సుధీర్‌బాబు, నందిత, చైతన్యకృష్ణ, అభిజీత్ ప్రధాన పాత్రల్లో ఎల్.వి.రామానాయుడు సమర్పణలో రామలక్ష్మీ సినీ క్రియేషన్స్ పతాకంపై ఆర్.చంద్రు దర్శకత్వంలో లగడపాటి శిరీష`శ్రీధర్ నిర్మిస్తున్న లవ్ ఎంటర్‌టైనర్ ‘కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ’. ఈ చిత్రానికి సంబంధించిన ఓ మెలోడియస్ ప్రేమ గీతాన్ని ఫిబ్రవరి 14న వాలెంటైన్స్ డే సందర్భంగా హైదరాబాద్‌లోని సుజన షాపింగ్ మాల్‌లో ప్రేక్షకుల మధ్య రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో సుధీర్‌బాబు, నందిత, చైతన్యకృష్ణ, అభిజీత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా..
సుధీర్‌బాబు: నేను, నందిత కలిసి నటించిన ప్రేమకథా చిత్రమ్ ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే. మళ్ళీ మా కాంబినేషన్‌లో వస్తున్న సినిమా ఇది. ప్రేమకథా చిత్రమ్‌లో అందర్నీ భయపెట్టిన నందిత ఈ సినిమాలో అందర్నీ నవ్విస్తుంది. మన రెండు రాష్ట్రాల్ని కృష్ణమ్మ ఎలా అయితే కలుపుతుందో ఈ సినిమాలో మా ఇద్దరినీ అలా కలుపుతుంది. ప్రేమకథా చిత్రమ్‌లో నందిత దగ్గరికి వెళ్తే చచ్చిపోతాననిపిస్తుంది. ఈ సినిమాలో దూరమైతే చచ్చిపోతాననిపిస్తుంది. మార్చి 6న ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అందరూ థియేటర్స్‌కి వచ్చి చూసి ఎంజాయ్ చెయ్యండి.
నందిత: అందర్నీ అలరించే మంచి చిత్రమిది. ఫ్యామిలీతో కలిసి చూసి ఎంజాయ్ చేసేలా వుంటుంది సినిమా. ఆడియో ఆల్రెడీ చాలా పెద్ద హిట్ అయింది. సినిమా అంతకంటే పెద్ద హిట్ అవుతుంది. వాలెంటైన్స్ డే సందర్భంగా ప్రేక్షకుల సమక్షంలో ఈ పాట విడుదల చేయడం చాలా హ్యాపీగా వుంది.
చైతన్యకృష్ణ: అందరికీ నచ్చే మంచి కథతో ఈ చిత్రాన్ని రూపొందించారు. చంద్రు చాలా అద్భుతంగా ఈ సినిమా తీశారు. పాటలు వినడానికి బాగుంటాయి. సినిమాలో విజువల్‌గా ఇంకా చాలా బాగుంటాయి.
అభిజీత్: ఈ చిత్రంలో ఒక మంచి క్యారెక్టర్ చేశాను. ఈ సినిమా అందరికీ చాలా మంచి పేరు తెస్తుంది. పాటల్లాగే సినిమా కూడా పెద్ద హిట్ అవుతుందన్న నమ్మకం మాకు వుంది.