Advertisementt

14 రీల్స్‌ కాస్టింగ్‌ కాల్‌

Wed 11th Feb 2015 03:28 AM
14 reels movie,hero nani,hanu raghavapudi  14 రీల్స్‌ కాస్టింగ్‌ కాల్‌
14 రీల్స్‌ కాస్టింగ్‌ కాల్‌
Advertisement
Ads by CJ

14 రీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రై. లిమిటెడ్‌ పతాకంపై దూకుడు, 1 నేనొక్కిడినే, లెజెండ్‌, ఆగడు వంటి భారీ చిత్రాల్ని నిర్మించిన రామ్‌ ఆచంట, గోపీచంద్‌ ఆచంల, అనీల్‌ సుంకర లేటెస్ట్‌గా యంగ్‌ హీరో నాని హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో ఓ విభిన్న చిత్రాన్ని నిర్మిస్తున్నారు.  ఈ చిత్రంలో నానితోపాటు చిచ్చర పిడుగుల్లాంటి ముగ్గురు నూతన బాలనటీనటులకు అవకాశం కల్పించబోతున్నారు 14 రీల్స్‌ అధినేతలు. 3 నుంచి 4 సంవత్సరాల మధ్య వయసు వున్న పాప, 6 నుంచి 8 సంవత్సరాల మధ్య వయసు వున్న బాబు,  8 నుంచి 11 సంవత్సరాల మధ్య వయసు వున్న పాప కోసం ఎదురుచూస్తున్నారు. అల్లరిలో నెం.1 అనిపించుకునే పిల్లలు ఈ చిత్రంలో నటించేందుకు అర్హులుగా పరిగణిస్తారు. ఈ పిల్లలకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను casting@14reels.netకి ఫిబ్రవరి 20లోగా పంపించవలసిందిగా కోరుతున్నారు 14 రీల్స్‌ అధినేతలు.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ