దేవి క్రియేషన్స్ పతాకంపై ఆకాష్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన ఔట్ అండ్ ఔట్ ఎంటర్‌టైనర్ ‘ఆనందం మళ్ళీ మొదలైంది’. ఈ చిత్రాన్ని ఎన్.జె.రత్నావత్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ను శనివారం హైదరాబాద్‌లోని ఫిలింఛాంబర్‌లో విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో హీరో, దర్శకుడు ఆకాష్, నిర్మాత ఎన్.జె.రత్నావత్, సంగీత దర్శకుడు సుమన్ జూపూడి, నటుడు చిత్రం బాషా, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ రత్నావత్ బలరామ్ పాల్గొన్నారు.
హీరో, దర్శకుడు ఆకాష్ మాట్లాడుతూ ‘‘డైరెక్టర్‌గా నాకు తొలి అవకాశాన్ని ఇచ్చిన రత్నావత్‌గారు మళ్ళీ నా డైరెక్షన్‌లో ఈ సినిమా నిర్మించడం ఆనందంగా వుంది. ఇది ఔట్ అండ్ ఔట్ ఎంటర్‌టైనర్. నాకు స్టార్‌గా ఒక స్టేటస్ ఇచ్చిన చిత్రం ఆనందం. అందుకే ఈ చిత్రానికి ఆనందం మళ్ళీ మొదలైంది అనే టైటిల్ పెట్టడం జరిగింది. ఈ చిత్రం బాగా రావడానికి నటీనటులు, టెక్నీషియన్స్ ఎంతో సహకరించారు. వారందరికీ ఈ సందర్భంగా థాంక్స్ చెప్తున్నాను. ఈ చిత్రాన్ని అనుకున్న బడ్జెట్ కంటే తక్కువలో పూర్తి చెయ్యడానికి యూనిట్‌లోని ప్రతి ఒక్కరూ సహకరించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి ఈచిత్రాన్ని త్వరలోనే రిలీజ్ చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు.
నిర్మాత ఎన్.జె.రత్నావత్ మాట్లాడుతూ ‘‘మా బేనర్‌లో ఇది రెండో సినిమా. ఆకాష్‌గారిని డైరెక్టర్‌గా పరిచయం చేస్తూ చేసిన ‘స్వీట్‌హార్ట్’ చాలా మంచి సినిమా. కానీ, ఎందుకో సక్సెస్ కాలేదు. దాదాపు ఐదు సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆకాష్‌గారు హీరోగా ఒక మంచి కథతో ఈ సినిమా చేస్తున్నాము. తప్పకుండా ఈ సినిమా మంచి విజయం సాధిస్తుందన్న నమ్మకం నాకు వుంది’’ అన్నారు.
సుమన్ జూపూడి మాట్లాడుతూ ‘‘ఈ సినిమాలో అన్నీ మంచి పాటలే వున్నాయి. డైరెక్టర్‌గారు, నిర్మాతగారు నాకు ఎంతో సపోర్ట్ ఇచ్చారు. ఆ సపోర్ట్‌తోనే మంచి పాటలు చెయ్యగలిగాను. విజువల్‌గా కూడా ఈ పాటలు చాలా బాగా వచ్చాయి. ఈ సినిమా తప్పకుండా అందరికీ మంచి పేరు తెస్తుంది’’ అన్నారు.
చిత్రం బాషా మాట్లాడుతూ ‘‘ఆకాష్‌గారు ఈ సినిమాలో కూడా చాలా మంచి క్యారెక్టర్ ఇచ్చారు. ఈ చిత్రంలో చాలా మంది కమెడియన్స్ నటించారు. ఆకాష్‌గారికి ఆనందం ఎంత మంచి పేరు తెస్తుందో దానికంటే మంచి పేరు ఈ ‘ఆనందం మళ్ళీ మొదలైం’ తెస్తుంది’’ అన్నారు.
ఆకాష్, ఏంజెల్ సింగ్, జియాఖాన్, అలేఖ్య, సప్తగిరి, సత్యం రాజేష్, శివారెడ్డి, చిత్రం శ్రీను, సుమన్‌శెట్టి, అంబటి శ్రీను, చిత్రం బాషా, రమ్య, మాన్సి, భావన, దినేష్ మ్యాడ్ని, ఖాదర్‌వల్లి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి మాటలు: అశోక్ వడ్లమూడి, సంగీతం: సుమన్ జూపూడి, కెమెరా: చక్రి, ఎడిటింగ్: సామ్రాట్, డాన్స్: రాక్ వేణు, వేణుపాల్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: రత్నావత్ బలరామ్, సమర్పణ: నందిత, నిర్మాత: ఎన్.జె.రత్నావత్, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ఆకాష్.