌  ఏ విషయంలోనైనా దృష్టి పెట్టాడంటే పూర్తిగా ఇన్‌వాల్వ్‌ అయి డేడికేటెడ్‌గా చేస్తాడు. అది నేను చాలా కాన్ఫిడెంట్‌గా చెప్పగలను. అఖిల్‌ సినిమా 50 డేస్‌, 100 డేస్‌ మాత్రమే కాదు. ప్రతి సినిమా ఒక ట్రెండ్‌ సెట్టర్‌ అవుతుంది. ప్రతి సినిమా ఒక యూనిక్‌ అవుతుంది. వినాయక్‌గారి సినిమాలు ఎలా ఉంటాయో మనకు తెలిసిందే. ఈ బాధ్యత తీసుకున్నందుకు ఆయనకి థాంక్స్‌. 

హీరో నితిన్‌: ఇంత పెద్ద సినిమాకి, ఇంత పెద్ద ప్రెస్టీజియస్‌ మూవీకి నిర్మాతను కావడానికి కారణం అక్కినేని నాగార్జునగారు, తర్వాత అఖిల్‌, ఆ తర్వాత వినాయక్‌గారు. ఎందుకంటే అఖిల్‌ తొలి సినిమా అనగానే అభిమానుల్లో ఎంత హైప్‌ ఉంటుందో అందరికీ తెలిసిందే. అఖిల్‌తో ఫస్ట్‌ మూవీ చేస్తామని చాలా మంది అడిగారు. కానీ, నాగార్జునగారు ఎంతో నమ్మకంతో ఈ సినిమాని మా శ్రేష్ఠ్‌మూవీస్‌ బ్యానర్‌లో చేయడానికి అంగీకరించారు. మీరెవ్వరూ ఉహించని రేంజ్‌లో ఈ సినిమా ఉంటుంది. అక్కినేని అభిమానులు గర్వపడేలా సినిమాలు ఉంటుంది.  

హీరోయిన్‌ సయేషా సైగల్‌: నా తొలి సినిమా వినాయక్‌గారి డైరెక్షన్‌లో చేస్తున్నందుకు హ్యాపీగా వుంది. నితిన్‌, నిఖితా, సుధాకర్‌రెడ్డిగారికి థాంక్స్‌. అఖిల్‌ పక్కన నటిస్తున్నందుకు చాలా ఎక్సైట్‌ అవుతున్నాను. 

మహేష్‌రెడ్డి: నిన్నే నేను, నాగార్జున ఫ్యామిలీతో కలిసి షిరిడీ వెళ్లి అఖిల్‌కి ఆశీర్వాదం తీసుకున్నాం. ఈ సినిమా ద్వారా హీరోగా పరిచయం అవుతున్న అఖిల్‌ తప్పకుండా పెద్ద హీరో అవుతాడు.  

అఖిల్‌ అక్కినేని: నాకు ఏం మాట్లాడాలో అర్థం కావడంలేదు. మొదట మా అమ్మ, నాన్నగారికి థాంక్స్‌ చెప్పుకోవాలి. మంచి హ్యూమన్‌ బీయింగ్‌గా వుండాలని, సొసైటీకి ఏదో ఒకటి చెయ్యాలని అమ్మ ఎప్పుడూ చెబుతూ వుంటారు. అమ్మ నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. నాన్నగారు అభిమానుల గురించి ఎప్పుడూ చెప్తుంటారు. ఒక లెగసీ క్యారీ చేయడమంటే అంత ఈజీ కాదని, లైట్‌ తీసుకోవద్దని నాన్నగారు చెప్పారు. ఆ విషయం మిమ్మల్ని చూసినపుడు నాకు తెలుస్తుంది. ఈ రోజు నాకు స్పెషల్‌ డే. అన్నయ్య చైతు మాట్లాడుతుంటే నేను ఎమోషనల్‌ అయిపోయాను. మేమిద్దరం కలిసి పెద్ద మల్టీస్టారర్‌ చేసి సూపర్‌హిట్‌ ఇస్తామని ఈరోజు మీకు ప్రామిస్‌  చేస్తున్నాం. అలాగే మా వెంకీ మామకి థాంక్స్‌. తనతో ఐదు నిమిషాలు ఉంటే చాలు తనని ప్రేమిస్తారు. గుడ్‌ హ్యుమన్‌ బీయింగ్‌. తను ఇక్కడికి రావడం చాలా హ్యపీగా ఉంది. వి.వి.వినాయక్‌గారు నేను చీకట్లో ఉన్నప్పుడు నాకు సెర్చ్‌ లైట్‌లా కనపడ్డారు. ఎందుకంటే ఫ్యాన్స్‌కి ఒక బ్లాక్‌బస్టర్‌తో వస్తానని ప్రామిస్‌ చేశాను. ఆ బ్లాక్‌బస్టర్‌ ఎలా ఇవ్వాలో తెలియలేదు. ఇంత పెద్ద భారీ లాంఛ్‌ కేవలం వి.వి.వినాయక్‌గారి వల్లనే అవుతుంది. నా బ్రదర్‌, బెస్ట్‌ ఫ్రెండ్‌ నితిన్‌ నా సినిమాకి ప్రొడ్యూసర్‌ అవుతాడని కలలో కూడా అనుకోలేదు. నితిన్‌కి, సుధాకర్‌రెడ్డిగారికి, నా అక్కయ్య నిఖితకి థాంక్స్‌. నన్ను ఫ్యామిలీ మెంబర్‌లా చూసుకుంటున్నారు. ఈ సినిమాకి పనిచేస్తున్న ప్రతి టెక్నిషియన్‌కి థాంక్స్‌. నేను ఏ సినిమా చేసినా అభిమాన దేవుళ్ల కోసమేనని ప్రామిస్‌ చేస్తున్నాను.  

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ