యంగ్ హీరో హవీష్ కథానాయకుడిగా కోనేరు సత్యనారాయణ సమర్పణలో, లంకాల బుచ్చిరెడ్డి సారధ్యంలో రామదూత క్రియేషన్స్ పతాకంపై శ్రీపురం కిరణ్‌ను దర్శకుడుగా పరిచయం చేస్తూ దాసరి కిరణ్‌కుమార్ నిర్మిస్తున్న చిత్రం ‘రామ్‌లీల’. ఈ చిత్రానికి సంబంధించి ఇటీవల విడుదలైన ఆడియోకు ట్రెమండస్ రెస్పాన్స్ వస్తోంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 27న వరల్డ్‌వైడ్‌గా రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రంలో హీరోగా నటించిన హవీష్‌పై సినిమా రిలీజ్‌కి ముందే ప్రశంసలు వెల్తువెత్తుతున్నాయి. ఒక కొత్త లుక్‌తో, మెచ్యూర్డ్ పెర్‌ఫార్మెన్స్‌తో ట్రైలర్స్‌లో అందర్నీ ఆకట్టుకుంటున్న హవీష్‌కి అటు ఇండస్ట్రీ నుంచి, ఇటు ప్రేక్షకుల నుంచి మంచి అప్రిషియేషన్ వస్తోంది. ఈ చిత్రంలోని పాటలకు, ట్రైలర్స్‌కు, ముఖ్యంగా హవీష్ పెర్‌ఫార్మెన్స్‌కి వస్తోన్న రెస్పాన్స్‌పై నిర్మాత దాసరి కిరణ్‌కుమార్ స్పందిస్తూ...
‘‘మా జీనియస్ చిత్రంతో నిజంగానే జీనియస్ అనిపించుకున్న హవీష్ ఈ చిత్రం ద్వారా తనలోని కొత్త యాంగిల్‌ని ఆడియన్స్‌కి పరిచయం చెయ్యబోతున్నాడు. ఇటీవల విడుదలైన పాటలకు ఆడియన్స్ నుంచి చాలా మంచి రెస్పాన్స్ వస్తోంది. ముఖ్యంగా థియేటర్ ట్రైలర్‌కి వస్తున్న రెస్పాన్స్ సూపర్బ్ అని చెప్పాలి. ఈ సినిమాతో హవీష్ హీరోగా చాలా పెద్ద రేంజ్‌కి వెళ్తాడని నా నమ్మకం. ఇప్పటివరకు సినిమా చూసిన వారంతా హవీష్ పెర్‌ఫార్మెన్స్‌గానీ, ఫైట్స్‌గానీ, డైలాగ్స్‌గానీ అన్నీ చాలా పర్‌ఫెక్ట్‌గా చేశాడని, ఇప్పుడున్న యంగ్ హీరోలకు హవీష్ గట్టిపోటీ ఇస్తాడని చాలా కాన్ఫిడెంట్‌గా చెప్తున్నారు. ఎప్పటికప్పుడు తనని తాను కొత్తగా ప్రజెంట్ చేసుకోవాలని తపన పడే హవీష్ ‘రామ్‌లీల’ చిత్రంలో చాలా డిఫరెంట్ లుక్‌తో కనిపించబోతున్నాడు. ఈ చిత్రంలోని పాటలు, హవీష్ డాన్స్, ఈ చిత్రం కాన్సెప్ట్, టెక్నికల్‌గా హై స్టాండర్డ్స్‌లో వున్న టేకింగ్, అన్ కాంప్రమైజ్డ్ మేకింగ్.. ఇప్పుడు ఇవన్నీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి. ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 27న రిలీజ్ కాబోతోంది. ఆడియో రిలీజ్ అయిన రోజు నుంచి రోజురోజుకీ ఈ చిత్రం మీద ఇండస్ట్రీలో, ప్రేక్షకుల్లో ఎక్స్‌పెక్టేషన్స్ పెరిగిపోతున్నాయి. మా ప్రతి సినిమాకి పబ్లిసిటీ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటాం. ఈ సినిమాని కూడా చాలా పెద్ద రేంజ్‌లోనే ప్రమోట్ చేస్తున్నాం. అయితే సినిమా గురించి మేం చెప్పేదానికంటే ట్రైలర్స్‌లో హవీష్ పెర్‌ఫార్మెన్స్‌ని చూసి చాలా కొత్తగా వున్నాడని, నవరసాల్ని అద్భుతంగా పండిస్తున్నాడని ఆడియన్స్ చెప్తున్నారు. ‘రామ్‌లీల’ చిత్రం తర్వాత మాస్ హీరోగా, కమర్షియల్ హీరోగా హవీష్ చాలా మంచి పేరు తెచ్చుకుంటాడు’’ అన్నారు.
హవీష్, అభిజీత్, నందిత, అక్ష, మదాలస శర్మ, ఆలీ, సప్తగిరి, భానుచందర్, నాగినీడు, కృష్ణుడు, శివన్నారాయణ, అనితాచౌదరి, వైవా హర్ష, జయవాణి, గుండు సుదర్శన్, ఇంద్ర తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: చిన్నా, మాటలు: విస్సు, ఎడిటింగ్: కార్తీక శ్రీనివాస్, కెమెరా: ఎస్.గోపాలరెడ్డి, సహనిర్మాత: ముత్యాల రమేష్, నిర్మాత: దాసరి కిరణ్‌కుమార్, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: శ్రీపురం కిరణ్.