Advertisementt

టెంపర్‌ డేట్‌ ఫిక్స్‌ అయ్యింది..!

Fri 06th Feb 2015 11:13 PM
temper release date,jr ntr,puri jagannath,audio release  టెంపర్‌ డేట్‌ ఫిక్స్‌ అయ్యింది..!
టెంపర్‌ డేట్‌ ఫిక్స్‌ అయ్యింది..!
Advertisement
Ads by CJ

జూ. ఎన్టీఆర్‌, పూరిజగన్నాథ్‌ల కాంబినేషన్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన చిత్రం 'టెంపర్‌'. కొన్నాళ్లుగా సరైన విజయం లేక పూర్తిగా చతికిలబడ్డ ఎన్టీఆర్‌ 'టెంపర్‌'పై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. మరోవైపు నిర్మాత బండ్ల గణేష్‌ పరిస్థితి కూడా కొన్నాళ్లుగా బాగా లేకపోవడంతో ఇప్పుడు ఆయనకు కూడా విజయం అందుకోక తప్పని పరిస్థితి. ఇక పూరి కూడా తన గత వైభవానికి తగిన రేంజ్‌లో కొన్నాళ్లుగా హిట్‌ అందుకోలేదు. దీంతో ఆయన కూడా కసిగా టెంపర్‌ సినిమా గురించి కష్టపడ్డారు. ఇలా తప్పక భారీ విజయాన్ని అందుకోవాల్సిన స్థితిలో ఈ ముగ్గురు కలిసి తీసిన 'టెంపర్‌' సినిమా రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌ అయ్యింది. గత నెలలోనే ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈ సినిమా షూటింగ్‌ ఆలస్యం కావడంతో ఫిబ్రవరి 13న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులను చకచకా పూర్తిచేసి మరో ఆరు రోజుల్లో విడుదల చేయడానికి సినిమా యూనిట్‌ తీవ్రంగా కష్టపడుతోంది.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ