హవీష్ హీరోగా కోనేరు సత్యనారాయణ సమర్పణలో, లంకాల బుచ్చిరెడ్డి సారధ్యంలో రామదూత క్రియేషన్స్ పతాకంపై శ్రీపురం కిరణ్‌ను దర్శకుడుగా పరిచయం చేస్తూ దాసరి కిరణ్‌కుమార్ నిర్మిస్తున్న చిత్రం ‘రామ్‌లీల’. ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ లాంచ్ మంగళవారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన దర్శకేంద్రులు డా॥ కె.రాఘవేంద్రరావు టీజర్‌ను లాంచ్ చేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో సినిమాటోగ్రాఫర్ ఎస్.గోపాల్‌రెడ్డి, నిర్మాణసారధి లంకాల బుచ్చిరెడ్డి, చిత్ర దర్శకుడు శ్రీపురం కిరణ్, నిర్మాత దాసరి కిరణ్‌కుమార్, సహనిర్మాత ముత్యాల రమేష్, మాటల రచయిత విస్సు పాల్గొన్నారు. ఈ సందర్భంగా..
లంకాల బుచ్చిరెడ్డి: లెజెండ్రీ డైరెక్టర్ డా॥ కె.రాఘవేంద్రరావుగారితో ఈ డయాస్‌ని షేర్ చేసుకుంటానని ఎప్పుడూ అనుకోలేదు. ఆయన మా ఫంక్షన్‌కి వచ్చి టీజర్ లాంచ్ చేసినందుకు ధన్యవాదాలు. సినిమా చాలా బాగా వచ్చింది. ఎస్.గోపాల్‌రెడ్డిగారు ఫోటోగ్రఫీతో సినిమాని అద్దంలా తీర్చిదిద్దారు. ప్రతి ఫ్రేమ్ అద్భుతంగా వచ్చింది. కొత్త డైరెక్టర్ల దగ్గర ఫ్రెష్‌నెస్ వుంటుంది. అలాంటి ఫ్రెష్ కథతో శ్రీపురం కిరణ్ సినిమాని చాలా బాగా తీశాడు.
ముత్యాల రమేష్: దాసరి కిరణ్‌కుమార్‌గారు సినిమా చేస్తున్నారంటే దానికి తగ్గట్టుగానే పబ్లిసిటీని కూడా వినూత్నంగా చేస్తారు. టీజర్ చాలా బాగుంది. ఈ సినిమా హవీష్‌కి మంచి పేరు తెస్తుంది.
విస్సు: రాఘవేంద్రరావుగారు నాకు గాడ్‌ఫాదర్‌లాంటివారు. బద్రినాథ్ వంటి సినిమాలకు రైటర్‌గా పనిచేసిన నన్ను ఈ సినిమాతో ఫుల్‌ప్లెడ్జ్‌డ్ డైలాగ్ రైటర్‌గా చేశారు కిరణ్‌కుమార్‌గారు. ఎన్నో వ్యయప్రయాసలకోర్చి ఈ చిత్రాన్ని మలేషియాలో చిత్రీకరించడం జరిగింది. ఈ సినిమా ఎస్.గోపాల్‌రెడ్డిగారు బ్యాక్‌బోన్‌లా వుంటూ సినిమా బాగా రావడానికి కారకులయ్యారు.
శ్రీపురం కిరణ్: గంగోత్రి టైమ్‌లోనే రాఘవేంద్రరావుగారి పాదాలకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నాను. ఎస్.గోపాల్‌రెడ్డిగారు పనిచేస్తున్న కొత్త దర్శకుల్లో నేను 15వ వాడిని. ఆ విషయం తెలుసుకొని రాఘవేంద్రరావుగారు మలేషియా వచ్చి మరీ మమ్మల్ని ఆశీర్వదించారు. నరసింహ చిత్రానికి 20 మంది ఘోస్ట్ రైటర్స్‌లో ఒకడిగా కెరీర్ ప్రారంభించిన నన్ను ఈ సినిమాతో దర్శకుడ్ని చేశారు కిరణ్‌కుమార్‌గారు. నేను ఒక డైరెక్టర్‌గా తప్పుటడుగులు వేయకుండా ఒక తండ్రిలా గోపాల్‌రెడ్డిగారు నన్ను నడిపించారు. కథకు తగ్గట్టుగా ఈ సినిమాలో నటించిన నటీనటులందరూ చాలా బాగా చేశారు.
దాసరి కిరణ్‌కుమార్: జీనియస్ చిత్రాన్ని ఎంత అద్భుతంగా తీశామో దానికి ఏమాత్రం తగ్గకుండా ‘రామ్‌లీల’ చిత్రాన్ని నిర్మించడం జరిగింది. కథ విని ఆ కథకు తగ్గట్టుగా ఆర్టిస్టుల్ని, టెక్నీషియన్స్‌ని సెలెక్ట్ చేసుకోవడం నాకు అలవాటు. అలాగే ఈ సినిమాకి కూడా చేశాం. ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ ఈ సినిమా బాగా రావడానికి ఎంతో తోడ్పడ్డారు. 30 సంవత్సరాలుగా డైరెక్టర్ అవ్వాలని కృషి చేస్తున్న కిరణ్ ఈ సినిమాతో దర్శకుడయ్యాడు. చాలా అద్భుతంగా సినిమా తీశాడు. ఓపెనింగ్‌తో స్టార్ట్ చేసి రిలీజ్ వరకు బాగా పబ్లిసిటీ చేయడం నాకు అలవాటు. కానీ, ఈ సినిమా విషయంలో అలా కాకుండా ఫస్ట్ కాపీ వచ్చిన తర్వాత రాఘవేంద్రరావుగారితోనే టీజర్ లాంచ్ చేయించాలని ఇప్పటివరకు పబ్లిసిటీ చేయలేదు. ఈనెల 7న ఈ చిత్రం ఆడియో ఆవిష్కరణ తాజ్ డెక్కన్‌లో జరపబోతున్నాం. అలాగే సినిమాని ఈనెల 20న రిలీజ్ చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నాం.
హవీష్, అభిజీత్, నందిత, అక్ష, మదాలస శర్మ, ఆలీ, సప్తగిరి, భానుచందర్, నాగినీడు, కృష్ణుడు, శివన్నారాయణ, అనితాచౌదరి, వైవా హర్ష, జయవాణి, గుండు సుదర్శన్, ఇంద్ర తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: చిన్నా, మాటలు: విస్సు, ఎడిటింగ్: కార్తీక శ్రీనివాస్, కెమెరా: ఎస్.గోపాలరెడ్డి, సహనిర్మాత: ముత్యాల రమేష్, నిర్మాత: దాసరి కిరణ్‌కుమార్, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: శ్రీపురం కిరణ్.