Advertisementt

‘రామ్‌లీల’ ఆడియో రిలీజ్‌

Sat 07th Feb 2015 02:52 PM
telugu movie ramleela audio,hero havish,heroine nanditha,dasari kiran kumar  ‘రామ్‌లీల’ ఆడియో రిలీజ్‌
‘రామ్‌లీల’ ఆడియో రిలీజ్‌
Advertisement
Ads by CJ

హవీష్, అభిజీత్, నందిత ప్ర‌ధాన పాత్ర‌ల్లో రామదూత క్రియేషన్స్ పతాకంపై  శ్రీపురం కిరణ్ దర్శకత్వంలో  కోనేరు సత్యనారాయణ సమర్పణలో  దాసరి కిరణ్ కుమార్ నిర్మిస్తున్న చిత్రం ‘రామ్‌లీల’. ఈ చిత్రం ఆడియో ఆవిష్క‌ర‌ణ శ‌నివారం హైద‌రాబాద్‌లోని తాజ్ డెక్క‌న్ హోట‌ల్‌లో జ‌రిగింది. ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు వి.వి.వినాయ‌క్ ఆడియోను ఆవిష్క‌రించి తొలి సీడీని చిత్ర స‌మ‌ర్ప‌కులు కోనేరు స‌త్య‌నారాయ‌ణ‌కు అందించారు. థియేట్రిక‌ల్ ట్రైల‌ర్‌ను ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు బాబీ విడుద‌ల చేశారు. చిన్నా సంగీత సార‌ధ్యంలో రూపొందిన ఈ ఆడియో శ్రేయాస్ మ్యూజిక్ ద్వారా మార్కెట్‌లోకి విడుద‌లైంది. 

ఇంకా ఈ కార్యక్రమంలో ఛోటా కె.నాయుడు, మారుతి, యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్, ఎస్.గోపాల్ రెడ్డి, బి.గోపాల్, పరుచూరి వెంకటేశ్వరరావు, డా.వెంకటేశ్వరరావు, ఈష, కో ప్రొడ్యూస‌ర్ ముత్యాల రమేష్, మల్టీడైమన్షన్ వాసు, స్వామినాయుడు, సత్యారెడ్డి, మ్యూజిక్ డైరెక్టర్ చిన్నా, కృష్ణుడు, మాటల రచయిత విసు, పాటల రచయితలు  రామాంజనేయులు, పైడిశెట్టి రామ్, కృష్ణ మదినేని తదితరులు పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా...

హీరో హవీష్ః  డైరెక్టర్ శ్రీపురం కిరణ్ గారి వ‌ల్లే ఎస్‌.గోపాల‌రెడ్డిగారితో ప‌నిచేసే అవ‌కాశం వ‌చ్చింది.  అభిజీత్, నందిత మంచి న‌ట‌న‌ను ప్ర‌ద‌ర్శించారు. చిన్నాగారి మ్యూజిక్ చాలా ఎక్స్‌లెంట్‌గా వుంది. పాట‌ల‌న్నీ చాలా బాగా వ‌చ్చాయి. సినిమా బాగా రావ‌డానికి కోఆప‌రేట్ చేసిన టీమ్‌లోని ట‌క్నీషియ‌న్స్ అంద‌రికీ చాలా థాంక్స్‌. 

శ్రీపురం కిరణ్ః ఈ కథ ఇంత బాగా రావడానికి కొనేరు సత్యనారాయణగారే కార‌ణం. జీనియస్ కంటే ముందుగానే చేయాల్సిన సినిమా ఇది. ర‌చ‌యిత‌గా వున్న న‌న్ను గుర్తించి  ఈ సినిమాతో ద‌ర్శ‌కుడిని చేసిన దాసరి కిరణ్ గారికి థాంక్స్. తప్పకుండా సినిమా అందరికీ నచ్చుతుంది. 

బి.గోపాల్‌: డైరెక్టర్‌ కిరణ్‌ నాకు ఎప్పటి నుంచో పరిచయం. ఎప్పుడో డైరెక్టర్‌ అవ్వాల్సిన వ్యక్తి. అతనికి ఈ సినిమాతో అవకాశం వచ్చింది. సినిమా అంటే మంచి అభిరుచి వున్న దాసరి కిరణ్‌గారు ఈ చిత్రంతో మరో హిట్‌ కొట్టబోతున్నాడు.

ఎస్‌.గోపాలరెడ్డి: డైరెక్టర్‌ కిరణ్‌ ఈ సినిమా కోసం ఎంతో కష్టపడ్డాడు. అతని కోసం ఈ సినిమా చాలా పెద్ద హిట్‌ అవ్వాలని కోరుకుంటున్నాను.

కోనేరు సత్యనారాయణ: హవీష్‌ గతంలో మా యూనివర్సిటీని రన్‌ చేసేవాడు. తనకి సినిమాల మీద వున్న ఇంట్రెస్ట్‌ చూసి నేనే అతన్ని సినిమా రంగంలో ట్రై చెయ్యమని ఎంకరేజ్‌ చేశాను. శ్రీపురం కిరణ్‌ దర్శకత్వంలో జీనియస్‌ కంటే ముందే ఈ సినిమా చెయ్యాల్సి వుంది. కానీ, అప్పుడు కుదరలేదు. కిరణ్‌లో చాలా టాలెంట్‌ వుంది. ఈ సినిమా కోసం చాలా మంచి కథ రెడీ చేశాడు. చాలా బాగా డైరెక్ట్‌ చేశాడు. గోపాల్‌రెడ్డిగారి ప్రోత్సాహం యూనిట్‌లోని అందరికీ వుంది. ఈ సినిమా విషయంలో గోపాలరెడ్డిగారే హీరో. అనుకున్న టైమ్‌లో, అనుకున్న బడ్జెట్‌లో ఈ చిత్రాన్ని పూర్తి చేశారు. తప్పకుండా ఈ సినిమా చాలా పెద్ద హిట్‌ అవుతుందన్న నమ్మకం నాకు వుంది. 

దాసరి కిరణ్‌కుమార్‌: హవీష్‌ హీరోగా నటించిన మా మొదటి చిత్రం జీనియస్‌ ఎంత పెద్ద సక్సెస్‌ అయిందో అందరికీ తెలిసిందే. మా రెండో చిత్రంలో కూడా హవీష్‌ హీరోగా నటిస్తున్నాడు. తప్పకుండా ఈ సినిమా జీనియస్‌ కంటే పెద్ద హిట్‌ అవుతుంది. ఎందుకంటే కిరణ్‌ మీద నాకు చాలా నమ్మకం వుంది. అతను మంచి రైటరే కాదు ఈ సినిమాతో మంచి డైరెక్టర్‌ని అని ప్రూవ్‌ చేసుకుంటాడు. హవీష్‌, అభిజీత్‌, నందిత చాలా ఎక్స్‌ట్రార్డినరీగా పెర్‌ఫార్మ్‌ చేశారు. 

చిన్నా: కిరణ్‌గారు రచయితగా ఎన్నో సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో వున్నారు. ఈ సినిమాతో ఆయన దర్శకుడుగా పరిచయం అవడం ఆనందంగా వుంది. తప్పకుండా కిరణ్‌గారికి ఈ సినిమాతో మంచి బ్రేక్‌ వస్తుందని నా నమ్మకం. 

 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ