Advertisementt

‘టెంపర్‌’ థియేటర్‌లో ‘టైగర్‌’

Mon 09th Feb 2015 09:09 AM
temper movie,sandeep kishan,tiger movie,ntr,puri jagannath,thaman,v.i.anand  ‘టెంపర్‌’ థియేటర్‌లో ‘టైగర్‌’
‘టెంపర్‌’ థియేటర్‌లో ‘టైగర్‌’
Advertisement
Ads by CJ

సందీప్‌ కిషన్‌ హీరోగా, సీరత్‌కపూర్‌ హీరోయిన్‌గా ఎ.ఆర్‌.మురుగదాస్‌ శిష్యుడు వి.ఐ.ఆనంద్‌ దర్శకత్వంలో ఎన్‌.వి.ప్రసాద్‌, ఠాగూర్‌ మధు నిర్మిస్తున్న యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘టైగర్‌’. ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌ను జనవరి 14న ‘ఐ’ చిత్రంతోపాటు థియేటర్‌లో విడుదల చేశారు. ఇప్పుడు ఈ చిత్రం ట్రైలర్‌ను ఎన్టీఆర్‌ హీరోగా పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో రూపొందిన ‘టెంపర్‌’ చిత్రంతోపాటు ప్రదర్శించనున్నారు. ఈ వారంలో రిలీజ్‌ కానున్న ‘టెంపర్‌’ చిత్రం ప్రదర్శించే అన్ని థియేటర్స్‌లో ‘టైగర్‌’ ట్రైలర్‌ను చూడవచ్చు. 

త్వరలో విడుదల కానున్న ఈ చిత్రంలో రాహుల్‌ రవీంద్ర, సప్తగిరి, సుప్రీత్‌, తనికెళ్ళ భరణి, పృథ్విరాజ్‌, ప్రవీణ్‌, కాశీ విశ్వనాథ్‌ మిగతా పాత్రల్లో నటిస్తున్నారు. ఎన్‌.వి.ఆర్‌. సినిమా పతాకంపై రూపొందుతున్న ఈ చిత్రానికి కెమెరా: ఛోటా కె.నాయుడు, సంగీతం: థమన్‌, మాటలు: అబ్బూరి రవి, ఎడిటింగ్‌: ఛోటా కె.ప్రసాద్‌, కో`డైరెక్టర్‌: పుల్లారావు కొప్పినీడి, లైన్‌ ప్రొడ్యూసర్‌: జి.నాగేశ్వరరావు, నిర్మాతలు: ఎన్‌.వి.ప్రసాద్‌, ఠాగూర్‌ మధు, దర్శకత్వం: వి.ఐ.ఆనంద్‌. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ