Advertisementt

మారుతి ఆవిష్కరించిన ‘యస్‌’ టీజర్‌

Sat 14th Feb 2015 05:15 AM
yes movie,telugu movie yes,yes teaser launch,director maruthi,shreyas media  మారుతి ఆవిష్కరించిన ‘యస్‌’ టీజర్‌
మారుతి ఆవిష్కరించిన ‘యస్‌’ టీజర్‌
Advertisement
Ads by CJ

అభిరామ్‌, శృతిరాజ్‌లను హీరోహీరోయిన్లుగా పరిచయం చేస్తూ దేవాస్‌ మీడియా అండ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రై. లిమిటెడ్‌, శ్రేయాస్‌ మీడియా పతాకాలపై రజిని తనయ్‌ని దర్శకుడుగా పరిచయం చేస్తూ శ్యామ్‌ దేవభక్తుని, జి.శ్రీనివాసరావు సంయుక్తంగా నిర్మిస్తున్న ప్రేమకథా చిత్రం ‘యస్‌’(అందమైన ప్రేమకథ). ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌ను వాలెంటైన్స్‌ డే సందర్భంగా ఫిబ్రవరి 14న హైదరాబాద్‌లోని సినీమాక్స్‌లో విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ప్రముఖ దర్శకుడు మారుతి ‘యస్‌’ టీజర్‌ను విడుదల చేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో హీరో అభిరామ్‌, సంధ్య మోషన్‌ పిక్చర్స్‌ రవి, దర్శకుడు రజిని తనయ్‌, నిర్మాతలు శ్యామ్‌ దేవభక్తుని, జి.శ్రీనివాసరావు, లైన్‌ ప్రొడ్యూసర్‌ ఎస్‌.కె.ఎన్‌., సంగీత దర్శకుడు ఇంద్రగంటి శ్రీనివాస్‌, సినిమాటోగ్రాఫర్‌ గొట్టిపాటి హరీష్‌ తదితరులు పాల్గొన్నారు.

శ్యామ్‌ దేవభక్తుని: ఇది కూల్‌ లవ్‌స్టోరీ. అంతా ఫ్రెష్‌ టీమ్‌తో చేశాం. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని త్వరలో రిలీజ్‌ కాబోతోంది. ఈ చిత్రాన్ని తప్పకుండా ప్రేక్షకులు ఆదరిస్తారన్న నమ్మకం నాకు వుంది.

రజిని తనయ్‌: దర్శకుడుగా నాకు తొలి అవకాశం ఇచ్చిన శ్రీనివాస్‌గారికి, శ్యామ్‌గారికి ధన్యవాదాలు. కథ విన్న 10 నిముషాల్లో శ్రీనివాస్‌గారు ఈ ప్రాజెక్ట్‌ని ఫైనల్‌ చేశారు. ఇందులో నటించిన నటీనటులు, పనిచేసిన సాంకేతిక నిపుణులు సినిమా బాగా రావడం కోసం ఎంతో కృషి చేశారు. తప్పకుండా మీ అందరికీ ఈ సినిమా నచ్చుతుందని భావిస్తున్నాను.

మారుతి: ఒక ఫ్రెష్‌ థాట్‌తో తీసిన సినిమా ఇది. ఇలాంటి సినిమాల్ని ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారు. ఈ సినిమా పెద్ద హిట్‌ కావాలని, యూనిట్‌లోని అందరికీ మంచి పేరు రావాలని కోరుకుంటున్నాను.

రవి: శ్రీనివాస్‌గారు ఏ ప్రోగ్రామ్‌ అయినా చాలా ఇన్నోవేటివ్‌గా చేస్తారు. వాలెంటైన్స్‌ డే సందర్భంగా ఈ చిత్రంలోని సాంగ్‌ టీజర్‌ను రిలీజ్‌ చేయడం బాగుంది. ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్‌ ప్రొడక్షన్‌ అంతా మా స్టూడియోలోనే జరిగింది. డైరెక్టర్‌ వాల్యూ వున్న సినిమా ఇది. 100 పర్సెంట్‌ ఈ సినిమా పెద్ద హిట్‌ అవుతుందని నా నమ్మకం. 

ఇంద్రగంటి శ్రీనివాస్‌: మ్యూజిక్‌ డైరెక్టర్‌గా ఇది నా తొలి సినిమా. ఈ అవకాశం ఇచ్చిన శ్యామ్‌గారిని, శ్రీనివాస్‌గారిని జీవితాంతం మర్చిపోను. దర్శకనిర్మాతలు నాకు మంచి ఫ్రీడమ్‌ ఇచ్చారు. అందుకే మంచి మెలోడియస్‌ సాంగ్స్‌ని చేసే వీలు కలిగింది. ఇది ఒక వండర్‌ఫుల్‌ మ్యూజికల్‌ ఎమోషనల్‌ గుడ్‌ లవ్‌స్టోరీ.

గొట్టిపాటి హరీష్‌: అందరం కొత్తవాళ్ళం. ఎంతో జాగ్రత్తగా ఈ సినిమా చేశాం. మంచి సినిమాటోగ్రఫీ ఇవ్వడానికి యూనిట్‌లోని అందరూ ఎంతో సపోర్ట్‌ చేశారు.

అభిరామ్‌: నన్ను ఎంకరేజ్‌ చేస్తున్న దర్శకనిర్మాతలకు ముందుగా నా కృతజ్ఞతలు. నన్ను నమ్మి ఈ సినిమాని ప్రొడ్యూస్‌ చేస్తున్నారు. టీమ్‌లోని ప్రతి ఒక్కరూ ఎంతో కష్టపడి ఈ సినిమా చేశారు. తప్పకుండా ఈ సినిమా పెద్ద హిట్‌ అవుతుందని ఆశిస్తున్నాను. 

అభిరామ్‌, శృతిరాజ్‌, ఈరోజుల్లో సాయి, పృథ్వి, సూర్య, చిత్రం శ్రీను, రచ్చ రవి, పొట్టి రమేష్‌, రాఘవ, ఫిష్‌ వెంకట్‌ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈచిత్రానికి సంగీతం: ఇంద్రగంటి, సినిమాటోగ్రఫీ: గొట్టిపాటి హరీష్‌, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: సంపత్‌కుమార్‌, లైన్‌ ప్రొడ్యూసర్‌: సురేష్‌కుమార్‌, ఎడిటింగ్‌: నందమూరి రామ్‌, నిర్మాతలు: శామ్‌ దేవభక్తుని, శ్రీనివాసరావు, దర్శకత్వం: రజిని తనయ్‌.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ