Advertisementt

''హీరోయిన్" సినిమా ఆడియో ఆవిష్కరణ..!

Sat 31st Jan 2015 03:07 AM
heroine,bharath,jvr movies,venkateshwarulu,anjan,anusmruthi  ''హీరోయిన్
''హీరోయిన్" సినిమా ఆడియో ఆవిష్కరణ..!
Advertisement
Ads by CJ

అనుస్మ్రుతి, అంజన్ కుమార్ జంటగా  జె.వి.ఆర్ సినిమా పతాకంపై తెరకెక్కించిన సినిమా ''హీరోయిన్''. దర్శకుడు భరత్ పారేపల్లి. నిర్మాత జల్లేపల్లి వెంకటేశ్వరులు. ఈ చిత్ర ఆడియో ఆవిష్కరణ ఈ నెల 30 న హైదరాబాద్ తాజ్ డెక్కన్ లో పలువురు సినీ ప్రముఖులు, రాజకీయనాయకుల సమక్షంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అథిదులుగా విచ్చేసిన దర్శకుడు మారుతి ఆడియో ఆవిష్కరించి తొలి సి.డి.ని సంపూర్నేష్ బాబు కు అందించారు.
ఈ సందర్భంగా ప్రముఖ దర్శకుడు మారుతి మాట్లాడుతూ "మంచి పేరు టైటిల్ గా పెట్టారు. సినిమాను సందేశాత్మకంగా నిర్మించడంతో పాటు కామెడీ, హారర్ ను జోడించి తీసారు. జెవిఆర్ నాకు మంచి స్నేహితుడు ఆయన సినిమాను నేను డిస్ట్రిబ్యూట్ చేయడం చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమా రిలీజ్ కి మంచి ఓపెనింగ్స్ వస్తాయి" అని అన్నారు.
నిర్మాత జల్లేపల్లి వెంకటేశ్వరులు మాట్లాడుతూ "ఈ సినిమా తీయడానికి కారణం నాకు కళలపై ఉన్న అభిమానం. అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేయడానికి వచ్చిన అంజన్ ను హీరోగా పరిచయం చేస్తున్నాం. ఓ పల్లెటూరి వాతావరణంలో, పట్టణ వాతావరణంలో జరిగే సన్నివేశాలను ఒక కథగా చిత్రీకరించాము. ఈ సినిమా కథ నచ్చి డైరెక్టర్ మారుతీ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు" అని చెప్పారు.
దర్శకుడు భరత్ మాట్లాడుతూ "పెద్దాడ మూర్తి ఈ సినిమాలో పాటలన్నీ రాసారు. మ్యూజిక్ డైరెక్టర్ లలిత్ సురేష్ చాలా చక్కగా స్వరాల్ని సమకూర్చారు. రీమిక్స్ చేసిన కోకోకోల సాంగ్ ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తుంది" అని అన్నారు.
మ్యూజిక్ డైరెక్టర్ లలిత్ సురేష్ మాట్లాడుతూ "భరత్ చేసిన 30 సినిమాలో 60 శాతం సినిమాలకు నేనే మ్యూజిక్ అందించాను. ఇందులో 7 పాటలు ఉన్నాయి. రీమిక్స్ సాంగ్ భరత్ దగ్గర ఉండి నాతో చేయించారు. రెండు సెంటిమెంటల్ సాంగ్స్ బాగా హిట్ అవుతాయి" అని చెప్పారు.
హీరో అంజన్ కుమార్ మాట్లాడుతూ "హీరోగా ఇది నా మొదటి సినిమా. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నా" అని అన్నారు.
హీరోయిన్ అనుస్మ్రుతి మాట్లాడుతూ "హీరోయిన్ గా ఇది చాలెంజింగ్ రోల్. నన్ను నమ్మి ఈ పాత్ర ఇచ్చిన డైరెక్టర్ కి, నిర్మాత కి నా ధన్యవాదాలు" అని చెప్పారు.
సంపూర్నేష్ బాబు మాట్లాడుతూ " ట్రైలర్, సాంగ్స్ చాలా కలర్ ఫుల్ గా ఉన్నాయి. సినిమా పెద్ద హిట్ అయ్యి ఇండస్ట్రీ లో మంచి సినిమా గా గుర్తింపు పొందాలని కోరుకుంటున్నా" అని అన్నారు.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ