ఎన్టీఆర్ కథానాయకుడిగా సుకుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కునున్న సంగతి తెలిసిందే. వైవిధ్యమైన కథ, కథనాలతో ప్రతీకార నేపథ్యంలో రూపొందనున్న ఈ చిత్రాన్ని శ్రీ వేంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై బీవీఎస్‌ఎన్ ప్రసాద్, బోగపల్లి బాపనీడు నిర్మిస్తున్నారు. '1' సినిమా తర్వాత ఎన్టీఆర్ సినిమా కోసమే ఏడాదికిపైగా సుకుమార్ వేచిచూస్తున్నారు. అయితే 'టెంపర్' విడుదలవనుండటంతో ఇక ఎన్టీఆర్ సుకుమార్ సినిమాకు సమయం కేటాయిచంనున్నాడు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ వచ్చే మార్చినుంచి ప్రారంభం కానున్నట్లు తెలిసింది. రకుల్‌ప్రీత్‌సింగ్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాకు దేవీశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చనుండగా.. కెమెరామెన్‌గా రత్నవేలు బాధ్యతలు నిర్వహించనున్నారు.