అనగనగా ఒక ధీరుడు' చిత్రం తర్వాత కొంత విరామం తీసుకున్న కె.రాఘవేందర్‌రావు తనయుడు కె.సూర్యప్రకాష్ త్వరలో మరో చిత్రాన్ని తెరకెక్కిండానికి సన్నాహాలు చేస్తున్నాడు. ఈసారి హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీని రూపొందించడానికి కసరత్తులు చేస్తున్నట్లు సమాచారం. ఇక ప్రస్తుతం తెలుగులో హీరోలతో సమానంగా క్రేజ్‌ను సంపాదించుకున్న అనుష్కను తన సినిమాలో హీరోయిన్‌గా తీసుకోవాలని సూర్యప్రకాశ్ నిర్ణయించుకున్నట్లు తెలిసింది. ఈ సినిమా స్క్రిప్ట్ విన్న వింటేనే అనుష్క కూడా ఓకే చెప్పిందని, భారీ బడ్జెట్‌తో తెరకెక్కించనున్న ఈ సినిమాను పొట్లూరి వరప్రసాద్ నిర్మించనున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. అనుష్క ప్రస్తుతం రుద్రమదేవి, బహుబలి చిత్రాలతో బిజీగా ఉంది. ఈ రెండు చిత్రాల షూటింగ్ పూర్తయిన వెంటనే సూర్యప్రకాష్ సినిమా షూటింగ్ మొదలవ్వనుంది.