Advertisementt

'లీలా' సినిమా ప్రారంభం..!

Fri 06th Feb 2015 04:56 AM
leela cinema launch,nikisha patel,vasishta,jks,anantha  'లీలా' సినిమా ప్రారంభం..!
'లీలా' సినిమా ప్రారంభం..!
Advertisement
Ads by CJ

ఆర్.జె. కంబైన్స్ పతాకంపై దర్శకుడు జె.కె.ఎస్. తెరకెక్కిస్తున్న సినిమా ''లీలా''. వశిష్ట, నికిషా పటేల్ జంటగా నటిస్తున్నారు. ఈ చిత్ర ప్రారంభోత్సవ వేడుక ఇటీవల హైదరాబాద్ రామానాయుడు స్టూడియోస్ లో జరిగింది. ఈ సినిమాకు సి.కళ్యాణ్ క్లాప్ నివ్వగా, ప్రొడ్యూసర్ అనంతా స్విచ్ ఆన్ చేసారు. దర్శకుడు జె.కె.ఎస్. మొదటి సన్నివేశానికి గౌరవ దర్శకత్వం వహించారు. 

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో దర్శకుడు జె.కె.ఎస్. మాట్లాడుతూ "కన్నడలో రెండు సినిమాలు చేసాను. తెలుగులో ఇది నా మొదటి సినిమా. తమిళంలో, కన్నడలో ఈ చిత్రం షూటింగ్ తొంబై శాతం అయిపోయింది. ప్రస్తుతం తెలుగులో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తున్నాం. ఇది ఓ థ్రిల్లర్ మూవీ. కమెడియన్స్ అలీ, బ్రహ్మానందం, వేణు నటిస్తున్నారు. ఈ సినిమాలో 2 పాటలను గోవాలో, ఒక పాటను ఫారెన్ లో షూట్ చేయనున్నాం" అని చెప్పారు.

ప్రొడ్యూసర్ ఎల్.అనంత మాట్లాడుతూ "డైరెక్టర్ జె.కె.ఎస్. సినిమా కోసం చాలా హార్డ్ వర్క్ చేస్తారు. ఈ సినిమాలో నేను భాగస్వామి అవ్వడం చాలా సంతోషంగా ఉంది" అని అన్నారు.

హీరోయిన్ నిఖిషా పటేల్ మాట్లాడుతూ "ఇప్పటివరకు మ్యూజిక్ డైరెక్టర్ రెండు పాటలను కంపోజ్ చేసారు. రెండు చాలా అధ్బుతంగా ఉన్నాయి. ఇదొక స్పెషల్ సినిమా" అని చెప్పారు.

హీరో వశిష్ట మాట్లాడుతూ "కన్నడలో 8 సినిమాలలో నటించాను. తెలుగులో ఇది నా మొదటి సినిమా. మొదటి సినిమాలోనే లీడ్ రోల్ చేయడం చాలా ఆనందంగా ఉంది" అని అన్నారు.

గణేష్ ప్రసాద్ మాట్లాడుతూ "నాకు ఈ సినిమాలో నటించే అవకాశం ఇచ్చిన దర్శకుడికి నా ధన్యావాదాలు. త్రేపటి నుంచి షూటింగ్ జరగనుంది. తెలుగులో ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నా" అని అన్నారు.

మ్యూజిక్ డైరెక్టర్ సుజీత్ శెట్టి మాట్లాడుతూ "సంగీత దర్శకునిగా కన్నడలో, హిందీ లో పని చేసాను. తెలుగులో మొదటిసారిగా ఈ సినిమాకు పని చేయడం చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమాలో 3 పాటలు ఉన్నాయి" అని చెప్పారు.  

సాంకేతిక వర్గం: సినిమాటోగ్రఫీ: జై ఆనంద్, ఎడిటర్: శ్రీకాంత్, డాన్స్: ప్రదీప్ ఆంటోనీ, స్టంట్: కె.డి.వెంకటేష్.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ