దర్శక నిర్మాత బాబ్జి పీపుల్స్ థియేటర్ పతాకంపై రూపొందిస్తున్న సినిమా ''వేట కొడవళ్ళు''. ఈ చిత్రం సెకండ్ షెడ్యూల్ ఈ నెల 27 వ తేదీ నుండి హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో జరుపుకుంటుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో దర్శక నిర్మాత బాబ్జి మాట్లాడుతూ "ఈ సెకండ్ షెడ్యూల్ లో హీరోల హౌస్ సీన్స్, ఛేజింగ్స్, ఫైట్స్ సీక్వెన్స్ తో పాటు రెండు పాటలను కూడా చిత్రీకరిస్తున్నాం. తర్వాతి షెడ్యూల్ ను కర్నూలు, మంత్రాలయం, ఎమ్మిగనూరు పరిసరాలలో జరుపుతాం. ఈ సినిమా టైటిల్ ను విని ఇదేదో ఫ్యాక్షన్ సినిమా అని కొందరు, రెడ్ సినిమా అని కొందరు, దండుపాలెం లాంటి సినిమా అని కొందరు అనుకుంటున్నారు. కాని ఇది అన్ని ఎలిమెంట్స్ కలగలిసిన కమర్షియల్ మూవీ. ఈ చిత్రాన్ని అన్ని భాషలలోని విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. మే లేదా జూన్ నెలలో ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. తెలుగు సినీ చరిత్రలో మంచి సినిమాగా ఈ చిత్రం నిలిచిపోతుంది" అని అన్నారు.
హీరోయిన్ హిమజ మాట్లాడుతూ "గ్లామరస్ పాత్రలలో నటించడం కంటే ఇలాంటి సందేశాత్మకమైన చిత్రంలో నటించడం చాలా ఆనందంగా ఉంది. సమ్మర్ లో రిలీజ్ అయ్యే ఓ మంచి చిత్రం ఇది. ఈ సినిమా తరువాత మా చిత్ర బృందానికి మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నా" అని అన్నారు.
ఈ చిత్రంలో నటీనటులు : గిడ్దేశ్, గంటమ్రోగిన రవితేజ, హన్మంత్, గోవింద్, బాబురాం, రమాప్రభ, తనికెళ్ళభరణి.
సాంకేతిక వర్గం : డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ: కిషన్ సాగర్, సంగీతం: గజ్వేల్ వేణు, ఎడిటర్: శివ శార్వాణి,
సహ నిర్మాత: ఎన్.పి. సుబ్బారాయుడు.