నందమూరి హీరో కళ్యాణ్‌రామ్ హీరోగా నందమూరి తారక రామారావు ఆర్ట్స్ బ్యానర్‌పై నిర్మించిన చిత్రం ‘పటాస్’. అనిల్ రావిపూడి దర్శకుడు. జనవరి 23న విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ మూవీగా నిలిచింది. ఇంతటి ఘనవిజయాన్ని అందించిన ప్రేక్షకులను కలుసుకుని చిత్రయూనిట్ తమ సంతోషాన్ని వారితో పంచుకున్నారు. ఒంగోలు, నెల్లూరు, బందరు, గుడివాడ, గుంటూరు, తిరుపతి, విజయవాడల్లో ఈ సక్సెస్ టూర్ కొనసాగింది. ఆదివారం విజయవాడలో విజయయాత్రను ఘనంగా ముగించారు. ఈ విజయోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే బొండా ఉమామహేశర్వరావు, హీరో కళ్యాణ్‌రామ్, దర్శకుడు అనిల్ రావిపూడి, నిర్మాత దిల్‌రాజు, మ్యూజిక్ డైరెక్టర్ సాయికార్తీక్, ప్రముఖ డిస్ట్రిబ్యూటర్స్ అలంకార్ ప్రసాద్, ఎల్.వి.ఆర్. రాఘవ, శ్రీమన్నారాయణ, సురేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా..
నందమూరి కళ్యాణ్‌రామ్ మాట్లాడుతూ ‘‘దాదాపు పది సంవత్సరాలు తర్వాత పటాస్ విజయం దక్కింది. ఈ విజయం నాదని అందరూ అంటున్నారు. కానీ ఈ సక్సెస్ నాది కాదు మన రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలది. అందుకే ఈ విజయాన్ని తెలుగు ప్రజలకు డేడికేట్ చేస్తున్నాను. ఈ సంవత్సరం నందమూరి వారి సంవత్సరమే అవుతుంది’’ అన్నారు.
దిల్‌రాజు మాట్లాడుతూ ‘‘నా లైఫ్‌లో నేను చూసిన మొదటి సినిమా వేటగాడు. అలా నా సినిమా లైఫ్ ను అటువంటి మహానుభావుడి సినిమాతోనే ప్రారంభించాను. తర్వాత ఎన్టీఆర్ గారి సినిమాలు చేశాను. ఇప్పుడు కళ్యాణ్‌రామ్ గారి పటాస్ సినిమాని రిలీజ్ చేసే అవకాశం ఇచ్చిన కళ్యాణ్‌రామ్ గారికి థాంక్స్. 2005,అతనొక్కడే తర్వాత కళ్యాణ్‌రామ్ గారు ఎన్నో ప్రయత్నాలు చేశారు కానీ ఆ స్థాయి విజయాన్ని అందుకోలేకపోయారు. ఇప్పుడు 2015లో పటాస్‌తో మరో బ్లాక్ బస్టర్ హిట్ వచ్చంది. రిలీజ్‌కి 10 రోజుల ముందుగానే నేను ఈ సినిమాని చూశాను. సినిమా పెద్ద హిట్టవుతుందనే విషయాన్ని అప్పట్లోనే చెప్పాను. అది ఈ రోజు నిజమైంది. ఎన్టీఆర్ చెప్పినట్లు ఈ సంవత్సరం నందమూరి వారి సంవత్సరం. ఈ విజయయాత్ర పటాస్‌తో మొదలైంది. రేపు టెంపర్ విడుదల కానుంది. తర్వాత లయన్ విడుదలవుతుంది. ఇలా వరుస విజయాలతో ఈ సంవత్సరం నందమూరి వారిదే. అలాగే అనిల్ రావిపూడి మొదటి సినిమాని ఫుల్ కమర్షియల్ ఎలిమెంట్స్‌తో తెరకెక్కించాడు. సినిమా రెండో వారంలో కూడా కలెక్షన్స్ ఎక్కడా తగ్గలేదు. ఒక మంచి చిత్రాన్ని ప్రేక్షకులు ఎలా ఆదరిస్తారో పటాస్ తో మరోసారి నిరూపించినందుకు థాంక్స్’’ అన్నారు.
సాయికార్తీక్ మాట్లాడుతూ ‘‘అనిల్ రావిపూడి పక్కా కమర్షియల్ ఎలిమెంట్స్‌తో ఈ సినిమాని తెరకెక్కించారు. ఇక మ్యూజిక్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది. ‘అరే ఓ సాంబ..’సాంగ్ ఐడియా మాత్రం దర్శకుడు అనిల్ గారిదే. ఇప్పటి వరకు స్వర్గీయ ఎన్టీఆర్ గారి సాంగ్స్ రీమిక్స్ చేశారు. బాలకృష్ణగారి సాంగ్ రీమిక్స్ చేస్తే బావుంటుందనే ఆలోచనతో ఈ సాంగ్ రీమిక్స్ చేశాం. ఈ పాట ఫ్యాన్స్ అందరికీ నచ్చింది. ఈ సినిమాలో ‘టప్ప టప్ప... ’ అనే సాంగ్ నాకు ఇష్టమైన పాట. కళ్యాణ్‌రామ్ గారికి పెద్ద హిట్ ఇచ్చిన ప్రేక్షకులకు థాంక్స్’’ అన్నారు.
ఎమ్మెల్యే ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ ‘‘కృష్ణాజిల్లాలో నందమూరి హీరోలకు ఎప్పడూ మంచి ఆదరణ ఉంటుంది. కృష్ణాజిల్లా అంటే వెంటనే మనకు గుర్తుకు వచ్చే పేరు స్వర్గీయ నందమూరి తారక రామారావుగారే. కళామతల్లికి ఆయన చేసిన సేవలు మరచిపోలేం. తెలుగువాడు గర్వించే నటుడాయన. అలాగే మా అన్న హరికృష్ణ తనయుడు కళ్యాణ్‌రామ్ హీరోగా వచ్చిన పటాస్ పెద్ద సక్సెస్ కావడం చాలా హ్యపీగా ఉంది. 2015 నందమూరి హీరోల సంవత్సరం. పటాస్ తర్వాత టెంపర్ వస్తుంది. అలాగే బాలకృష్ణగారిది లయన్ విడుదలవుతుంది. అన్నీ సినిమాలు పెద్ద సక్సెస్ అవుతాయి. విజయవాడలో మొన్న ముకుంద ఆడియో సక్సెస్ మీట్, నిన్న కృష్ణమ్మ కలిపింది ఆడియో, ఈ రోజు పటాస్ సక్సెస్ మీట్ జరిగింది. ఇదే విధంగా మిగతా నిర్మాతలు అందరూ విజయవాడకి రావాలి. కళ్యాణ్‌రామ్ గారి పట్టుదలే పటాస్ సక్సెస్‌కి కారణం. అలాగే దర్శకుడు అనిల్ రావిపూడి సహా టీమ్‌ని అభినందిస్తున్నాను’’ అన్నారు.
అనిల్ రావిపూడి మాట్లాడుతూ ‘‘పటాస్ సినిమాతో దర్శకుడిగా నాకు అవకాశం ఇచ్చిన కళ్యాణ్ రామ్ గారికి థాంక్స్. పటాస్ అంటే కళ్యాణ్‌రామ్ గారు ఒక్కరే కాదు. ఎందుకంటే అంతకు ముందే స్వర్గీయ ఎన్టీఆర్ కొండవీటి సింహం ఒక పటాస్, బాలకృష్ణగారి రౌడీ ఇన్సెపెక్టర్ ఒక పటాస్, హరికృష్ణగారి సీతయ్య ఒక పటాస్, ఇప్పుడు కళ్యాణ్‌రామ్ గారి పటాస్, రేపు ఎన్టీఆర్ టెంపర్ ఒక పటాస్. ఇలాంటి పటాస్‌లున్నాయి. సాయికార్తీక్ మంచి మ్యూజిక్ ఇచ్చాడు. సర్వేష్ మురారి సినిమాటోగ్రఫీ, ఇలా అందరూ టెక్నిషియన్స్‌కి థాంక్స్. సినిమాని బ్లాక్ బస్టర్ హిట్ చేసిన ప్రేక్షకులకు ధన్యవాదాలు’’ అన్నారు.