Advertisementt

‘పిశాచి’ ట్రైలర్‌ లాంచ్‌

Thu 05th Feb 2015 01:16 AM
pisachi movie,pisachi trailer,c.kalyan,puri jagannath,myskin  ‘పిశాచి’ ట్రైలర్‌ లాంచ్‌
‘పిశాచి’ ట్రైలర్‌ లాంచ్‌
Advertisement
Ads by CJ

‘చంద్రకళ’ వంటి సూపర్‌హిట్‌ చిత్రాన్ని అందించిన సి.కళ్యాణ్‌ తాజాగా తమిళంలో సూపర్‌హిట్‌ అయిన ‘పిశాచి’ చిత్రాన్ని అదే పేరుతో తెలుగులో అందిస్తున్న విషయం తెలిసిందే. మిస్కిన్‌ దర్శకత్వంలో ప్రముఖ తమిళ దర్శకుడు బాల నిర్మించిన ‘పిశాచి’ చిత్రాన్ని సి.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ప్రై. లిమిటెడ్‌, కల్పన చిత్ర కాంబినేషన్‌లో సి.కళ్యాణ్‌, కల్పన తెలుగులో విడుదల చేస్తున్నారు. కాగా, ఈ చిత్రానికి సంబంధించిన థియేటర్‌ ట్రైలర్‌, టి.వి. ట్రైలర్‌ లాంచ్‌ బుధవారం హైదరాబాద్‌లోని ప్రసాద్‌ ల్యాబ్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన పూరి జగన్నాథ్‌ థియేటర్‌ ట్రైలర్‌ను, మరో ముఖ్య అతిథి సౌత్‌ ఇండియన్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ జనరల్‌ సెక్రటరీ కాట్రగడ్డ ప్రసాద్‌ టి.వి. ట్రైలర్‌ను విడుదల చేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో ప్రముఖ నిర్మాతలు కె.ఎస్‌.రామారావు, కె.అశోక్‌కుమార్‌, డిస్ట్రిబ్యూటర్‌, ఎగ్జిబిటర్‌ అలంకార్‌ ప్రసాద్‌,  నిర్మాతల్లో ఒకరైన సి.వి.రావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా...

సి.కళ్యాణ్‌: ఈ సినిమా రిలీజ్‌ అయినరోజే తెలుగులో నేను చంద్రకళ రిలీజ్‌ చేశాను. ఈ సినిమా నన్ను తీసుకోమని బాల ఫోన్‌ చేసి అడిగారు. అయితే అప్పటికే చంద్రకళ అనే హార్రర్‌ సినిమా చేశాను. మళ్ళీ ఈ హార్రర్‌ సినిమా ఎందుకులే అని నేను ఇంట్రెస్ట్‌ చూపించలేదు. పిశాచి రిలీజ్‌ అయిన రోజే పి.కె. కూడా రిలీజ్‌ అయింది. అక్కడ అన్ని మల్టిప్లెక్స్‌లలో పి.కె. రిలీజ్‌ అయింది. అయితే పిశాచి చిత్రానికి మాత్రం రోజుకి ఒక్క షోయే ఇచ్చారు. మొదటి రోజు ఒక షో వేసిన తర్వాత మౌత్‌ టాక్‌ బాగా స్ప్రెడ్‌ అవడంతో రెండో రోజు రెండు షోలు, మూడో రోజు మూడు షోలు అలా 7 షోల వరకు పెరుగుతూ వెళ్ళి ఫైనల్‌గా సినిమా పెద్ద హిట్‌ అయిపోయింది. ఈ చిత్రంలో హీరోగా నటించింది మా మిత్రుడు శింగనమల రమేష్‌ అబ్బాయి. ఆ విషయం నాకు ముందు తెలీదు. బాల దగ్గర అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా చేరిన అతన్ని ఈ సినిమాతో బలవంతంగా హీరోని చేశారు. ఈ సినిమా పెద్ద సక్సెస్‌ కావడంతో కల్పనగారు రైట్స్‌ తీసుకున్నారు. తర్వాత నేను సినిమా చూసి తెలుగులో నేను చేస్తే బాగుండేది అని ఫీల్‌ అయ్యాను. షో పూర్తయిన తర్వాత నా బేనర్‌లో చెయ్యాలనుకుంటున్నాను ఇస్తారా అని ఆమెను అడిగాను. ఇద్దరం కలిసే తెలుగులో రిలీజ్‌ చేద్దామని కల్పనగారు అనడంతో నేను కూడా ఓకే అన్నాను. ఫిబ్రవరి 27న ఈ చిత్రాన్ని రిలీజ్‌ చేస్తున్నాం.

కాట్రగడ్డ ప్రసాద్‌: ఈ సినిమాకి సంబంధించి డే టు డే రిపోర్ట్‌ కళ్యాణ్‌కి పంపించడమే పనిగా పెట్టుకొని అతన్ని తెలుగులో రిలీజ్‌ చెయ్యమని చెప్పాను. కల్పనగారు రైట్స్‌ తీసుకున్న తర్వాత మరో వ్యక్తి వచ్చి వేరే విధంగా రైట్స్‌ తీసుకోవడంతో కొంత ప్రాబ్లమ్‌ అయింది. దాన్ని నేనే పరిష్కరించాను. మొత్తానికి మా కళ్యాణ్‌ బేనర్‌లోనే ఈ సినిమా తెలుగులో రిలీజ్‌ అవుతోంది. పిశాచి సినిమా ఆరు మల్టీప్లెక్స్‌లలో ఆరువారాలు రోజూ నాలుగు ఆటలు చొప్పున ఆడి పెద్ద హిట్‌ అయింది. తప్పకుండా తెలుగు ప్రేక్షకుల్ని కూడా ఈ సినిమా ఆకట్టుకుంటుంది.

కె.ఎస్‌.రామారావు: పిశాచి అనే టైటిల్‌ నన్ను కొంత ఇబ్బంది పెట్టింది. ఎందుకంటే ఫ్యామిలీ ఆడియన్స్‌ రావాలి కాబట్టి టైటిల్‌ వేరేది ఆలోచిస్తే బాగుండేది. సినిమా చూశాను. టేకింగ్‌ చాలా బాగుంది. సినిమాలో మంచి వర్త్‌ వుంది. టెక్నికల్‌గా కూడా చాలా బాగుంది. ఈ సినిమాతో మా కళ్యాణ్‌ టీమ్‌ మరో సూపర్‌హిట్‌ కొట్టాలని ఆశిస్తున్నాను.

కె.అశోక్‌కుమార్‌: ఈ సినిమా చూడడానికి కళ్యాణ్‌ నన్ను పిలిచాడు. నేను అప్పుడు చెన్నైలోనే వున్నప్పటికీ ఆమధ్యే చంద్రకళ చూశాము. మళ్ళీ ఏం చూస్తాంలే అని నేను వెళ్ళలేదు. పిశాచి అని టైటిల్‌ పెట్టినప్పటికీ ఇందులో వుండే దెయ్యం మంచి దెయ్యం అని కళ్యాణ్‌ చెప్పాడు. ఇలాంటి సినిమా ఇంగ్లీష్‌లో వచ్చింది. దాన్ని హిందీలో కూడా తీశారు. తమిళ్‌లో ఈ సినిమా ఎంత పెద్ద హిట్‌ అయిందో తెలుగులో దాన్ని మించిన హిట్‌ అవ్వాలని కోరుకుంటున్నాను.

పూరి జగన్నాథ్‌: నేను జనరల్‌గా దెయ్యం సినిమాలు చూడను. ఇందులో వున్నది మంచి దెయ్యం అంటున్నారు కాబట్టి ఈ సినిమా చూస్తాను. ట్రైలర్స్‌ చాలా బాగున్నాయి. తప్పకుండా తెలుగు ఆడియన్స్‌కి ఈ సినిమా నచ్చుతుంది.

బాల సమర్పణలో సి.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ప్రై. లిమిటెడ్‌, కల్పన చిత్ర బేనర్స్‌లో విడుదల కానున్న ‘పిశాచి’ చిత్రంలో నాగ, ప్రయాగ మార్టిన్‌, రాధారవి, హరీష్‌ ఉత్తమన్‌ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: రవి రాయ్‌, సంగీతం: ఎ.కె., మాటలు: శశాంక్‌, ఎడిటింగ్‌: గోపీనాథ్‌, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: తుమ్మలపల్లి రామసత్యనారాయణ, కో`ప్రొడ్యూసర్‌: సి.వి.రావు, నిర్మాతలు: సి.కళ్యాణ్‌, కోనేరు కల్పన, దర్శకత్వం: మిస్కిన్‌. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ