‘ఈగ’ చిత్రంలో సక్సెస్ ఫుల్ నిర్మాతగా క్రెడిట్ సంపాదించి ‘అందాల రాక్షసి’ చిత్రంతో ఉత్తమాభిరుచిగల నిర్మాతగా మంచి గుర్తింపు సంపాదించారు వారాహి చలన చిత్రం నిర్మాణ సంస్థ అధినేత సాయికొర్రపాటి. గతేడాది నటసింహ నందమూరి బాలకృష్ణ ‘లెజెండ్’ చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన ఈ మోస్ట్ సక్సెస్‌ఫుల్ ప్రొడ్యూసర్ ఆఫ్ టాలీవుడ్ తర్వాత ‘ఉహలు గుసగసలాడే’, ‘దిక్కులు చూడకు రామయ్య’ చిత్రాలతో హ్యట్రిక్ విజయాలను సాధించి స్టార్ ప్రొడ్యూసర్ అయ్యారు. అంతే కాకుండా ఒక వైపు భారీ చిత్రాలు, మరోవైపు మినిమమ్ బడ్జెట్ చిత్రాలు నిర్మిస్తూ టేస్ట్ ఫుల్ ప్రొడ్యూసర్ గా నిలిచారు. తాజాగా వారాహి చలన చిత్రం బ్యానర్ పై సాయి శివాని సమర్పణలో సాయికొర్రపాటి ప్రొడక్షన్‌పై రజని కొర్రపాటి నిర్మిస్తోన్న చిత్రం 'తుంగభద్ర'. శ్రీనివాసకృష్ణ గోగినేని దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఆదిత్, డింపుల్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. విలేజ్ బ్యాక్ డ్రాప్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ చిత్రానికి హరి గౌర సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ ఫిబ్రవరి 17న హైదరాబాద్ లోని అన్నపూర్ణ సెవన్ ఏకర్స్ లో సినీ ప్రముఖుల సమక్షంలో అత్యంత వైభవంగా ఈ చిత్రం ఆడియో విడుదల చేయనున్నారు. ఈ కార్యక్రమంలో సినీ పరిశ్ర్రమకి చెందిన పలువురు ప్రముఖులు పాలుపంచుకోనున్నారు.
ఆదిత్, డింపుల్ చోపడే హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో కోటశ్రీనివాసరావు, సత్యరాజ్, చలపతిరావు, సప్తగిరి, కోటశంకరరావు, పవిత్రా లోకేష్, రాజేశ్వరి నాయర్, ధనరాజ్, నవీన్ నేని, రవివర్మ, జబర్ దస్త్ శ్రీను, చరణ్, శశాంక్, కల్పలత, శ్రీనివాస్ ఇతర తారాగణంగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి సాహిత్యం: సాహితి, రామజోగయ్య శాస్త్రి, చైతన్య ప్రసాద్, రాధా సుబ్రహ్మణ్యం, గణేష్ సలాది, పైట్స్: నందు, డ్రాగన్ ప్రకాష్, సాల్మన్ రాజ్, పి.ఆర్.ఓ: వంశీ-శేఖర్, పబ్లిసిటీ డిజైనర్: ధని ఏలే,
ఆర్ట్: హరివర్మ, కొరియోగ్రఫీ: శంకర్, ఎడిటింగ్: తమ్మిరాజు, సంగీతం: హరి గౌర, సినిమాటోగ్రఫీ: రాహుల్ శ్రీవాత్సవ్, కో ప్రొడక్షన్: సిల్లి మాంక్స్, నిర్మాత: రజని కొర్రపాటి, రచన-దర్శకత్వం: శ్రీనివాసకృష్ణ గోగినేని.