ప్రముఖ విద్యావేత్త భీమగాని సుధాకర్‌గౌడ్ స్వీయ దర్శకత్వంలో శ్రీలక్ష్మీ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ సమర్పణలో సంతోష్ ఫిలింస్ పతాకంపై నిర్మిస్తున్న మెసేజ్ ఓరియంటెడ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘ఆదిత్య’(క్రియేటివ్ జీనియస్). ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ లాంచ్ మంగళవారం హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన డా॥ బ్రహ్మానందం ట్రైలర్‌ను విడుదల చేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే సి.హెచ్.రామచంద్రారెడ్డి, ఒయాసిస్ స్కూల్ కరస్పాండెంట్ ఎం.బి.ఆచారి, వందేమాతరం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా..
బ్రహ్మానందం: సుధాకర్ నాకు చాలా కావాల్సిన వ్యక్తి. మా అబ్బాయి వాళ్ళ కాలేజీలోనే ఎగ్జామ్ రాశారు. 10 సంవత్సరాలుగా ఆయనతో నాకు పరిచయం వుంది. ఒక మెసేజ్ ఓరియంటెడ్ మూవీ చేస్తున్నాను మీరు ఒక వేషం వెయ్యాలి అని అడిగారు. నేను కూడా వెంటనే ఓకే చెప్పాను. ఇందులో నేను ఒక ఫాల్స్ ప్రొఫెసర్‌గా నటించాను. టాలెంట్ వున్న విద్యార్ధి ఒక ప్రొఫెసర్ వల్ల ఎలాంటి ఇబ్బందులు పడ్డాడు అనేది ఈ సినిమా కథాంశం. విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఒక మంచి చిత్రాన్ని నిర్మించిన సుధాకర్‌ని అభినందించాల్సిన అవసరం ఎంతైనా వుంది. ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్ నుంచి వచ్చి వారి సమస్యపైనే ఒక మంచి సినిమాను నిర్మించారు సుధాకర్. ఇందులో నేను అందమైన హాస్యాన్ని పండిరచే మంచి క్యారెక్టర్ చేశాను. ఇలాంటి సినిమాలను ప్రోత్సహిస్తే భవిష్యత్తులో ఇంకా మంచి సినిమాలు వస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ చిత్రాన్ని చూసి విజయవంతం చేస్తారని ఆశిస్తున్నాను.
సి.హెచ్.రామచంద్రారెడ్డి: పిల్లలందరికీ మేధా సంపత్తి వుంది. కానీ, చుట్టూ వున్న పరిస్థితుల వల్ల వారి మేధాశక్తి కుంచించుకుపోతోంది. పిల్లలకు మాత్రమే కాదు అందరికీ ఉపయోగపడే ఈ సినిమా ఒక ఆదర్శవంతమైన సినిమా కావాలని, ఈ సినిమా మరెందరికో స్ఫూర్తినివ్వాలని కోరుకుంటున్నాను.
వందేమాతరం శ్రీనివాస్: సుధాకర్‌గారు ఈ సినిమా కోసం చాలా తపన పడ్డారు. ఇంటర్నెట్ వల్ల ఇప్పటి పిల్లలు ఎలా చెడు దోవ పడుతున్నారు అనే చక్కని కథాంశాన్ని తీసుకొని ఈ చిత్రాన్ని నిర్మించారు. తనే కథ రాసుకుని, డైరెక్షన్ చేస్తూ ఈ చిత్రాన్ని నిర్మించారు. తప్పకుండా సుధాకర్‌గారు ఈ సినిమాతో తను అనుకున్నది సాధిస్తారు. ఈ చిత్రానికి రీ`రికార్డింగ్ చేసే అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చారు. ఇలాంటి సినిమాలకు అవార్డులు ఇస్తే ఎంతో ఎంకరేజ్‌మెంట్‌గా వుంటుంది. దీన్ని ప్రభుత్వం కూడా గుర్తించాలని కోరుతున్నాను.
భీమగాని సుధాకర్‌గౌడ్: ఈ సినిమా తియ్యడంలో నన్ను ప్రతిరోజూ గైడ్ చేస్తూ నాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇచ్చారు వందేమాతరం శ్రీనివాస్‌గారు. మంచి సందేశంతో పాటు ఎంటర్‌టైన్‌మెంట్‌ని కూడా మిక్స్ చేసిన ఈ సినిమా ప్రతి ఒక్కరినీ ఎంటర్‌టైన్ చేస్తుంది. అదే సమయంలో అందర్నీ ఆలోచింపజేస్తుంది. ఈ చిత్రంలో ఎంతో మంది ప్రముఖ నటీనటులు నటించారు. అలాగే టెక్నీషియన్స్ కూడా మంచి సపోర్ట్ ఇచ్చారు. ఈ సందర్భంగా వారందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సెన్సార్ కూడా పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని ఈనెలాఖరులో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాము.
ఈ చిత్రానికి కెమెరా: కంతేటి శంకర్, ఎడిటింగ్: నందమూరి హరి, రీ`రికార్డింగ్: వందేమాతరం శ్రీనివాస్, డాన్స్: శివశంకర్, స్వర్ణ, రమణ, సాహిత్యం, సంగీతం: బండారు దానయ్యకవి, కథ,మాటలు,స్క్రీన్‌ప్లే,నిర్మాత,దర్శకత్వం: భీమగాని సుధాకర్‌గౌడ్