విజయ్‌తో కలిసి 'కత్తి' చిత్రంలో తొలిసారి నటించింది సమంతా. ఇటీవలే విడుదలైన ఈ చిత్రం తమిళనాట భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ చిత్రం తర్వాత ఆమె మరోసారి విజయ్‌తో జోడి కట్టబోతోంది. 'రాజా రాణి' ఫేమ్ అట్లీ కుమార్ దర్శకత్వంలో విజయ్ కథానాయకుడిగా ఓ చిత్రం తెరకెక్కనుంది. ఇందులో విజయ్‌కి జోడిగా నయనతార, సోనాక్షిసిన్హా, దీపికా పదుకొనే వంటి తారల పేర్లు వినిపించాయి. అయితే వారందరికంటే కూడా సమంతానే విజయ్ సరసాన నటిస్తే బాగుంటుందని భావించిన దర్శకుడు ఆమెనే ఎంపిక చేసుకున్నట్లు సమాచారం. ఇందులో సమంతా ప్రధాన హీరోయిన్‌గా నటిస్తుండగా, అమీ జాక్సన్ రెండో హీరోయిన్‌గా నటిస్తున్నట్లు తెలిసింది. ఇంకా పేరు నిర్ణయించని ఈ సినిమా ఏప్రిల్ లేదా మే మాసాల్లో సెట్స్‌మీదకు వెళ్లే అవకాశాలున్నాయి. ప్రస్తుతం విజయ్ 'పులి' షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు.