భారీ చిత్రాల దర్శకుడు గుణశేఖర్ దాదాపు 9 సంవత్సరాలు రీసర్చ్ చేసి తెరకెక్కించిన పీరియాడికల్ సినిమా ‘రుద్రమదేవి’. ఇండియాలోనే మొట్టమొదటి సారిగా గుణశేఖర్ స్టీరియో స్కోపిక్ ద్వారా తెరకెక్కిస్తున్న హిస్టారికల్ 3డి మూవీ ‘రుద్రమదేవి’. గత సంవత్సరం డిసెంబర్ కల్లా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాకి సంబందించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. కాగ ఇలాంటి సంచలన చిత్రం ఆడియో కూడా ఎప్పటికి నిలిచి పోవాలని ఈ చిత్రానికి మాస్ట్రో ఇళయరాజా తో మ్యూజిక్ చేయించారు దర్శకుడు గుణశేఖర్. ఈ ఆడియో ను దక్కించుకోవాలని టాప్ ఆడియో సంస్థలన్ని ప్రయత్నించాయి. చివరకు ఈ చిత్రానికి సంబందించిన ఆడియో హక్కులను >హైయ్యెస్ట్ ఫాన్సీ రేట్ ఇచ్చి ప్రముఖ ఆడియో సంస్థ లహరి మ్యూజిక్ దక్కించుకుంది.
ఈ సందర్భంగా ఆడియో అధినేత జి. మనోహర్ నాయుడు మాట్లాడుతూ: "ఈ ఏడాది ప్రారంభం లో మా సంస్థ ద్వార విడుదల అయిన ' గోపాల గోపాల' తెలుగు ఆడియో లో టాప్ పోజిషన్ లో వుంది. మా ఆడియో ఆల్బం లో ఇళయరాజా గారి సినిమాలు పాటలు చాల వున్నాయి. ఇప్పటికి అవి వినబడుతున్న, అయితే తర తారలు గుర్తుండి పోయేలా ‘రుద్రమదేవి’ చిత్రం లాంటి ఆడియో కూడా ఆయనే చేయడంతో ఎంత రేట్ అయిన ఈ సినిమా దక్కించుకోవాలని మంచి ఫాన్సీ రేట్ ఇచ్చి కొన్నాము. సినిమా అడ్వాన్సు క్వాలిటీ కాబట్టి, మేము ఆడియో పరంగా ఇచ్చే హై క్వాలిటీ నచ్చి ఎప్పుడు క్వాలిటీ విషయం లో కాంప్ర్ మైజ్ కాని గుణశేఖర్ గారు మాకే ఈ ఆడియో రైట్స్ ఇచ్చారు. ఆయనకు ధన్యవాదాలు. ఆయన నమ్మకాన్ని ఏ మాత్రం వమ్ము చేయకుండా మంచి క్వాలిటీ తో ఫిబ్రవరి థర్డ్ వీక్ లో ఆడియో రిలీజ్ చేస్తాము" అన్నారు. అనుష్క, రానా ప్రధాన పాత్రలు నటించిన ఈ సినిమాలో అల్లు అర్జున్, కృష్ణం రాజు, నిత్య మీనన్, కేథరిన్, హంసా నందిని, ప్రకాష్ రాజ్ తదితరులు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.