Advertisementt

చక్రి కుటుంబంలో కొనసాగుతున్న ఆరోపణల పర్వం..!

Wed 11th Feb 2015 08:46 AM
chakri wife sravani,studio,mahith,police complaint  చక్రి కుటుంబంలో కొనసాగుతున్న ఆరోపణల పర్వం..!
చక్రి కుటుంబంలో కొనసాగుతున్న ఆరోపణల పర్వం..!
Advertisement
Ads by CJ

చక్రి భార్యకు ఆయన కుటుంబీకుల మధ్య పరస్పర ఆరోపణలు కొనసాగుతూనే ఉన్నాయి. చక్రికి సంబంధించిన ఆస్తుల పంపకాల గురించే వారి మధ్య గొడవలు రచ్చకెక్కుతున్న సంగతి తెలిసిందే. తాజాగా మంగళవారం చక్రి భార్య శ్రావణి ఆయన స్టూడియోలోని సామన్లను తీసుకెళ్లింది. దీనిపై చక్రి సోదరుడు మహిత్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దొంగలా వచ్చి ఎవరికీ చెప్పకుండా శ్రావణి సామన్లను తీసుకెళ్లిందని ఆరోపించాడు. అంతేకాకుండా ఈ విషయానికి సంబంధించి శ్రావణిపై చర్యలు తీసుకోవాలని ఏకంగా హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డిని కలిసి విజ్ఞప్తి చేశాడు. మరోవైపు ఈ విషయంపై శ్రావణి స్పందిస్తూ.. ఆ స్టూడియో సామగ్రి చక్రి సంపాదించేనని, తన భర్త సొత్తును తాను తీసుకెళ్లానని చెప్పింది. అంతేకాకుండా తాను దొంగలా వచ్చి సామన్లను తీసుకెళ్లలేదని, పట్టపగలు అందరు చూస్తుండగానే తీసుకెళ్లానని కూడా చెప్పింది. ఇక ఈ ఇరువర్గాల మధ్య రాజీ కుదిర్చే పనిలో కొందరు సినీ పెద్దలు ఉన్నట్లు సమాచారం.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ