Advertisementt

ఫిబ్రవరి 6న ‘పెసరట్టు’

Fri 06th Feb 2015 12:49 AM
pesarattu,pesarattu on feb 6th,mahesh kathi,nikhitha  ఫిబ్రవరి 6న ‘పెసరట్టు’
ఫిబ్రవరి 6న ‘పెసరట్టు’
Advertisement
Ads by CJ

నందు, నిఖిత జంటగా రామ్‌ ప్రియాంక మీడియా, రిచ్చెజ్జా మీడియా ఫ్యాక్టరీ, టెంపుల్‌ టౌన్‌ టాకీస్‌ పతాకాలపై కత్తి మహేష్‌ దర్శకత్వంలో డి.జి.సుకుమార్‌, కిరణ్‌ గూడుపల్లి, శ్రీనివాస్‌ గునిశెట్టి, ఏడుపుగంటి శేషగిరి, స్వప్నరాణి తక్కెళ్ళ నిర్మించిన చిత్రం ‘పెసరట్టు’. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఫిబ్రవరి 6న విడుదలవుతోంది. ఈ సందర్భంగా గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో...

నందు: తెలుగులో ఇది తొలి క్రౌడ్‌ ఫండెడ్‌ మూవీ. ఈ సినిమాలో నేను హీరోగా నటించడం చాలా హ్యాపీగా వుంది. 

మహేష్‌ కత్తి: సినిమా అంటే ప్యాషన్‌ వున్నవారు నిర్మించిన క్రౌడ్‌ ఫండెడ్‌ మూవీ ఇది. తొలిసారిగా ఈ సినిమా కోసం నటీనటులను  ఎంపిక చేయడం జరిగింది.

నిఖిత: డిఫరెంట్‌ రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌ ఇది. ఈ సినిమాని 13 రోజుల్లోనే ఫినిష్‌ చేయడం జరిగింది. తప్పకుండా ఈ సినిమా ఒక కొత్త ట్రెండ్‌ని క్రియేట్‌ చేస్తుంది. 

ఘంటశాల విశ్వనాథ్‌: ఈ సినిమాలో ఐదు పాటలు వున్నాయి. ఆడియోకి చాలా మంచి రెస్పాన్స్‌ వచ్చింది. నేను కూడా ఫేస్‌బుక్‌ ద్వారానే సెలెక్ట్‌ అయ్యాను. 

ఈ చిత్రానికి సంగీతం: ఘంటసాల విశ్వనాథ్‌, కెమెరా: కమలాకర్‌, ఆర్ట్‌: ధర్మేంద్ర జిల్లిపల్లి, ఎడిటర్‌: ప్రశంకర్‌, రచన: అరిపిరాల సత్యప్రకాష్‌, సహనిర్మాతలు:సాయిరవి సూరి భొట్ల, భీమ్‌సేన్‌ మూర్తి, అసోసియేట్‌ నిర్మాతలు: రంగ మధు, మల్లేశ్వరి దేవి, ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత: అనురాగ్‌, నిర్మాతలు:  శ్రీనివాస్‌ గునిశెట్టి, ఏడుపుగంటి శేషగిరి, డీజీ సుకుమార్‌, దర్శకత్వం: మహేష్‌ కత్తి. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ